వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మృతి తర్వాత అనుప్రియ: మోడీ చెక్ చేస్తున్నారా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ మహిళా నేతలను పరీక్షిస్తున్నారా? వరుస ఎన్నికల నేపథ్యంలో తొలుత సుష్మా స్వరాజ్, తర్వాత స్మృతి ఇరానీ, ఇప్పుడు అనుప్రియా పటేల్.. ఇలా ప్రతిసారి ఓ మహిళకు బీజేపీ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

మోడీ మంత్రివర్గం పూర్తి జాబితా: ఎవరెవరికి ఏయే శాఖమోడీ మంత్రివర్గం పూర్తి జాబితా: ఎవరెవరికి ఏయే శాఖ

తద్వారా, రాజకీయాల్లో మహిళలను ఆకట్టుకునేందుకు, ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు ఓ మహిళ స్థానంలో మరో మహిళను చెక్ చేస్తున్నారా అనే చర్చ సాగుతోంది.

తొలిసారి అనుప్రియ: ఆ ముగ్గురికి మోడీ ఛాన్స్ వెనుకతొలిసారి అనుప్రియ: ఆ ముగ్గురికి మోడీ ఛాన్స్ వెనుక

2014 ఎన్నికల నుంచి ప్రధాని నరేంద్ర మోడీ స్మృతి ఇరానీకి ప్రాధాన్యత ఇచ్చారు. ఆమె అమేథీ నుంచి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో రాహుల్‌కు చుక్కలు చూపించారు.

అమేథీలో జరిగిన ర్యాలీలో మోడీ.. స్మృతి ఇరానీని ఉద్దేశించి సోదరి అని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం స్మృతికి హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖను అప్పగించారు. కొద్ది రోజుల క్రితం వేముల రోహిత్ ఆత్మహత్య వివాదం చెలరేగినప్పుడు.. పార్లమెంటులో స్మృతి చేసిన ప్రసంగాన్ని ప్రధాని మోడీ ముగ్ధులయ్యారు. ఆమె ప్రసంగంపై సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు.

Sushma, Smriti and now Anupriya: Does BJP back a woman to check a woman?

సుష్మా స్వరాజ్‌కు కౌంటర్‌గా స్మతిని తెరపైకి తీసుకు వచ్చారనే వాదనలు కూడా ఉన్నాయి. బీజేపీలో సుష్మా స్వరాజ్ కీలక నేత. ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీని మోడీ నేతృత్వంలోని సుష్మా స్వరాజ్ అని కూడా అంటారని చెబుతున్నారు. తద్వారా మోడీ, అమిత్ షా.. స్మృతికి ఇచ్చే ప్రాధాన్యం ఏమిటో తెలుస్తోంది.

ఇప్పుడు అనూహ్యంగా అనుప్రియా పటేల్‌ను మోడీ తెరపైకి తీసుకు వచ్చారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ, కుర్మి, దళిత నేతలను ఒక్కొక్కర్ని తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇందులో అనుప్రియా పటేల్ కుర్మి వర్గానికి చెందినవారు.

యూపీలో బీజేపీ ఫేస్‌గా వరుణ్ గాంధీ, స్మృతి ఇరానీ తదితరుల పేర్లు వినిపించాయి. ఇప్పుడు అనూహ్యంగా అనుప్రియా పటేల్ తెరపైకి వచ్చారు. స్మృతి ఇరానీని హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ నుంచి తొలగించి, ఆమెకు జౌళీశాఖకు మార్చారు. ప్రాధాన్యత శాఖ నుంచి ఆమెను అప్రధాన్యత శాఖకు మార్చారని అంటున్నారు.

English summary
The removal of Smriti Irani from the HRD ministry in a major Cabinet reshuffle by the NDA government on Tuesday (July 5) has, besides giving rise to all sorts of speculation, given rise to the question: Does the BJP indulge in a politics of backing one woman to keep another in check?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X