బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పాకిస్థాన్ కు డాక్టర్ భార్య, వీసా రద్దు, ఉగ్రవాదులతో లింక్, బెంగళూరు చర్చి పేలుళ్లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది డాక్టర్ భార్యను వెంటనే పాకిస్థాన్ పంపించేయాలని కేంద్ర ప్రభుత్వ హోం శాఖా కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలోని బళ్కల్ లో నివాసం ఉంటున్న ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాక్ లంకా భార్య, పాకిస్థాన్ మహిళ అర్సాలా అభీరాను పాకిస్థాన్ పంపించేయాలని కేంద్ర హోం శాఖా కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అధికారుల ఆదేశాలతో పోలీసులు అర్సాలా అభీరాను పాకిస్థాన్ పంపించేశారు. ఇప్పటికే ఆయుర్వేద వైద్యుడిని అరెస్టు చేసిన సీసీబీ పోలీసులు ఆయన భార్య అర్సాలా అభీరాను విచారణ చేసి వివరాలు సేకరించారు.

కన్నడ హీరోకు దేహశుద్ది.. నడి రోడ్డులో పెళ్లి చేసుకోవాలని యువతికి వేధింపులు!కన్నడ హీరోకు దేహశుద్ది.. నడి రోడ్డులో పెళ్లి చేసుకోవాలని యువతికి వేధింపులు!

 భారత్ భద్రత ముఖ్యం

భారత్ భద్రత ముఖ్యం

భారతదేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని అర్సాలా అభిరాను పాకిస్థాన్ పంపించేయాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర హోం శాఖ అధికారులు అంటున్నారు. మూడు నెలల్లో అర్సాలా అభిరాను పాకిస్థాన్ పంపించేయాలని ఉత్తర కన్నడ జిల్లాలోని భత్కల్ పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖా కార్యాలయం అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 పాక్ మహిళతో దుబైలో పెళ్లి

పాక్ మహిళతో దుబైలో పెళ్లి

2006లో పాకిస్థాన్ కు చెందిన అర్సాలా అభీరాను డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ లంకా దుబైలో వివాహం చేసుకున్నాడు. భారత్ లోని పంజాబ్ లోని అత్తారి సరిహద్దుల నుంచి అర్సాలా భారత్ లోకి ప్రవేశించింది. మూడు నెలల టూరిస్ట్ (పర్యాటక) వీసాతో అర్సాలా భారత్ చేరుకుంది.

బెంగళూరు పేలుళ్లతో లింక్ !

బెంగళూరు పేలుళ్లతో లింక్ !

తరువాత అర్సాలా టూరిస్ట్ వీసా గడువును పొడగించుకుంది. అర్సాలా, ఆమె భర్త డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ భట్కల్ లోని ఆజాద్ నగర్ లో నివాసం ఉంటున్నారు. బెంగళూరు నగరంలోని చర్చి పేలుడు కేసు నిందితులతో డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి.

ఉగ్రవాదుల దయతో విమానం టిక్కెట్లు

ఉగ్రవాదుల దయతో విమానం టిక్కెట్లు

పాకిస్థాన్ కు చెందిన ఇండియన్ ముజాహుద్దిన్ ఉగ్రవాది రియాజ్ భట్కల్ తో డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ భేటీ అయ్యారని, 2009లో ఇతను దుబాయ్ వెళ్లడానికి ఆ ఉగ్రవాద సంస్థ విమాన టిక్కెట్లు బుక్ చేశాయని ఆధారాలు ఉన్నాయని భారత ప్రభుత్వ నిఘా వర్గాలు అంటున్నాయి.

వీసా ముసుగులో !

వీసా ముసుగులో !

పాకిస్థాన్ మహిళ అర్సాలా తండ్రి పాకిస్థాన్ నుంచి డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ కు సహాయం చేస్తున్నాడని, అక్కడి ఉగ్రవాదులు నిత్యం వీరితో టచ్ లో ఉన్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొదట 30 రోజుల వీసా, తరువాత 90 రోజుల వీసా, ఆ తరువాత ఇక్కడే 5 సంవత్సరాలు మకాం వేసి భారత పౌర సభ్యత్వం సంపాధించడానికి వీరు ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు ఆరోపించారు.

 14 మంది పాకిస్థాన్ మహిళలు !

14 మంది పాకిస్థాన్ మహిళలు !

పాకిస్థాన్ మహిళ అర్సాలా టూరిస్ట్ వీసాను భారత్ ప్రభుత్వం రద్దు చేసింది. వెంటనే అర్సాలాను పాకిస్థాన్ పంపించేశారు. భత్కల్ కు చెందిన 14 మందిని పాకిస్థాన్ మహిళలు వివాహం చేసుకున్నారని, ఇక్కడే మకాం వేసిన ఆ మహిళలు భారత్ మీద కుట్రలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. భారత్- పాకిస్థాన్ దేశాల మద్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ దేశ మహిళలను తిరిగి పాకిస్థాన్ పంపించాలని భారత్ ప్రభుత్వం నిర్ణయించింది.

English summary
Bengaluru: Suspected terrorists wife sent back to Pakistan from Bhatkal, Uttara Kannada in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X