వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ, జయ హవా: బిజెపికి 227 సీట్లు, జగన్‌‍కు 13

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్టీయేకు 227 సీట్లు వస్తాయని తాజాగా జరిగిన సర్వేలో వెల్లడైంది. వరుసగా మూడోసారి కూడా కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌కు భారీ నష్టం తప్పదని సర్వే తెలిపింది. 28 రాష్ట్రాల్లో సర్వే చేశారు.

కాంగ్రెసు పార్టీకి 84 సీట్లకు మించి రాకపోవచ్చునని ఇండియా టివి, టైమ్స్‌ నౌ, సిఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో స్పష్టమైంది. సర్వే ప్రకారం... గతంలో ఎన్నడూ లేని విధంగా యూపిఏ కూటమి దెబ్బతినే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెసు, తృణమూల్ కాంగ్రెస్, అన్నాడిఎంకె, కొత్తగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) వంటి ప్రాంతీయ పార్టీలు మంచి ఫలితాలను కనబరిచే అవకాశం ఉంది.

Survey predicts 227 seats for NDA, poor show by Congress

మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో బిజెపికే సొంతంగా 202 సీట్లు రావచ్చునని, 2009లో జరిగిన ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే కాంగ్రెస్‌కు ఏకంగా 117 సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎన్టీయేకు 217 నుంచి 237సీట్ల వరకూ, యూపిఏకు కూటమికి 91 నుండి 111 మధ్యే సీట్లు వస్తాయి.

ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 13 సీట్లు వచ్చే అవకాశముంది. ఎఎపికి 7, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు 24, తమిళనాడులో అన్నాడిఎంకె 27, యుపిలో ఎస్పీ 20, సీట్లు రావొచ్చు. లెఫ్ట్, అన్నాడిఎంకెలతో ఏర్పడ్డ మూడో కూటమికి 128, టిఎంసి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సహా ఏర్పడే నాలుగో ఫ్రంట్‌కు 87 వరకు సీట్లు రావొచ్చు.

English summary

 The BJP-led NDA is projected to get 227 seats in the coming Lok Sabha polls, while the Congress will be reduced to 84, according to an opinion poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X