వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య అందంగా ఉందనే అనుమానం, అక్రమ సంబంధం, ఎవరి కోసం ? నిద్రపోతుంటే కట్ చేసిన భర్త!

|
Google Oneindia TeluguNews

మీరట్: భార్య అందంగా ఉంటుందోని, రోజు చాల హుషారుగా మేకప్ చేసుకంటుందని ఆమె మీద అనుమానం పెంచుకున్నాడు భర్త, భార్య వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం సాగిస్తోందని, తాను ఆఫీస్ కు వెళ్లిన తరువాత వారితో ఎంజాయ్ చేస్తుందని అనుమానం పెంచుకున్నాడు. భార్య నిద్రపోతున్న సమయంలో పక్కాప్లాన్ తో అనుకున్న పని పూర్తి చేసిన భర్త మరుసటి రోజు ఎలాగుంది ? అంటూ ఆమెను ప్రశ్నించాడు. భర్త వికృత చేష్టలతో విసిగిపోయిన భార్య పోలీసులను ఆశ్రయించింది.

ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్!ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్!

హ్యాపీగా దంపతులు

హ్యాపీగా దంపతులు

ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లాలోని లిసాడి గేట్ ప్రాంతంలో ఆరీఫ్, రోష్ని దంపతులు నివాసం ఉంటున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం ఆరీఫ్, రోష్నిల వివాహం జరిగింది. వివాహం జరిగిన తరువాత ఆరీఫ్ భార్య రోష్నితో సంతోషంగా ఉండేవాడు. ఆరీఫ్ ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

భార్యకు అక్రమ సంబంధం!

భార్యకు అక్రమ సంబంధం!

ఆరీఫ్ భార్య రోష్ని చూడటానికి చాలా అందంగా ఉంటోంది. ఉద్యోగానికి వెళ్లిన తరువాత రోష్ని చాల అందంగా తయారు అవుతోందని ఆరీఫ్ కు అనుమానం వచ్చింది. తన భార్య రోష్నికి వేరే వ్యక్తులతో అక్రమ సంబంధం ఉందని, అందుకే తాను ఉద్యోగానికి వెళ్లిన తరువాత రోష్ని అందంగా తయారై వారితో ఎంజాయ్ చేస్తోందని ఆరీఫ్ కు రోజురోజుకు అనుమానం పెరిగిపోయింది.

ఛండాలంగా ఉండాలి

ఛండాలంగా ఉండాలి

నేను ఇంటిలో ఉన్న సమయంలోనే నీవు అందంగా ఉండాలని ఆరీఫ్ భార్య రోష్నికి చెప్పాడు. తాను ఆఫీస్ కు వెళ్లిన తరువాత నువ్వు ఛండాలంగా తయారు కావాలని, ఆందంగా మేకప్ చేసుకోరాదని భర్త ఆరీఫ్ భార్య రోష్నికి గట్టిగా చెప్పాడు. నేను మామూలుగానే ఇంటిలో ఉంటున్నానని, అందంగా ఎందుకు తయారు అవుతున్నానని భార్య రోష్ని భర్త ఆరీఫ్ ను ప్రశ్నించింది.

పక్కాప్లాన్ తో కట్ చేశాడు

పక్కాప్లాన్ తో కట్ చేశాడు

ఈ మధ్యకాలంలో నిత్యం రోష్ని అందంగా తయారు అయ్యే విషయంలోనే ఇంటిలో గొడవలు జరుగుతున్నాయి. ఇక లాభం లేదని భావించిన ఆరీఫ్ రెండు రోజుల క్రితం రాత్రి భార్య రోష్ని బెడ్ రూంలో ఘాడంగా నిద్రపోతున్న సమయంలో కత్తెర తీసుకుని ఆమె తల వెంట్రుకలు పూర్తిగా కట్ చేసేశాడు.

ఇప్పుడు మేకప్ చేసుకో!

ఇప్పుడు మేకప్ చేసుకో!

ఉదయం నిద్రలేచిన రోష్ని తల వెంట్రుకలు పూర్తిగా కట్ చేశారని గుర్తించి షాక్ కు గురై గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో భార్య దగ్గరకు వెళ్లిన ఆరీఫ్ ఇప్పుడు నువ్వు మేకప్ చేసుకుని సింగారించుకో, ఎలాగుంది నా దెబ్బ అంటూ అవహేళన చేశాడు. రోష్ని జరిగిన విషయం ఆరీఫ్ తల్లికి చెప్పింది. ఆరీఫ్ తల్లి సైతం కొడకుకే మద్దతుగా మాట్లాడిందని సమాచారం. తరువాత ఆరీఫ్ భార్య రోష్నిని ఇంటిలోని ఓ గదిలో నిర్బంధించాడు.

నీకు ధిక్కున్న చోటు చెప్పుకో డార్లింగ్

నీకు ధిక్కున్న చోటు చెప్పుకో డార్లింగ్

తల వెంట్రుకలను భర్త ఆరీఫ్ పూర్తిగా కట్ చెయ్యడంతో రోష్ని కుమిలిపోయింది. ఇప్పుడు నీకు ధిక్కున్న చోట చెప్పుకో, మర్యాదగా ఉంటే ఇంటిలో ఉండు, లేదంటే వెళ్లిపో అంటూ ఆరీఫ్ భార్య మీద పెత్తనం చెలాయించాడు. తరువాత ఆరీఫ్ భార్య రోష్నిని ఓ గదిలో నిర్బంధించాడు. భర్త ఆరీఫ్ పని మీద బయటకు వెళ్లిన తరువాత రోష్ని ఇంటిలో నుంచి తప్పించుకుని పారిపోయింది. జరిగిన విషయం రోష్ని ఆమె పుట్టింటివలో చెప్పింది. కుటుంబ సభ్యుల సహాయంతో రోష్ని లిసాడి గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోష్ని ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేసి పరారైన భర్త ఆరీఫ్ కోసం గాలిస్తున్నామని లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ ప్రశాంత్ కపిల్ మీడియాకు చెప్పారు.

English summary
In a shocking incident in Uttar Pradesh’s Meerut district, a man chopped off the tresses of his wife because he did not want her to look good, Uttar Pradesh police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X