వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

SUV Car: రేప్ చెయ్యడానికి కారులో ఆ సీటు సరిపోతుందా ?, సీటు వెనక్కి ముందుకు ?, ఆర్ టీఓ షాక్ !

|
Google Oneindia TeluguNews

వడోదరా/ గుజరాత్/ చెన్నై: కారులో రేప్ చెయ్యడానికి అవకాశం ఉంటుందా ?, సీట్లు వెనక్కి, ముందుకి లాగి అక్కడ ఓ మహిళను పట్టుకుని అందులో రేప్ చెయ్యడానికి చాన్స్ ఉందా ?, సెంట్రల్ డోర్ లాక్ చేస్తే మహిళ తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందా ?, లేదా ?, ఈ ప్రశ్నలు వేసింది కోర్టులో లాయర్లు కాదు, పోలీసు అధికారులు, అది బాధితులనో లేక నిందితులనో పోలీసులు ప్రశ్నించలేదు. రేప్ కేసు విచారణ చేస్తున్న పోలీసులు ఓ RTO అధికారికి ఈ ప్రశ్నలు పంపించి నివేదిక ఇవ్వాలని మనవి చేశారు. పోలీసుల తీరుతో షాక్ కు గురైన ఆర్ టీఓ అధికారులు ఓరీ దేవుడో మా సర్వీసులో, మా జీవితంలో ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరూ అడగలేదు, మేము ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఎా చెప్పాలి అంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.

Illegal affair: ఆంటీ మీద అనుమానం, ఏరియాలో సీక్రెట్ లవర్ ?, మొత్తం చెక్కేసి ఎస్కేప్!Illegal affair: ఆంటీ మీద అనుమానం, ఏరియాలో సీక్రెట్ లవర్ ?, మొత్తం చెక్కేసి ఎస్కేప్!

అర్దరాత్రి కారులో రేప్ !

అర్దరాత్రి కారులో రేప్ !

గుజరాత్ లోని వడోదరలో ఏప్రిల్ 26వ తేదీ అర్దరాత్రి టయోటా పార్చనర్ SUV కారు (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్)లో ఓ మహిళ మీద అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. తనను కారులోకి లాక్కోని డోర్ లాక్ చేసి బయటకు వెళ్లకుండా చేసి తన మీద అత్యాచారం చేశారని ఆరోపిస్తూ ఆ మహిళ వడోదర పోలీసులకు ఫిర్యాదు చేసింది.

క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంట్రీ

క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎంట్రీ

కేసు నమోదు చేసిన వడోదర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మహిళకు అనేక ప్రశ్నలు వేసి సమాచారం సేకరించారు. మహిళ మీద అత్యాచారం చేసింది పద్రా మునిసిపల్ మాజీ కౌన్సిలర్, మాజీ పాద్రా అగ్రికల్చర్ డైరెక్టర్ భవేష్ పాటిల్ అని తెలుసుకున్న పోలీసులు మే 3వ తేదీన అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తాను ఏ మహిళ మీద అత్యాచారం చెయ్యలేదని భవేష్ పాటిల్ పోలీసులకు చెప్పాడు.

సార్..... కారులో ఆ సీన్ సాధ్యమేనా ?

సార్..... కారులో ఆ సీన్ సాధ్యమేనా ?

అనేక కోణాల్లో కేసు విచారణ చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రేప్ కేసులో భవేష్ పాటిల్ కు కఠిన శిక్షపడేలా చెయ్యాలని డిసైడ్ అయ్యారు. వెంటనే RTO అధికారులకు ఓ లేఖ రాశారు. ఎస్ యూవీ కారులో ముందు సీట్లు వెనక్కి జరిపి ఆ సీటులో ఉన్న మహిళ మీద అత్యాచారం చెయ్యడానికి అవకాశం ఉంటుందా ?, సీట్లు పొడవు, వెడల్పు ఎంత ?, ఆ సీటులో నుంచి మహిళ తప్పించుకోకుండా రేప్ చెయ్యడం సాధ్యమేనా, సెంట్రల్ డోర్ లాక్ చేసిన తరువాత ఆ డోర్లు ఎందుకు ఓపెన్ కావు ?, అంటూ అనేక ప్రశ్నలు వేసిన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మీరు మాకు నివేదిక ఇవ్వాలని ఆర్ టీఓ అధికారులకు మనవి చేశారు.

 దెబ్బకు RTOకు మైండ్ బ్లాక్

దెబ్బకు RTOకు మైండ్ బ్లాక్

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ప్రశ్నలకు ఆర్ టీఓ అధికారుల మైండ్ బ్లాక్ అయ్యింది. తాము ఎస్ యూవీ కారులో సీట్లు ఎలా ఉంటాయి, సీట్లు జరిపితే ఎంత స్థలం ఉంటుంది. సీట్లు జరపకుంటే ఎంత స్థలం ఉంటుంది అని మాత్రమే చెప్పగలమని, కారులో రేప్ చెయ్యడానికి అవకాశం ఉంటుందా ?, లేదా ? అనే విషయం మేము ఎలా డిసైడ్ చేస్తామని, మా సర్వీస్ లో ఇలాంటి ప్రశ్నలు ఎవ్వరూ వెయ్యలేదని, మేమూ సమాధానాలు చెప్పలేదని ఆర్ టీఓ అధికారులు దీనంగా విచారం వ్యక్తం చేస్తున్నారని స్థానిక మీడియా అంటోంది.

Recommended Video

Prabhas Lamborghini Aventador On Hyderabad Roads | తండ్రి పుట్టినరోజున..!! || Oneindia Telugu
ఎవరి పని వాళ్లు చెయ్యాలి

ఎవరి పని వాళ్లు చెయ్యాలి

కారులో స్థలం ఎంత ఉంటుంది, సీట్లు జరిపిన తరువాత స్థలం ఉంటుంది అని మాత్రమే మేము చప్పగలమని, రేప్ జరిగిందా ? లేదా ? అనే విషయం పోలీసులే విచారణ చేసుకోవాలని ఆర్ టీఓ అధికారులు అంటున్నారని స్థానిక మీడిచా వివరించింది. అయితే తాము ఆర్ టీఓ అధికారులను ఇలాంటి ప్రశ్నలు అడిగిన మాట వాస్తవమే అని, రేప్ కేసులో నిందితులు తప్పించుకోకుండా పక్కా సాక్షాలు సంపాధించాలనే ఆ ప్రశ్నలు వేశామని, మాకు వేరే ఉద్దేశం లేదని వడోదర క్రైమ్ బ్రాంచ్ సీనియర్ పోలీసు అధికారి దివన్ షిత్ వాలా స్థానిక మీడియాకు చెప్పారు.

English summary
SUV Car: Gujarat Police seeks Vadodara RTO report on whether SUV has enough space for rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X