వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వదేశీ అంటే విదేశీ ఉత్పత్తులను బహిష్కరణ కాదు : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

స్వదేశీ అంటే ప్రతి విదేశీ ఉత్పత్తిని పరిష్కరించాలని అర్థం కాదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశమంతా విదేశీ వస్తువులు బహిష్కరించి స్వదేశీ వస్తువులను వాడాలని నరేంద్ర మోడీతో పాటుగా, బీజేపీ నేతలంతా ముక్తకంఠంతో చెప్తున్న తరుణంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

భారత చరిత్రలోనే తొలిసారి .. భారత్ - పాక్ ఎల్ఓసీ వద్ద విధుల్లో మహిళా సైన్యంభారత చరిత్రలోనే తొలిసారి .. భారత్ - పాక్ ఎల్ఓసీ వద్ద విధుల్లో మహిళా సైన్యం

 దేశంలో ఉత్పత్తి కాని వాటి దిగుమతిలో తప్పు లేదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్

దేశంలో ఉత్పత్తి కాని వాటి దిగుమతిలో తప్పు లేదన్న ఆర్ఎస్ఎస్ చీఫ్

దేశంలో సాంప్రదాయికంగా లేని, లేదా స్థానికంగా తయారు కాని, సాంకేతిక పరిజ్ఞానం లేని ఉత్పత్తులను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడంలో తప్పులేదని ఆయన పేర్కొన్నారు.స్వదేశీ ఉత్పత్తులను వాడటం అంటే స్వదేశీ ఉత్పత్తులను, స్వదేశీ టెక్నాలజీని ప్రోత్సహించడం, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తరువాత భారత దేశంలో విధాన రూపకల్పన పశ్చిమ దేశాలతో ప్రభావితమైంది అని పేర్కొన్న భగవత్ దాని ప్రభావంతోనే స్థానికంగా లభించే స్వదేశీ ఉత్పత్తులను ప్రజలు సరిగా పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు.

 స్వదేశీ అంటే అర్ధం చెప్పిన మోహన్ భగవత్

స్వదేశీ అంటే అర్ధం చెప్పిన మోహన్ భగవత్

ఒక వర్చవల్‌ బుక్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు . మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో ఉన్న వస్తువులను వాడతామని , స్వదేశీ అంటే విదేశీ వస్తువులను బహిష్కరించడం కాదని పేర్కొన్నారు . మంచి విషయాలు ప్రపంచలో ఎక్కడ ఉన్నా స్వీకరించాలని అందుకే మేం మా అవసరానికి తగ్గట్టు ప్రపంచంలో లభించే వస్తువులను ఉపయోగిస్తామని పేర్కొన్న ఆయన స్వదేశీ అంటే అర్ధం తెలుసుకోవాలన్నారు. ప్రస్తుతం దేశంలో విదేశీ మోజు కాస్త తగ్గిందని ఆ పరిస్థితులు మారాయని పేర్కొన్నారు .

 ప్రపంచమంతా ఒకే ఆర్ధిక విధానం పనికి రాదు

ప్రపంచమంతా ఒకే ఆర్ధిక విధానం పనికి రాదు

దేశంలో కరోనా వ్యాప్తికి నేపథ్యంలో స్వావలంబన మరియు స్వదేశీ ఔచిత్యం గురించి మాట్లాడిన ఆయన ప్రపంచీకరణ ఈ సమయంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని, ప్రపంచమంతా ఒకే ఆర్థిక నమూనా వర్తింపు సాధ్యంకాదని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రపంచమంతా ఒకే కుటుంబం లా ఉండాలని , కానీ ఒకే మార్కెట్ లా కాదన్నారు . ఒకే ఆర్థిక విధానం పనికిరాదని చెప్పిన మోహన్ భగవత్ తాజా ప్రభుత్వ నిర్ణయాలపై మాట్లాడారు . భారతదేశాన్ని స్వావలంబన దిశగా అడుగులు వేయడానికి ఇటీవల ప్రకటించిన జాతీయ విద్యా విధానం సరైన అడుగుగా అభివర్ణించారు .

ఆర్ఎస్ఎస్ లోనే విదేశీ వస్తు బహిష్కరణ భావజాలం... కానీ చీఫ్ ఇలా !

ఆర్ఎస్ఎస్ లోనే విదేశీ వస్తు బహిష్కరణ భావజాలం... కానీ చీఫ్ ఇలా !

ఇటువంటి విధానాలతో భారతదేశం తన ప్రజల సామర్థ్యాన్ని మరింత పెంచడానికి సహాయపడుతుంది అని పేర్కొన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించటం, విదేశీ పెట్టుబడులు, ఉత్పత్తుల ప్రవాహాన్ని పరిమితం చేయటం వంటి అంశాలపై భావజాలం ఆర్ఎస్ఎస్ లో ప్రధానంగా కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ చైనా ఉత్పత్తులను బహిష్కరించే ప్రచారంలో ముందంజలో ఉంది. ఇక ఇదే సమయంలో స్వదేశీ అంటే విదేశీ వస్తువుల బహిష్కరణ కాదు అని మోహన్ భగవత్ ఈ తరహా వ్యాఖ్యలు చెయ్యటం గమనార్హం .

English summary
Swadeshi does not necessarily mean boycotting every foreign product, RSS chief Mohan Bhagwat said on Wednesday and asserted that only those technologies or materials may be imported which the country lacks traditionally or are not available locally.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X