నా కొడుకులు పేదరికంతో చనిపోవద్దనే: లాలూ ప్రసాద్, మోడీ సవాల్

Posted By:
Subscribe to Oneindia Telugu

పాట్నా: రూ.60 కోట్ల అక్రమ ఆస్తులు కలిగిన కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన కుమారులు తేజ్ ప్రతాప్‌, తేజస్వి యాదవ్‌లను వేనుకేసుకొచ్చారు. బీహార్‌ రాజధాని పట్నాలో రూ.60 కోట్లు విలువ చేసే రెండెకరాల ఆస్తులున్నట్లు తేజ్ ప్రతాప్‌, తేజస్వి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

యోగి ఆదిత్యనాథ్ గురించి ఆసక్తికర విషయం!

ఈ విషయమై లాలూ మీడియాతో మాట్లాడారు. తన కుమారులు పేదరికంతో చనిపోకూడదని, వారికి బిజినెస్‌ చేసే హక్కు ఉందన్నారు. పట్నా శివారు ప్రాంతాల్లో లాలూ కుమారులకు రూ.60 కోట్లు విలువ చేసే రెండెకరాల భూమి ఉంది.

lalu prasad yadav

ఇందులో లాలూ భార్య రాబ్రి దేవికి కూడా వాటా ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ స్థలంలో రూ.500 కోట్లతో బిహార్‌లోనే అతిపెద్ద మాల్‌ నిర్మించే యోచనలో ఉన్నట్లు లాలూ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో సగం వాటా బిల్డర్‌కి మరో సగం తమ కంపెనీకి దక్కుతుందన్నారు.

దీనిపై బీజేపీ బీహార్ చీఫ్ సుశీల్ కుమార్ మోడీ స్పందించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు లాలూ కుటుంబంపై చర్యలు తీసుకునే దమ్ముందా అని సవాల్ విసిరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sushil Modi dares CM Nitish Kumar to take action against Lalu Yadav's family.
Please Wait while comments are loading...