వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అశ్లీల ఫొటోలు పోస్ట్: పోలీసు అధికారి ఆత్మహత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: అశ్లీల ఫొటోలను వాట్సాప్‌లో షేర్ చేశాడనే ఆరోపణపై సస్పెన్షన్‌కు గురైన ఓ పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళ రాష్ట్రం నడక్కాపులో సీనియర్ సివిల్ పోలీసు ఆఫీసర్ ఎపి షాజీ (41) శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

సోషల్ మీడియాలో కొంత మంది మహిళలు, సీనియర్ పోలీసు అధికారుల అభ్యంతకరమైన ఫోటోలను షేర్ చేశాడనే ఆరోపణపై ఆయనను సస్పెండ్ చేశారు. అవర్ రెస్పాన్సిబిలిటీ చిల్డ్రన్ అనే వాట్సప్ గ్రూపులో కొన్ని అశ్లీలమైన, అభ్యంతకరమైన ఫోటోలు ఇటీవల షేర్ అయ్యాయి. దీంతో గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న రాజు మీనన్ దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశాడు.

Shaji

సీనియర్ పోలీసు అధికారులు, ప్రముఖ న్యాయవాదులు, న్యాయమూర్తులతో కూడిన దాదాపు 90 మంది ప్రముఖులు ఈ గ్రూపులో ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం సీరియస్‌గా మారింది. అయితే తాను కావాలని ఆ పని చేయలేదని, ఎవరో పంపించిన ఫొటోలను చూస్తుండగా పొరపాటున వాట్సప్‌లో షేర్ అయ్యాయని షాజీ వివరణ ఇచ్చాడు.

అయితే షాజీ వివరణపై ఉన్నతాధికారులు సంతృప్తి చెందలేదు. సంఘటనపై విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ తర్వాత అసిస్టెంట్ కమిషనర్ సమర్పించిన నివేదిక ఆధారంగా సిటీ పోలీసు కమిషనర్ షాజీనీ తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

దాంతో మనస్తాపానికి గురైన షాజీ శుక్రవారం సాయంత్రం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకంేది. ఈ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఎన్. ప్రశాంత్ జోక్యా్ని ప్రశ్నిస్తూ స్థానికులు, ఉద్యోగులు శుక్రవారం అర్థరాత్రి వరకు ఆందోళన నిర్వహించారు. కాగా, భార్య, ఇద్దరు కుమారులు ఉన్న షాజీకి బాల నేరస్తుల కేసులను డీల్ చేయడంలో మంచి పేరుంది.

English summary
In a tragic turn of events, the police officer, who had been suspended for posting obscene photos on a Whatsapp group, committed suicide on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X