వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ నలుగురు స్త్రీలు: బీజేపీకి చుక్కలు (ఫోటోలు)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అవినీతి యుపీఏ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించండి అంటు నినాదాలు చేసి గద్దె ఎక్కిన బీజేపీ ఇప్పుడు సొంత పార్టీ నాయకుల అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోలేక తలలు పట్టుకుంటున్నది. ముఖ్యంగా నలుగురు మహిళ నేతలతో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇరుకున పడింది.

ప్రతి రోజు ప్రతిపక్షాలు విరుచుకుపడుతుండటంతో బీజేపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. తమ నేతలు ఏ తప్పు చెయ్యలేదని అంటున్నారు. వారిని కాపాడుకొవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. సీనియర్ నాయకులు సైతం సమాధానం చెప్పలేకపోతున్నారు.

గతంలో యుపీఏ ప్రభుత్వం మీద మాటల తూటాలు పేల్చిన బీజేపీలోని మహామహులు సైతం విపక్షాలు సంధిస్తున్న ఆస్తాలకు సమాదానం ఇవ్వలేక పోతున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇంకోకరు ముఖ్యమంత్రి, మరొకరు రాష్ట్ర మంత్రి, ఆ నలుగురిని ఎలా కాపాడాలి అని బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నారు.

విదేశాంగ మంత్రికి విదేశీ చిక్కులు

విదేశాంగ మంత్రికి విదేశీ చిక్కులు

ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ విదేశాలలో సంచరించడానికి సహకరించారని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. లలిత్ మోదీ బ్రిటన్ నుండి పోర్చుగల్ వెల్లడానికి సహకరించారని ఆరోపణలు.

ఆ సంతకం సీఎం కుర్చికి ఎసరు తెస్తుందా

ఆ సంతకం సీఎం కుర్చికి ఎసరు తెస్తుందా

లలిత్ మోదీ బ్రిటన్ వెళ్లడానికి వీలుగా ఇమిగ్రేషన్ పత్రాల మీద రాజస్థాన్ సీఎం వసుంధర రాజే సంతకం చేశారని వెలుగు చూసింది. సంతకం చేసింది తానే అని వసుంధ రాజే చెప్పారు.

సర్థిఫికెట్లు తెచ్చి పెట్టిన తంటా

సర్థిఫికెట్లు తెచ్చి పెట్టిన తంటా

విద్యార్హతల అంశంపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్పృతి ఇరాని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. ఢిల్లీ కోర్టులో ఈ విషయంపై కేసు నమోదు కావడంతో ఇరానీకి పెద్ద తల నోప్పి మొదలైయ్యింది.

విద్యార్థుల వస్తువుల విషయంలో

విద్యార్థుల వస్తువుల విషయంలో

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బుక్ లు, వాటర్ ఫిల్టర్లు కొనుగోలు చేసే విషయంలో గోల్ మాల్ జరిగిందని, అందుకు మహారాష్ట్ర మంత్రి పంకజ ముండేకి రూ. 200 కోట్ల ముడుపులు అందాయని ఆరోపణలు.

సమాధానం చెప్పలేక

సమాధానం చెప్పలేక

ఈ నలుగురు అమ్మలను వెనుక వేసుకుని రావడానికి బీజేపీ నాయకులు తీరికలేకుండ ఆలోచిస్తున్నారు. అయితే వారితో రాజీనామ చెయ్యించే ఆలోచన బీజేపీకి లేదని సమాచారం.

అన్ని గమనిస్తున్న ఆర్ఎస్ఎస్

అన్ని గమనిస్తున్న ఆర్ఎస్ఎస్

ఈ నలుగురు మహిళా నేతల విషయంలో బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తున్నారు అని ఆర్ఎస్ఎస్ నాయకులు గమనిస్తున్నారు.

English summary
The Bharatiya Janata Party has always prided on its women power and given them due weight in the political scheme of things.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X