వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ పెళ్లి సమయానికి వస్తావ్: అమెరికాలో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న వ్యక్తికి సుష్మా హామీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

15 రోజుల్లో పెళ్లి.. పాస్‌పోర్టు పోయింది!

న్యూఢిల్లీ: తన పెళ్లి తేదీ దగ్గరపడుతున్న సమయంలో స్వదేశానికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉన్న ఓ భారత యువకుడు పాస్‌పోరోట్ పోగొట్టుకున్నాడు. ఈ సమయంలో ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆమె వెంటనే స్పందించారు.

ఏదైనా సమస్య ఉందని పోస్ట్ చేయగానే సుష్మా స్వరాజ్ వెంటనే స్పందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ యువకుడికి కూడా ఆమె హామీ ఇచ్చారు. నీ పెళ్లి సమయానికి నీవు ఇంటికి చేరుకుంటావని అతనికి భరోసా ఇచ్చారు.

పెళ్లికి ముందు పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడు

పెళ్లికి ముందు పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నాడు

భారత్‌కు చెందిన రవితేజ వాషింగ్టన్‌లో ఉంటున్నాడు. ఆగస్టులో తన పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆగస్ట్ 10న భారత్ వచ్చేందుకు సిద్ధమయ్యాడు. రెండు రోజుల ముందు రావాలని అనుకున్నాడు. అయితే అంతలోనే తన పాస్ పోర్టును ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఈ విషయమై సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు.

సాయం చేయాలంటూ ట్వీట్

సాయం చేయాలంటూ ట్వీట్

తన పాస్ పోర్టు పోయిందని, మరి కొద్ది రోజుల్లో తన పెళ్లి ఉందని, ఇప్పుడు తనకు ఉన్న ఒకే ఒక నమ్మకం మీరు, దయచేసి సాయం చేయండని రవితేజ ట్వీట్ చేశారు. దీనిపై ఆమె వెంటనే స్పందించారు. తాను సాయం చేస్తానని హామీ ఇచ్చారు. 'సుష్మా గారు వాషింగ్టన్ డీసీలో నేను పాస్ పోర్ట్ పోగొట్టుకున్నాను. ఆగస్ట్ 13-15 మధ్య నా పెళ్లి ఉంది. ఆగస్ట్ 10న భారత్ రావాల్సి ఉంది. నాకు సహకరించండి. నా పెళ్లికి నేను సమయానికి ఉండేలా చూడండి. నాకు ఉన్న చివరి ఆశ మీరే.' అని పేర్కొన్నారు.

రాంగ్ టైంలో పాస్ పోర్ట్ పోగొట్టుకున్నారు

రాంగ్ టైంలో పాస్ పోర్ట్ పోగొట్టుకున్నారు

ఈ సమయంలో నువ్వు పాస్ పోర్టు పోగొట్టుకోవటం విచారకరమని, రాంగ్ టైంలో పాస్ పోర్ట్ పోగొట్టుకున్నారని, అయితే నీ పెళ్లి సమయానికి నీవు భారత్ చేరుకునేలా మేం తప్పకుండా సాయం చేస్తామని సుష్మా స్వరాజ్ అతనికి చెప్పారు. మానవతా దృక్పథంతో రవితేజకు పాస్ పోర్టు ఇవ్వాలని అమెరికాలోని భారత రాయబారి నవతేజ్ సర్నాకు సూచించారు. దీనిపై రవితేజ ఆమెకు థ్యాంక్స్ చెప్పారు.

సుష్మాకు నెటిజన్ల నుంచి ప్రశంసలు

నెటిజన్లు కూడా ఎప్పటిలాగే సుష్మా స్వరాజ్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కు హ్యాట్సప్, మీరు మా విదేశాంగ శాఖ మంత్రిగా ఉండటం మా అదృష్టం అని కితాబిస్తున్నారు. మీకు సెల్యూట్ అంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీరు విదేశాంగ శాఖ మంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామని మరొకరు పేర్కొన్నారు.

English summary
It seems External Affairs Minister Sushma Swaraj's Twitter handle has become something of a one stop shop for many Indians facing trouble abroad or those with visa or passport-related issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X