• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారత సరిహద్దుల్లో ఆగని కవ్వింపు చర్యలు .. జమ్మూ వైమానిక స్థావరం సమీపంలో మళ్ళీ డ్రోన్ల సంచారం

|

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల కవ్వింపు చర్యలు ఆగడం లేదు. జమ్మూ కాశ్మీర్ లో భారత సరిహద్దుల్లో డ్రోన్లతో నిత్యం కలకలం సృష్టిస్తూనే ఉన్నారు. జమ్మూలోని వైమానిక దళం స్టేషన్ వద్ద ఘోరమైన డ్రోన్ దాడి జరిగిన తరువాత వరుసగా డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు మరోమారు నేడు తెల్లవారుజామున మరో రెండు డ్రోన్ల కదలికను ఎయిర్ బేస్ సమీపంలో గుర్తించారు.

ఢిల్లీలో హై అలెర్ట్ .. పార్లమెంట్ సమావేశాలు , ఆగస్ట్ 15 వేడుకలు..డ్రోన్ల ద్వారా ఉగ్ర దాడులకు ప్లాన్ !!ఢిల్లీలో హై అలెర్ట్ .. పార్లమెంట్ సమావేశాలు , ఆగస్ట్ 15 వేడుకలు..డ్రోన్ల ద్వారా ఉగ్ర దాడులకు ప్లాన్ !!

బుధవారం తెల్లవారుజామున 4.05 నిముషాల సమయంలో, వాయు స్థావరం నుండి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న సత్వారీలోని జమ్మూ వైమానిక స్థావరం సమీపంలో ఒక డ్రోన్ కనిపించింది. మరికొంత దూరంలో ఇంకొక డ్రోన్ కనిపించినట్లుగా తెలుస్తోంది. సైనిక ఇంటెలిజెన్స్ అధికారుల సమాచారం ప్రకారం రెండు డ్రోన్లు గుర్తించినట్లుగా, ఇక వాటిని చేదించే క్రమంలో అవి వెళ్లిపోయినట్లుగా పేర్కొన్నారు. జూన్ 27 న జమ్మూ విమానాశ్రయంలోని భారత వైమానిక దళం (ఐఎఎఫ్) స్టేషన్ వద్ద పేలుడు పదార్థాలతో డ్రోన్ల ద్వారా దాడి చేశారు.

  Jammu : ఆయుధాలుగా Drones, రోబోటిక్.. భారత్ ఎలా ఎదుర్కొంటుంది? Anti Drone System || Oneindia Telugu
  Suspected drones roam again over Jammu airport, area adjoining IAF station

  ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. జూన్ 29న డ్రోన్లతో సహా, రోజురోజుకీ పెరుగుతున్న భద్రతా బెదిరింపులపై చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
  జమ్మూ కాశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాద గ్రూపుల నుండి వచ్చే భద్రతా బెదిరింపులకు డ్రోన్లు కొత్త కోణాన్ని చేకూర్చాయని చెప్పారు. గత నెలలో జమ్మూ ఐఎఎఫ్ స్టేషన్‌పై జరిగిన దాడులపై దర్యాప్తులో, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి పాకిస్తాన్ సంస్థల సహకారం, ప్రమేయం ఉందని దిల్బాగ్ సింగ్ చెప్పారు.

  గతంలో, సరిహద్దు దాటి డ్రోన్లు భారత భూభాగంలో కరెన్సీ, ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని చేరవేయడానికి ఉపయోగించేవారని, ఉగ్రవాద కార్యకలాపాల్లో మానవరహిత వైమానిక వాహనాలను (యుఎవి) ప్రవేశపెట్టడంతో, వాటిని ఎదుర్కోవడం కోసం మరింత శిక్షణ భారత సైన్యానికి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే ఇక భవిష్యత్తులో కూడా ఈ తరహా డ్రోన్లతో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. 2019 నుండి పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇప్పటివరకు దాదాపు 300 డ్రోన్లను భారత భద్రతా దళాలు గుర్తించినట్లు సమాచారం.

  జమ్మూకశ్మీర్ సరిహద్దులలో డ్రోన్ల దాడితో, ఆ తర్వాత వరుసగా మిలటరీ క్యాంప్ వద్ద డ్రోన్లు కలకలం సృష్టించడంతో సీరియస్ గా తీసుకున్న ఆర్మీ నిఘా పెంచింది. వైమానిక స్థావరంపై డ్రోన్ల దాడికి పాల్పడిన తర్వాత నుండి వరుసగా భద్రతా దళాలు డ్రోన్లను గుర్తిస్తూనే ఉన్నారు. ఇక ఈ రోజు కూడా సత్వారీలోని జమ్మూ వైమానిక స్థావరం వద్ద డ్రోన్లు కలకలం సృష్టించడం పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు నిదర్శనంగా నిలుస్తుంది.

  English summary
  After a brief lull of four days, suspected drones were spotted hovering again over Jammu airport adjoining the Indian Air Force station and Peer Baba area in Satwari early Wednesday. According to military intelligence officials, unidentified flying objects (UFOs) were spotted at two different locations in Satwari sector.”At about 0400 hours (4am) a UFO was spotted hovering over the civil airport.These UFOs disappeared from sight and officials concerned were informed. A search was started to trace the said UFOs, they said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X