Sushant Singh: సార్ హీరో కేసులో సీబీఐ ఏం చేసింది ?, ఏం చేస్తోంది ?, మాకు తెలియాలి, సుప్రీం కోర్టులో పిల్!
ముంబాయి/ న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR) అనుమానాస్పదస్థితిలో మృతి చెంది కొన్ని నెలలు దాటిపోయింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు సీబీఐకి అప్పగించి నాలుగు నెలలు కావస్తోంది. ఇంత వరకు సీబీఐ అధికారులు ఈ కేసును ఎంత వరకు విచారణ చేశారు ?, సీబీఐ విచారణ దర్యాప్తులో ఇంతవరకు తేలిన విషయాలు ఏమిటి ? సీబీఐ ఏం చేసింది ?, ఇక ఏం చేస్తోంది ? మాకు తెలియాలి అంటూ ఓ న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీబీఐ ఇంకా ఎంతకాలం సుశాంత్ సింగ్ విచారణ చేస్తుందో అర్థం కావడం లేదు, అసలు ఏంది ఈ కథ, త్వరగా ఫైనల్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యాలని సుప్రీం కోర్టులో పిల్ దాఖలు కావడం ఇప్పుడు తీవ్రచర్చకు దారితీసింది.

హీరో సుశాంత్ సింగ్ కలకలం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ జూన్ 14వ తేదీన ముంబాయిలోని బాంద్రాలోని ఆయన ఇంటిలో అనుమానాస్పదస్థితిలో మరణించాడు. సుశాంత్ సింగ్ మరణించి కొన్ని నెలలు దాటిపోయింది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడని అప్పట్లో ముంబాయి పోలీసులు చెప్పారు. బాలీవుడ్ హీరోగా అంచలంచెలు ఎదుగుతున్న యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని ముంబాయి పోలీసులు చెప్పడంతో కలకలం రేపడంతో పాటు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

సీబీఐ ఎంట్రీ
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి కేసును ఆగస్టు 19వ తేదీ సీబీఐకి అప్పగిస్తు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి సీబీఐ అధికారులు సుశాంత్ సింగ్ కేసును విచారణ చేస్తున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ కేసు విచారణను సీబీఐ అధికారులు ఆలస్యం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు

సార్.... సీబీఐ ఏం చేసింది ?, ఇక ఏం చేస్తోంది
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (SSR)కేసు సీబీఐకి అప్పగించి మూడు నెలల పూర్తి అయిపోయింది, ఇంత వరకు ఈ కేసులో సీబీఐ అధికారులు ఏం చేశారో తెలీదు, ఇక ముందు ఏం చేస్తారో కూడా స్పష్టతలేదు, త్వరగా ఈ కేసు విచారణ పూర్తి చేసి ఎఫ్ఐఆర్ తో పాటు సంపూర్ణ నివేదిక కోర్టులో సమర్పించాలని సీబీఐ అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యాలని ప్రముఖ న్యాయవాది పునీత్ దండా మనవి చేస్తూ సుప్రీం కోర్టులో పిల్ (PIL) దాఖలు చేశారు.

బాలీవుడ్ డ్రగ్స్ కేసు కలకలం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ జూన్ 14వ తేదీన ముంబాయిలోని బాంద్రాలోని ఆయన ఇంటిలో అనుమానాస్పదస్థితిలో మరణించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ ను కుదిపేసింది. ఇదే సమయంలో బాలీవుడ్ లో డ్రగ్స్ కేసు, ముంబాయి డ్రగ్స్ మాఫియా తెరమీదకు వచ్చింది. ముంబాయి డ్రగ్స్ కేసులో ఇంత వరకు దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్ ,కరణ్ జోహార్ తో పాటు అనేక మంది సెలబ్రిటీలను ఎన్ సీబీ అధికారులు విచారణ చెయ్యడం కలకలం రేపింది.

SSR, Kangana, Deepika
బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ లోని కొందరు సెలబ్రీల విషయంపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇక కంగనా రనౌత్ అయితే సుశాంత్ సింగ్ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై, శివసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసి రచ్చ రచ్చ చేసింది. ఇప్పుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విషయంలో సీబీఐ అధికారులు నిర్లక్షంగా కేసు విచారణ చేస్తున్నారని సుప్రీం కోర్టులో పిల్ దాఖలు కావడం మరోసారి చర్చకు దారితీసింది.