బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మిడ్ నైట్ మెంటల్ మేన్ హంగామా, పోలీస్ క్వాటర్స్ లో సినిమా చూపించాడు, పుట్టపర్తి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మిడ్ నైట్ లో పోలీసు క్వాటర్స్ లోకి చొరబడిన ఓ మెంట్ మేన్ నానా హంగామా చేసి అందరికి సీనిమా చూపించిన ఘటన కర్ణాటకలోని చిక్కబళ్లాపురంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తికి చెందిన రాజేంద్ర ధామి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసు క్వాటర్స్ లోని 12 ఇళ్లకు అతను బయట నుంచి గడియ పెట్టి స్థానికులు, పోలీసులకు సినిమా చూపించాడు.

చిక్కబళ్లాపురలోని కేఎస్ఆర్ టీసీ బస్స్ స్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకుని వెళ్లి విచారణ చేశారు.

తాను ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్థికి చెందిన రాజేంద్ర ధామి అని అతను పోలీసుల విచారణలో అంగీకరించాడు. పోలీసులు విచారణ చేసిన తరువాత రాత్రి రాజేంద్రను వదలిపెట్టారు. అంతే పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన రాజేంద్ర అర్దరాత్రి సమీపంలోని పోలీసు క్వాటర్స్ లోకి చొరబడ్డాడు.

Suspicious man rushed to the police Residential Houses in Chikkaballapur in Karnataka

పోలీసు క్వాటర్స్ లోని 12 ఇళ్లకు బయట నుంచి గడియపెట్టిన రాజేంద్ర నానా హంగామా చేసి విచిత్రంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రాజేంద్రను పట్టుకోవడానికి క్వాటర్స్ లోకి వెళ్లారు. అంతే పోలీసులను చూసిన రాజేంద్ర రాళ్లు తీసుకుని వారి మీద ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు.

సుమారు గంటకు పైగా రాజేంద్ర పోలీసులకు సినిమా చూపించాడు. చివరికి పోలీసులు రాజేంద్రను పట్టుకున్నారు. రాజేంద్ర చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని, అతని బ్యాగ్ లో బ్లేడ్ లు, నేపాల్ కరెన్సీ ఉందని పోలీసులు అన్నారు. రాజేంద్రను బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించామని, అతని పూర్తి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. మెంటల్ మేన్ రాజేంద్ర తీరుతో పోలీసు క్వాటర్స్ లో నివాసం ఉంటున్న వారు హడలిపోయారు.

English summary
Suspicious man rushed to the police Residential Houses. The incident took place in Chikkaballapur in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X