వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుశాంత్ సింగ్ మృతిలో ట్విస్టు: అప్పుడు హత్యే అన్న డాక్టర్ ఇప్పుడు యూటర్న్..ఆడియో టేపులు లీక్ ?

|
Google Oneindia TeluguNews

ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్య కాదు ఆత్మహత్యే అని ఎయిమ్స్ డాక్టర్లు ఇచ్చిన నివేదికతో కేసు ఓ కొలిక్కి వచ్చిందని అంతా భావించారు. కానీ మొదటి నుంచి చాలా దగ్గరగా కేసును ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్న జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ మాత్రం కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తూ వస్తోంది. తాజాగా సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య కాదు హత్యే అంటూ చెప్పే ప్రయత్నంలో భాగంగా కొన్ని రుజువులను సాక్ష్యాలను బయటపెట్టింది ఆ ఛానెల్.

 ఆగష్టు 22న ఎయిమ్స్ డాక్టర్ ఏం చెప్పారు

ఆగష్టు 22న ఎయిమ్స్ డాక్టర్ ఏం చెప్పారు

ఆగష్టు 22న ఎయిమ్స్ డాక్టర్ సుధీర్ గుప్తా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోస్టుమార్టం వెంట వెంటనే ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారని చెబుతున్న గదిలో క్రైమ్ సీన్‌‌ను ధ్వంసం చేశారని చెప్పారు. కొన్ని ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారనే అనుమానం సైతం డాక్టర్ సుధీర్ గుప్తా లేవనెత్తారు. ధ్వంసం చేశారని కచ్చితంగా చెప్పలేము కానీ ఆ ఆధారాలను ఎందుకు సేకరించలేకపోయారు అనే అనుమానం వ్యక్తం చేశారు.

 యూటర్న్ పై అనుమానాలు

యూటర్న్ పై అనుమానాలు

ఇప్పుడు కేసులో కీలకంగా మారే ఈ ఆధారాలు లేకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటూ గతంలో అంటే ఆగష్టు 22వ తేదీన సుధీర్ గుప్తా చెప్పారు. అంతేకాదు పోస్టుమార్టం రిపోర్టులో కూడా కొన్ని లోపాలున్నాయన్న సుధీర్ గుప్తా ఇప్పుడు మాట మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్యే అని డాక్టర్ గుప్తా మాట మార్చారు.

Recommended Video

Vet Doctor Murder Case Solved, Four People Arrested
 నేరుగా మార్చురీకి ఎలా తీసుకెళ్లారు

నేరుగా మార్చురీకి ఎలా తీసుకెళ్లారు

నాడు సుశాంత్ సింగ్ మృతి చెందగానే హాస్పిటల్‌కు తీసుకెళ్లి నేరుగా మార్చురీకి తీసుకెళ్లడం జరిగిందని నాడు చెప్పారు డాక్టర్ గుప్తా.సుశాంత్ సింగ్ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించకుండానే మార్చురీ గదికి ఎలా తీసుకెళ్లారని ఆగష్టు 22న ప్రశ్నించారు. అంతేకాదు పోస్టుమార్టం రిపోర్టులో సుశాంత్ సింగ్ మృతి చెందిన సమయంను కూడా పొందుపర్చలేదని డాక్టర్ సుధీర్ గుప్తా చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ సుధీర్ గుప్తా యూటర్న్ తీసుకోవడం వెనక మరేమైనా కుట్ర జరుగుతోందా.. లేకుంటే అతినపై ఎవరైనా ఒత్తిడి తీసుకొస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ ఆధారాలు ధ్వంసమై ఉండి ఉంటే అది హత్యే అని చెప్పిన డాక్టర్ సుధీర్ గుప్తా ఏ రకంగా తిరిగి దీన్ని ఆత్మహత్యగా చెప్పారనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి.

మొత్తానికి జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ బయటపెట్టిన డాక్టర్ సుధీర్ గుప్తా ఆడియో టేపులతో సుశాంత్ సింగ్ కేసు మరో మలుపు తీసుకుంది. ఇంకా ఈ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

English summary
The AIIMs Doctor Dr. Sudhir Gupta who earlier said that Sushanth singh was murdered have now taken a u turn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X