వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపిలో మోడీ X మోడీ!: నితీష్ కుమార్ బాంబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బాంబు పేల్చారు. 2010లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాడు గుజరాత్ సీఎంగా ఉన్న ప్రధాని మోడీని ప్రచారానికి రానివ్వకపోవడానికి ప్రస్తుత బిజెపి బీహార్ అధ్యక్షుడు సుశీల్ కుమార్ మోడీయేనని, తాను కాదని వ్యాఖ్యానించారు.

ప్రధాని నరేంద్ర మోడీ 2010లో గుజరాత్ సిఎంగా ఉన్నారు. ఆ సమయంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనను ప్రచారానికి రావొద్దని చెప్పారు. దీనిపై ఓ ఆంగ్ల చానల్ ఇంటర్వ్యూలో నితీష్ కుమార్ మాట్లాడుతూ... ఆనాడు మోడీని రానివ్వకపోవడానికి కారణం తాను కాదన్నారు.

సుశీల్ కుమార్ మోడీయే బాధ్యులని చెప్పారు. నేను సుశీల్ కుమార్ మోడీ మాటలను విశ్వసించానని, అందుకే నరేంద్ర మోడీ ప్రచారానికి నిరాకరించవలసి వచ్చింది చెప్పారు. ప్రధాని మోడీతో విభేదాలకు సుశీల్ కుమార్ మోడీయే బాధ్యత వహించాలని అభిప్రాయపడ్డారు.

Sushil Modi responsible for rift with Narendra Modi: Nitish Kumar

దాద్రి ఘటనకు యుపి సర్కారే కారణం: పారికర్

దాద్రి సంఘటనకు యూపీ ప్రభుత్వానిదే బాధ్యత అని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ మంగళవారం అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న కారణంగానే ఆ సంఘటన జరిగిందన్నారు. శాంతిభద్రతల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్న కారణంగానే యుపిలో దాద్రిలాంటి సంఘటనలు జరిగాయన్నారు.

దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఆర్థిక పరోగతి, ఇతర అభివృద్ధికోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను అడ్డుకోవడానికి ఈ సంఘటనలను ఉపయోగించుకుంటున్నారని పారికర్ అన్నారు. ఈ సంఘటనలపై ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.

గొడ్డుమాంసం పైన రాజకీయాలను ఒక పథకం ప్రకారం జరుగుతున్న కుట్రగా ఆయన అభివర్ణించారు. ఇలాంటి సున్నితమైన సమస్యపై వివాదాస్పద ప్రకటనలు చేయడం బిజెపి నాయకులు కూడా మానుకోవాలని సూచించారు.

English summary
Bihar Chief Minister Nitish Kumar has claimed that he wasn't responsible for stopping Narendra Modi, the then chief minister of Gujarat, from campaigning in 2010 assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X