వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డీసీపీ కొత్త వెర్షన్... సుశాంత్‌-రియా బంధాన్ని బ్రేక్ చేసేందుకు తెర వెనుక చాలానే జరిగిందా?

|
Google Oneindia TeluguNews

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అనేక మలుపులు తిరుగుతూనే ఉంది. తాజాగా ముంబైకి చెందిన ఓ సీనియర్ పోలీస్ అధికారి ఈ కేసుకు సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు కొద్ది నెలల ముందు.. అతని బంధువైన ఓ ఐపీఎస్ అధికారి తనను సంప్రదించినట్లు చెప్పారు. సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తిని అతని నుంచి విడదీసేలా ఆమెపై ఒత్తిడి తీసుకురావాలని తనను కోరినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ కేసుకు సంబంధించి మహారాష్ట్ర,బీహార్ పోలీసులు భిన్నమైన వాదనలు వినిపిస్తున్న తరుణంలో ముంబై పోలీస్ తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

Recommended Video

Sushant సూసైడ్ కేసులో ట్విస్ట్... సుశాంత్‌-రియా మధ్య రిలేషన్ బ్రేక్ చేసేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్!
డీపీపీ వెర్షన్...

డీపీపీ వెర్షన్...

ముంబై డీసీపీ పరంజిత్ సింగ్ దహియా ఇటీవల ఓ టీవీ చానెల్‌తో మాట్లాడుతూ సుశాంత్ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ బంధువు,హర్యానాకు చెందిన సీనియర్ ఐపీఎస్ ఓపీ సింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తనను సంప్రదించినట్లు చెప్పారు. రియా చక్రవర్తిని అనధికారికంగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి... సుశాంత్‌తో విడిపోయేలా ఆమెపై ఒత్తిడి తీసుకురావాలని ఓపీ సింగ్ తనను కోరినట్లు తెలిపారు. ఇందుకోసం ఫిబ్రవరి 18,25 తేదీల్లో వాట్సాప్ ద్వారా తనకు మెసేజ్‌లు పెట్టినట్లు చెప్పారు.

సుశాంత్‌ జీవితం నుంచి రియాను తప్పించాలని...

సుశాంత్‌ జీవితం నుంచి రియాను తప్పించాలని...


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను రియా చక్రవర్తి పూర్తిగా తన నియంత్రణలో పెట్టుకుందని అతని కుటుంబం భావించిందని... అందుకే ఆమెను అతని జీవితం నుంచి తప్పించాలని వాళ్లు ప్రయత్నించారని డీసీపీ చెప్పుకొచ్చారు. ఐపీఎస్ ఓపీ సింగ్ ఫిబ్రవరి 5న ముంబైకి వచ్చినప్పుడు తాను ఇక్కడికి వచ్చినట్లు సుశాంత్‌కి సమాచారం ఇవ్వాలని తనను కోరినట్లు ఆరోపించారు. అంతేకాదు,ఎలాంటి ఫిర్యాదు,విచారణ లేకుండా మిరంద అనే ఓ వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని తనను కోరినట్లు చెప్పారు. అయితే ఎవరికీ ఫోన్లు చేసి వారిని తను పోలీస్ స్టేషన్‌కు పిలిపించలేనని మర్యాదపూర్వకంగా తాను ఓపీ సింగ్‌తో చెప్పినట్లు డీసీపీ తెలిపారు. ఓపీ సింగ్ చెప్పినవన్నీ చట్టానికి విరుద్దమన్నారు.

సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయలేదా?

సుశాంత్ తండ్రి ఫిర్యాదు చేయలేదా?

సుశాంత్ సింగ్ భద్రతపై ఆయన తండ్రికి అనుమానం,భయం ఉండి ఉంటే... ఈ ఏడాది ఆరంభంలోనే ముంబై పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేసి ఉండాల్సిందన్నారు డీసీపీ పరంజిత్. మిరందా అనే వ్యక్తిని పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని ఫిబ్రవరి 25న వాట్సాప్ మెసేజ్ ద్వారా సుశాంత్ తండ్రి తనను కోరారని చెప్పారు. అయితే ఆయన నుంచి ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని చెప్పారు. మరోవైపు ఫిబ్రవరి 25నే తాను ముంబై పోలీసులను అప్రమత్తం చేశానని... సుశాంత్ లైఫ్ ప్రమాదంలో ఉందని వారితో చెప్పానని ఇటీవల అతని తండ్రి ఓ వీడియో విడుదల చేశారు.

కేసు సీబీఐకి బదిలీ...

కేసు సీబీఐకి బదిలీ...

బీహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుశాంత్ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు తాజాగా కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది. సుశాంత్ మరణంపై అనుమానాల నేపథ్యంలో... ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని బిహార్ సీఎం నితీశ్ కుమార్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసును సీబీఐకి బ‌దిలిచేయడాన్ని మ‌హారాష్ర్ట ప్ర‌భుత్వం వ్య‌తిరేకించింది. బీహార్ పోలీసులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, వాస్త‌వానికి ఈ కేసు ద‌ర్యాప్తు చేయ‌డానికి ముంబై పోలీసుల‌కే అధికారం ఉంద‌ని తెలిపింది. కొంతమంది రాజకీయ నేతల ప్రోద్బలంతోనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించింది. అసలు సుశాంత్ తండ్రి మహారాష్ట్రలో ఇప్పటివరకూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని సుప్రీంకోర్టుకు తెలిపింది.

సుప్రీంలో రియా పిటిషన్‌పై విచారణ...

సుప్రీంలో రియా పిటిషన్‌పై విచారణ...

సుశాంత్ ఆత్మహత్య కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని రియా సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ముంబై పోలీసుల తీరును తప్పు పట్టింది. సుశాంత్ కేసును దర్యాప్తు చేసేందుకు ముంబై వచ్చిన అధికారిని బలవంతంగా క్వారెంటైన్ చేయడాన్ని తప్పు పట్టింది. కేసు విచారణ పారదర్శకంగా,నిజాయితీగా సాగేలా చూడాలని ఆదేశించింది.ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది.

ఆదిత్య థాక్రేను ఇరికించే కుట్ర..?

ఆదిత్య థాక్రేను ఇరికించే కుట్ర..?

సుశాంత్ సింగ్ కేసులో ఇటీవల బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆదిత్య థాక్రేను టార్గెట్ చేయడం సంచలనం రేపింది. తాజాగా శివసేన నేత దీనికి కౌంటర్ ఇచ్చారు. సుశాంత్ కేసులో ఆదిత్యను ఇరికించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వం అధికారంలో ఉండటం ప్రతిపక్షం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు,సుశాంత్ కేసులో ఆదిత్యను ఇరికించాలని చూస్తున్నవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

English summary
A senior Mumbai police official has claimed that Sushant Singh Rajput's brother-in-law, an IPS officer, had asked him to pressurise the actor's girlfriend Rhea Chakraborty to end their relationship.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X