వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సాధ‌న‌లో చిన్న‌మ్మ‌గా: సుష్మ మృతితో వెంక‌య్య ఉద్వేగం: కిష‌న్‌రెడ్డి కంట‌త‌డి..!

|
Google Oneindia TeluguNews

కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వ‌రాజ్ హ‌ఠాన్మ‌ర‌ణంతో ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు ఉద్వేగానికి లోన‌య్యారు. సుష్మ మృతి తెలిసిన వెంట‌నే వెళ్లిన వెంక‌య్య నాయుడు ఆమె బౌతిక ఖాయం వ‌ద్ద విష‌ణ్ణ వ‌ద‌నంతో క‌నిపించారు. ఉబికి వ‌స్తు న్న క‌న్నీటిని నియంత్రించుకున్నారు. వెంక‌య్య నాయుడుతో పాటుగా వెళ్లిన హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి సుష్మ భౌతిక ఖాయం చూడ‌గానే క‌న్నీటి ప‌ర్యంతమ‌య్యారు. ఇక‌..తెలంగాణ సాధ‌న‌లో సుష్మా స్వ‌రాజ్ పాత్ర ఎప్ప‌టికీ గుర్తుండిపోతుంది. 2012లోనే లోక్‌స‌భ విపక్ష నేత‌గా తెలంగాణ అంశాన్ని ప్ర‌స్తావించి..స‌వాల్ విసిరారు. ఇక‌, 2014లో బిల్లు ఆమోదం స‌మ‌యంలో అప్పుడు నెల‌కొన్ని ప‌రిస్థితుల నేప‌థ్యంలో బిల్లు ఆమోదానికి పూర్తిగా స‌హ‌క‌రించారు.

<strong>సోనియాగాంధీని ఢీ కొట్టిన ధీర వనిత..జాతీయతను ప్రశ్నించిన ఉక్కు మహిళ</strong>సోనియాగాంధీని ఢీ కొట్టిన ధీర వనిత..జాతీయతను ప్రశ్నించిన ఉక్కు మహిళ

తెలంగాణ సాధన‌లో..చిన్న‌మ్మ‌గా..

తెలంగాణ సాధన‌లో..చిన్న‌మ్మ‌గా..

తెలంగాణ సుదీర్ఘ క‌ల సాధ‌న‌లో చిన్న‌మ్మ‌గా సుష్మ స్వ‌రాజ్ పాత్ర ఇప్పుడు తెలంగాణ నేత‌లు గుర్తు చేసుకుంటున్నా రు. తెలంగాణ‌కు తొలి నుండి బీజేపీ మ‌ద్ద‌తుగా ఉంది. లోక్‌స‌భ‌లో సుష్మ ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న స‌మ‌యంలో 2012లోనే స‌భ లో సుష్మ నాటి ప్ర‌భుత్వాన్ని నిల‌దీసారు. 2009లో తెలంగాణ పైన చేసిన ప్ర‌క‌ట‌న ఏమైందంటూ..రాష్ట్రప‌తి ప్ర‌సం గంలో ప్ర‌స్తావించిన తెలంగాణ పైన నిర్ణ‌యం ఎందుకు తీసుకోర‌ని ప్ర‌శ్నించారు. ఆ స‌మ‌యంలోనే యువ‌కులు ఎవ రూ తెలంగాణ కోసం ఆత్మ‌త్యాగాల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని..ఖ‌చ్చితంగా తెలంగాణ వ‌స్తుంద‌ని భరోసా ఇచ్చారు. ఇక‌, 2014 లో పార్ల‌మెంట్‌లో తెలంగాణ బిల్లు విష‌యంలో నెల‌కొన్ని గంద‌ర‌గోళ ప‌రిస్థితుల మ‌ధ్య కూడా సుష్మ త‌న మాట మీద‌నే నిల‌బ‌డ్డారు. బిల్లు ప్రవేశ పెట్టిన స‌మయంలో బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇచ్చారు. ఆ త‌రువాత రాజ్య‌స‌భ‌లో బిల్లుకు బీజేపీ నేత‌లే స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదించ‌గా..అలా చేస్తే తిరిగి బిల్లు లోక్‌స‌భ‌కు రావాల్సి ఉంటుంద‌ని..ఇక లోక్‌స‌భ‌లో బిల్లు ఆమోదం సాధ్యం కాదు..స‌వ‌ర‌ణ‌లు వ‌ద్దు అంటూ రాజ్య‌స‌భ‌లో నాటి బీజేపీ నేత అరుణ్ జైట్లీకి సుష్మా స్వ‌రాజ్ స్ప‌ష్టం చేసారు. ఇక‌, తెలంగాణ ఇచ్చిన పెద్ద‌మ్మ సోనియానే కాదు..త‌న‌ను చిన్న‌మ్మ‌గా గుర్తుంచుకోవాల‌ని కోరుతూ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను సుష్మ స్వ‌రాజ్ కోరారు.

వెంక‌య్య‌..కిష‌న్ రెడ్డి ఉద్వేగం..

వెంక‌య్య‌..కిష‌న్ రెడ్డి ఉద్వేగం..

సుష్మా స్వ‌రాజ్ మృతి విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు..కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి సుష్మా భౌతిక ఖాయం సంద‌ర్శించి నివాళి అర్పించారు. వెంక‌య్య నాయుడు పార్టీలో సుష్మాతో త‌న‌కున్న బంధాన్ని గుర్తు చేసుకొని ఉద్వేగానికి గుర‌య్యారు. ఉబికి వ‌స్తున్న క‌న్నీటిని నియంత్రించుకుం టూ ఆమె భౌతిక ఖాయం వ‌ద్ద నిలబ‌డిపోయారు. ఇక‌, హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి సుష్మ భౌతిక ఖాయం చూడ‌గానే క‌న్న‌టీ ప‌ర్యంత మ‌య్యారు.

తెలంగాణకు చిన్నమ్మే

తెలంగాణకు చిన్నమ్మే

సుష్మాస్వరాజ్‌ నాకే కాదు యావత్తు తెలంగాణకు చిన్నమ్మే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషిని ఎన్నటికీ మరువలేమని ఆయన అన్నారు. ప్రజా సమస్యల పై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి అంటూ నివాళి అర్పించారు. ఏపీ..తెలంగాణ ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్.. కేసీఆర్ సైతం సుష్మ మృతి ప‌ట్ల సంతాపం ప్ర‌క‌టించారు.

English summary
Sushma Swaraj crucial role in Telangana Bill pass in Loksabha in 2014. She totally supported separate Telananga state from the starting. Vice president Venkaiah and Central Minister Kishan Reddy emotional.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X