వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరే రామ్..!! నిర్మల బడ్జెట్‌పై సుబ్రమణ్యస్వామి పెదవి విరుపు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : స్వపక్షంలో విపక్షంలా మెలిగే బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రమణ్య స్వామి నిర్మలమ్మ బడ్జెట్‌పై స్పందించారు. పద్దు సందర్భంగా నిర్మలా మాట్లాడిన మాటలను కోట్ చేస్తూ ట్వీట్లు చేశారు. పద్దులో నిర్మలా చెప్పిన దానికి వాస్తవంగా పొంతనలేదని తనదైనశైలిలో విమర్శలు గుప్పించారు. మంచి కలలు కంటున్నారని .. బడ్జెట్ రూపకల్పన అలానే ఉందని విమర్శించారు. అంతేకాదు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చేసిన తప్పిదాలను కార్నర్ చేస్తూ వరుసగా ట్వీట్లు చేశారు. ముఖ్యంగా వ్యవసాయం, జీడీపీ వృద్ధి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై నిర్మలా చేసిన ద్వంద్వ వ్యాఖ్యలను కోట్ చేశారు.

కలల లోకంలో ..
తొలిసారి బడ్జెట్ సమర్పించిన నిర్మలా సీతారామన్ దాదాపు 2.15 గంటలపాటు అనర్గళంగా ప్రసంగించారు. మధ్య మధ్యలో హిందీ, ఉర్దూ, తమిళంలో కవితలు కూడా చెప్పారు. అయితే ఆమె చేసిన తప్పులను ఎత్తిచూపారు సుబ్రమణ్య స్వామి. చిత్రమేమిటంటే .. నిర్మలా సీతారామన్ పుట్టినిల్లు, సుబ్రమణ్యస్వామి స్వస్థలం తమిళనాడు కావడం ఇక్కడ గమానార్హం. 2022 నాటికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తామని నిర్మలా ప్రకటించారు.

swami counter on nirmala budget

2018లో కన్నా రెట్టింపు చేస్తామని ఆమె ఉద్దేశమని .. అయితే అందుకోసమే ఏడాదికి 18 శాతం వ్యవసాయం వృద్ధి జరగాల్సి ఉంటుందని గుర్తుచేశారు. అయితే విచిత్రంగా ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అభివృద్ధి 2 శాతం అని తెలిపారు. అంటే ఏడాదికి 16 శాతం వృద్ధిని ఆర్థికమంత్రి ఆశించారా అని ప్రశ్నించారు. కలలకు కూడా ఓ హద్దు ఉంటుందని స్వీట్ డ్రీమ్స్ అని ట్వీట్ చేశారు సుబ్రమణ్య స్వామి.

హరరే రామ్ ..
ఎనిమిదో పేరాలో నిర్మలా ప్రసంగిస్తూ జీడీపీ అభివృద్ధిని ప్రస్తావించారు. ప్రపంచంలో మనది ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్నారు ఆ వెంటనే పర్చేసింగ్ పవర్ పారిటీ టర్న్ విషయానికొచ్చేసరికి మారిందని కోట్ చేశారు. ఆ సమయంలో మనది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని ఆర్థికమంత్రి సెలవిచ్చారు. ఇందులో ఏదీ నిజం..? దేనిని మనం విశ్వసించాలి అని ప్రశ్నించారు. పదో పేరాలో మనం 1 ట్రిలియన్ డాలర్‌కు చేరుకునేందుకు 55 ఏళ్లు పట్టిందని నిర్మలా తెలిపారు.

ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ అని నొక్కి వక్కానించారు. అయితే ఇప్పుడు 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటున్నామని లెక్కలేశారు. ఓకే.. మే నెల నుంచి ఇప్పటివరకు .. అంటే ఆరువారాల్లో 1 ట్రిలియన్ డాలర్ వృద్ధి సాధించారా .. హరే రామ్ అని ట్వీట్ చేశారు.

English summary
The target stated in Budget is doubling of farm income by 2022 from base year 2018. That means doubling in 4 years which means a compound average annual rate of growth of 18% per year. At present farm income is growing at 2.0% per year. Sweet dreams. In para 8 of the FM speech on Budget it is said : “It(GDP) is now the sixth largest in the world....In Purchasing Power Parity terms, we are in fact the 3rd largest economy already...” But which is correct? 6th or 3rd—it cannot be both. Para 10,FM: “ it took 55 years..to reach 1 trillion dollar(sic) ..we, in 5 years , added 1 trillion dollar(sic). Today we are nearing a 3 trillion dollar level.” I.e., 55 years from when? Added $1 tr by May 26, 2019? “Nearing $ 3 tr today” i.e., $1tr. in just six weeks? Hare Ram!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X