వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరంతో సచిన్ మంతనాలు: హైకమాండ్‌తో మాట్లాడాలని చిద్దు సజెస్ట్, వేలాడుతోన్న అనర్హత కత్తి..

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ రాజకీయాలు పూట పూటకో మలుపు తిరుగుతున్నాయి. సచిన్ పైలట్, అతని మద్దతుదారులకు స్పీకర్ సీపీ జోషి అనర్హత నోటీసులు ఇవ్వగా.. దానిని పైలట్ హైకోర్టులో సవాల్ చేశారు. శుక్రవారం పూర్తి వివరాలతో పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించనుంది. అయితే పైలట్‌ను సొంత గూటికి రావాలని కాంగ్రెస్ నేతలు పదే పదే కోరుతున్నా.. అంతగా స్పందించలేదు. ప్రియాంక గాంధీ చర్చలు జరిపినా కొలిక్కిరాలేదు. కానీ గురువారం ఆశ్చర్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరంతో సచిన్ పైలట్ మాట్లాడారు. దీనినిబట్టి చూస్తే తన సమస్యల పరిష్కారంపై హై కమాండ్ స్పష్టమైన హామీ కావాలని పైలట్ కోరుతున్నట్టు అర్థమవుతోంది.

అనర్హత నోటీసుపై సుప్రీం తలపు తట్టనున్న సచిన్, ఈసీ వద్దకు కూడా, పైలట్ సహా 19 మందికి స్పీకర్ నోటీసులతోఅనర్హత నోటీసుపై సుప్రీం తలపు తట్టనున్న సచిన్, ఈసీ వద్దకు కూడా, పైలట్ సహా 19 మందికి స్పీకర్ నోటీసులతో

చిదంబరంతో మంతనాలు

చిదంబరంతో మంతనాలు

అనర్హత నోటీసులపై రాజస్తాన్‌ హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత.. చిదంబరంతో పైలట్ మాట్లాడారు. చిదంబరం సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులు కూడా.. ఈ క్రమంలో ఆయనకు తన సమస్యను తీసుకెళ్తే.. పరిష్కారం అవుతోందని పైలట్ భావించి ఉంటారు. తాను పైలట్‌తో మాట్లాడానని, హై కమాండ్ పెద్దలతో మాట్లాడాలని సూచించానని ప్రముఖ పత్రికకు చిదంబరం తెలిపారు. అగ్ర నేతలతో సమావేశమైతే అన్నీ సమస్యలకు పరిష్కారం లభిస్తోందని సలహా ఇచ్చాను అని చిదంబరం తెలిపారు.

వెల్ కం..

వెల్ కం..

మరో కాంగ్రెస్ సీనియర్ నేత కూడా పైలట్ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరారు. వస్తే అతనికి సముచిత గౌరవం ఇస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని నొక్కి వక్కానించారు. కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే.. తిరిగి రావడంపై స్పష్టత ఇవ్వకపోవడంతో అనర్హత వేటుపై వేగంగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

 3 రోజుల్లోపు..?

3 రోజుల్లోపు..?

వాస్తవానికి స్పీకర్ నోటీసుల తర్వాత మూడురోజుల లోపు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వివరణ ఇవ్వకుంటే సదరు సభ్యుడు/సభ్యులు అనర్హతకు గురయ్యారని స్పీకర్ కార్యాలయం ప్రకటిస్తోంది. కానీ పైలట్ స్పష్టమైన సంకేతాలు ఇస్తే.. ఆ ప్రక్రియను నిలుపుదల చేయొచ్చని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమకు పైలట్ తిరిగి రావడం ముఖ్యమని, దాంతోపాటు రాజస్తాన్‌లో పార్టీ అధికారం కంటిన్యూ చేయడం కూడా అని తేల్చిచెప్పారు.

Recommended Video

Omar Abdullah & Karti Chidambaram Slams Ivanka Trump For Her Tweet On Jyoti Kumari
 మిగిలింది గంటలే

మిగిలింది గంటలే

రాజస్తాన్ స్పీకర్ పైలట్ సహా 18 మందికి ఇచ్చిన నోటీసులపై శుక్రవారం మధ్యాహ్నం లోపు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఈ లోపు చర్చలు జరిగి.. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థనను వెనక్కి తీసుకుంటే ఫరవాలేదు. లేదంటే అనర్హత వేటు వారి మేడపై వేలాడుతూనే ఉంది. మరోవైపు అనర్హత నోటీసులపై కాంగ్రెస్ తరఫున వాదిస్తోన్న అభిషేక్ సింగ్వి మాత్రం సరికాదని అంటున్నారు. పదో షెడ్యూల్‌ను 1992లో సవరించారని గుర్తుచేశారు. మరి అలాంటప్పుడు పాత పద్దతిలో అనర్హత నోటీసును ఎలా సవాల్ చేస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.

English summary
sachin Pilot spoke to Chidambaram over phone in a reach-out that came days after the Congress stripped him of the posts of Deputy Chief Minister and president of the Rajasthan PCC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X