• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పతనంతిట్ట అభ్యర్థిపై వీడని సందిగ్ధత : రేసులో శ్రీధరన్, సురేంద్రన్

|

తిరువనంతపురం : సాధారణ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోన్న బీజేపీ, అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి స్పందిస్తోంది. ఆ నియోజకవర్గంలో అభ్యర్థికి ఉన్న క్రేజీ, సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా పేర్లను ఖరారు చేస్తోంది. నిన్న 184 మందితో తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. కేరళలో 20 స్థానాల్లో బీజేపీ పోటీచేస్తోంది. పొత్తులో భాగంగా భారత్ ధర్మ జనసేనక 5 చోట్ల, కేరళ కాంగ్రెస్ ఒక్కస్థానంలో బరిలోకి దిగుతున్నాయి. 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సిన బీజేపీ 13 చోట్ల పేర్లను ఖరారుచేసింది. శబరిమల ఆలయం పరిధిలోని పతనంతిట్టకు అభ్యర్థి ఎంపికలో మల్లగుల్లాలు పడుతోంది కమలదళం.

రాహుల్ పై మరోసారి స్మృతీ అస్త్రం... అసలు కథ ఏంటంటే...?

ఎందుకీ జాప్యం ? కారణమిదేనా ?

పతనంతిట్ట నియోజకవర్గం పరిధిలో శబరిమల ఆలయం ఉంటుంది. గత ఏడాది శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం కోసం సుప్రీంకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో .. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ప్రోద్బలంతోనే ఆలయంలో మహిళల ప్రవేశం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో మహిళల ఎంట్రీ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో .. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని బీజేపీ భావిస్తోంది. అందుకోసమే పతనంతిట్ట నియోజకవర్గంలో గెలిచేందుకు గట్టి అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది.

Suspense over Pathanamthitta BJP candidate continues

రేసులో వీరిద్దరూ ..

పతనంతిట్ట నియోజకవర్గంలో కమళం వికసించాలని బీజేపీ భావిస్తోంది. అందుకోసం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిల్లై, జనరల్ సెక్రటరీ కే సురేంద్రన్ పేర్లను పరిశీలిస్తోంది. వీరిలో ఎక్కువ ప్రభావం చూపి, విజయం సాధిస్తారనే అంచనాతో అభ్యర్థిత్వంపై మల్లగుల్లాలు పడుతోంది. సురేంద్రన్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. సురేంద్రన్ అభ్యర్థిత్వం పట్ట ఆరెస్సెస్ కూడా మొగ్గుచూపిస్తోంది. వీరితోపాటు ఇటీలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన టామ్ వడక్కం పేరును కూడా తెరపైకి వచ్చింది. నిన్న ప్రకటించిన 13 స్థానాల్లో ఈయనకు అవకాశం కల్పించకపోవడంతో .. పతనంతిట్ట అభ్యర్థి రేసులో ఉన్నారు.

13 స్థానాల్లో ప్రముఖులకు చోటు

నిన్న ప్రకటించిన జాబితాలో కేరళ బీజేపీ ప్రముఖులను చోటు దక్కింది. మిజోరం మాజీ గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తిరువనంతపురం నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక్కడినుంచి ఆయన గెలుపు నల్లేరుమీద నడకేనని అభిప్రాయం ఉంది. అదేవిధంగా కేంద్రమంత్రి అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ ఎర్నాకులం నుంచి పోటీచేయనున్నారు. మరో 11 మందికి సామాజిక వర్గాలు, గెలుపుపై సర్వేల అంచనా ఆధారంగా టికెట్లను కేటాయించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The suspense continues in the Lok Sabha poll scenario in Kerala, as the BJP did not announce the candidate for Pathanamthitta where the Sabarimala temple is situated, even as candidates for all the other seats in Kerala were announced. last few days, a fierce tug of war has been going on in the BJP with party state president P S Sreedharan Pillai and general secretary K Surendran.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more