వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.15 కోట్లు బదిలీ: రియా చక్రవర్తికి కాస్త రిలీఫ్, ఆధారాలు లభించలేదు, బెయిల్ రావడంతో..

|
Google Oneindia TeluguNews

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసు విచారణ కొనసాగుతోంది. అయితే సుశాంత్ ఖాతా నుంచి రూ.15 కోట్లు అతని ప్రియురాలు రియా చక్రవర్తి బదిలీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. అయితే సుశాంత్ ఖాతా నుంచి రియా నగదు బదిలీ చేసిందనే అంశానికి సంబంధించి ఆధారాలు లభించలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో మరీ ఆ రూ.15 కోట్లు ఏమయ్యాయనే ప్రశ్న తలెత్తుతోంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపైనే సీబీఐ ఫోకస్ చేసింది. రియా చక్రవర్తి పాత్రపై ఆరు కోణాల్లో ఎంక్వైరీ చేస్తోంది. ఇండస్ట్రీలో వైరుద్యం, కావాలనే వరే చేయడం, డ్రగ్ కేసు, మానసిక పరిస్థితి తదితర కోణాల్లో విచారణ జరుగుతోంది. అయితే జూన్ 8వ తేదీన సుశాంత్ ఇంటికి రియా వెళ్లింది. అయితే రియా చక్రవర్తి తన కుమారుడి ఖాతా నుంచి నగదు బదిలీ చేసిందని.. అలాగే సూసైడ్ చేసుకునేందుకు కారణమయ్యిందని సుశాంత్ తండ్రి కేకే సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారు విచారణ చేపట్టారు. అయితే రియా నగదు బదిలీకి సంబంధించి తమకు ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.

Sushant Singh Rajput case: No proof of Rhea siphoning off funds..

Recommended Video

Rhea Chakraborty Granted Bail by Bombay High Court రియా చక్రవర్తి ఇక సేఫ్...!! || Oneindia Telugu

నగదుకు సంబందించి కాదు.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆయన మాజీ మేనేజర్ దిశా మృతికి మధ్య సంబంధం లేదన్నారు. దీనికి సంబంధించి తమకు ఆధారాలు లభించలేదన్నారు. సుశాంత్ మృతికి సంబంధించి ఇటీవల ఎయిమ్స్ వైద్యులు కూడా నివేదిక అందజేశారు. సుశాంత‌్‌ది ముమ్మాటికీ హత్య కాదు ఆత్మహత్య అని నిపుణులు చెబుతుండగా.. ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ కేసులో గత నెలలో రియాను అరెస్ట్ చేయగా.. బెయిల్ లభించింది. కానీ ఆమె సోదరుడు షౌకిక్ చక్రవర్తి మాత్రం బెయిల్ లభించలేదు.

English summary
sushanth father KK Singh had also alleged that Rhea Chakraborty had siphoned off a sum of Rs 15 crore from the actor's bank accounts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X