వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ

|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీని బీజేపీ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించాలని నిర్ణయించింది. కాగా, ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటికీ.. రాష్ట్ర మంత్రివర్గంలో పదవి చేపట్టేందుకు ఆయన నిరాకరించారు.

అక్టోబర్ 8న కేంద్రమంత్రి, ఎల్జేపీ పార్టీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ మరణించడంతో ఇక్కడ రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. ప్రస్తుతం ఎల్జేపీ అధినేతగా ఆయన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఉన్నారు. కాగా, ఖాళీగా ఉన్న రాంవిలాస్ పాశ్వాన్ స్థానంలో సుశీల్ మోడీని బీజేపీ రాజ్యసభకు పంపించే ఏర్పాట్లు చేసింది.

 Sushil Modi Named as BJP Candidate for Rajya Sabha By-election in Bihar

కాగా, డిసెంబర్ 14న ఈ రాజ్యసభ స్థానానికి ఉఫఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ రోజే ఓట్ల లెక్కింపు కూడా జరగనుంది. యాదృచ్ఛికంగా, విజేత ప్రస్తుత పదవీకాలంలో ఈ రాజ్యసభ బెర్త్ మూడవసారి కావడం గమనార్హం.

Recommended Video

GHMC Elections 2020 : రోడ్ సైడ్ పానీ పూరి తింటున్న కల్వకుంట్ల కవిత MLC Kavitha Eats Pani Puri

2018 లో ఈ స్థానానికి బిజెపి రవిశంకర్ ప్రసాద్ మొదటిసారి ఎన్నికయ్యారు. 2019‌లో లోక్‌సభకు ఎన్నికైన తరువాత రాజీనామా చేశారు. జూన్ 2019 లో, ఉప ఎన్నిక జరిగిన తరువాత రామ్ విలాస్ పాస్వాన్ బిజెపి, జెడి(యు) మద్దతుతో ఎన్నికయ్యారు. ఇప్పుడు, మూడవసారి ఉప ఎన్నిక జరగనుంది.

English summary
The BJP has nominated former Bihar deputy chief minister Sushil Kumar Modi as its candidate for the Rajya Sabha bypoll in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X