వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుష్మాస్వరాజ్ అంత్యక్రియలు కూడా ప్రత్యేకమే.. కూతురు బన్సూరి అన్నీ తానై..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : తిరిగారాని లోకాలకు వెళ్లిపోయిన చిన్నమ్మ అంత్యక్రియలు ఢిల్లీలోని లోధి శ్మశానంలో ముగిశాయి. బాధాతప్త హృదయంతో హితులు, సన్నిహితులు సుష్మ స్వరాజ్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. సుష్మ స్వరాజ్ భౌతికకాయం వద్ద భర్త స్వరాజ్, కూతురు బన్సూరి గుండెలవిసేలా రోదించారు. బీజేపీ శ్రేణులు తరలి రాగా చిన్న మ్మ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో పూర్తిచేశారు. కూతురు బన్సూరి సుష్మ స్వరాజ్ అంత్యక్రియల క్రతువు పూర్తిచేశారు. హిందు సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నిర్వహించారు.

బన్సూరి ఎందుకంటే ..

బన్సూరి ఎందుకంటే ..

హిందు సాంప్రదాయం ప్రకారం భర్త, లేదంటే కుమారుడు అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ వారికి కుమారుడు లేనందున కూతురుతో అంత్యక్రియలు జరిపించారు. భర్త స్వరాజ్ కౌశల్‌ నిర్వహించొచ్చు కానీ .. బన్సూరి అంటే సుష్మకు ఎనలేని ప్రేమ అని బంధువులు చెప్తున్నారు. అందుకోసమే ఆమెతో అంత్యక్రియల ఘట్టం ముగించారు. సుష్మ స్వరాజ్‌ను కడసారి చూసి భావోద్వేగానికి గురయ్యారు స్వరాజ్ కౌశల్, బన్సూరి. బంధుమితరుల ఆశ్రునయనాల మధ్య సుష్మ అంత్యక్రియలు ముగిసాయి. అంతకుముందు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎండీహెచ్ వ్యవస్థాపకుడు గులాటీ తదితరులు అంజలి ఘటించారు.

 కూతురు కూడా లాయరే ..

కూతురు కూడా లాయరే ..

బన్సూరి ఆక్స్‌ఫర్డ్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత న్యాయవాద వృత్తితో ఇష్టంతో లా చేశారు. లా పూర్తవడంతో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులలో ఆమె కేసులు కూడా వాదిస్తున్నారు. స్వరాజ్ కౌశల్ కూడా న్యాయవాది అన్న సంగతి తెలిసిందే. జార్జ్ ఫెర్నాండెజ్‌కు సాన్నిహితుడైన స్వరాజ్ .. వారి కేసులను వాదించేవారు. ఈ క్రమంలోనే సుష్మ స్వరాజ్ .. కౌశల్‌కు పరిచయమయ్యారు. అలా వారి ఒకరికొకరు ఇష్టపడి ఒక్కటయ్యారు. వీరికి బన్సూరి కలిగింది. సుష్మ రాజకీయాల్లో బిజీగా ఉన్న .. కౌశల్ మాత్రం ప్రాక్టీస్ చేసేవారు. కానీ తమ కూతురు కూడా న్యాయవాద వృత్తి ఎంచుకోవడం విశేషం.

కుప్పకూలిన గులాటీ ..

కుప్పకూలిన గులాటీ ..

సుష్మ స్వరాజ్ ఆకాల మరణం సన్నిహితులకు షాక్‌నకు గురిచేసింది. సుష్మాను కడసారి చూసేందుకు వచ్చారు ఎండీహెచ్ వ్యవస్థాపకులు మహశయ్ ధరమ్‌పాల్ గులాటీ. 96 ఏళ్ల వయస్సులోనూ యాక్టివ్‌గా ఉన్న గులాటీ .. సుష్మను చూసి పిల్లాడిలా కంటతడి పెట్టారు. శవపేటికలో త్రివర్ణ పతాకం కప్పిన సుష్మ స్వరాజ్ అచేతనంగా ఉండటం చూసి జీర్ణించుకోలేకపోయారు. సుష్మ అంటు బోరున విలపించారు. అక్కడే తూళ్లిపడిపోయారు. సుష్మ పాదాల వద్ద అంజలి ఘటించాక ఏడవడంతో .. అక్కడున్న వారు కూడా కంటితడి పెట్టుకున్నారు. ఎప్పటిలాగే సుష్మ స్వరాజ్‌కు అంజలి ఘటించేందుకు వచ్చిన గులాటీ .. భావోద్వేగానికి గురయ్యారు. తలకు ఎర్రని తలపాగా చుట్టుకొని, నెరిసిన మీసంతో వచ్చిన ఆయన .. ఒక్కసారిగా ఏడ్చారు.

సైగలతో గీత అంజలి

సైగలతో గీత అంజలి

గీత అనే చెవిటి, మూగ యువతి పాకిస్థాన్‌ చెర నుంచి విడిపించేందుకు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 11 ఏళ్ల వయస్సున్నప్పుడు తప్పిపోయిన గీత .. దాదాపు 15 ఏళ్లు పాకిస్థాన్‌లో మగ్గిపోయారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన బజ్‌రంగీ బాయిజాన్ సినిమా ప్రేరణగా గీతను భారత్ తీసుకొచ్చేందుకు దోహద పడింది. గీత విషయం తెలుసుకున్న సుష్మ స్వరాజ్ .. భారత్ తీసుకొచ్చేందుకు కృషిచేశారు. పాకిస్థాన్‌లోని కరాచీ కోర్టులో కేసు కూడా వేశారు. చివరికీ ఆ అమ్మాయి స్వస్థలం భారత్ అని నిరూపించారు. ఎట్టకేలకు 2015లో ఆమెను భారత్ తీసుకొచ్చారు. పాకిస్థాన్‌లో మగ్గిన తాను భారత్ తిరిగి రావడం వెనక సుష్మ స్వరాజ్ హఠాన్మరణం గీతను పుట్టెడు దు:ఖంలోకి నెట్టింది. పాక్ చెరలో ఉన్న తనకు విముక్తి కల్పించిన ధీర వనిత ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. మాటలు రాని ఆ మూగ యువతి సైగలతో సుష్మ స్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు. పాక్ కబంధ హస్తాల్లో 15 ఏళ్లు ఉన్న తనకు స్వేచ్ఛ వాయువులు కల్పించిన సుష్మకు జీవితాంత రుణపడి ఉంటానని అంజలి ఘటించారు.

English summary
mortal remains of much loved leader and veteran politician Sushma Swaraj were consigned to flames at Lodhi crematorium in New Delhi on Wednesday. Her last rites were performed by her daughter Bansuri. Leaders cutting across party line paid heartfelt tributes to Sushma Swaraj. Several leaders, including PM Narendra Modi, Vice-President Venkaiah Naidu and MDH owner Mahashay Dharampal Gulati, broke down while paying homage in front of her mortal remains kept her residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X