వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం: ఢిల్లీ జేఎన్‌యూలో వివేకానంద విగ్రహం ధ్వంసం, విద్వేషపూరిత రాతలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) వివాదాలకు కేంద్రంగా మారుతోంది. జేఎన్‌యూలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని కొందరు దుండగులు గురువారం ధ్వంసం చేశారు. హాస్టల్ ఫీజులు పెంచడంపై గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.

విద్వేష పూరిత రాతలు..

అంతేగాక, ‘కాషాయం తగలబడుతుంది' అని వివేకానంద విగ్రహం వద్ద ఎరుపు రంగుతో రాశారు. ఇది కేంద్రంలోని భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా రాసినట్లుంది. ఓ వర్గానికి చెందిన విద్యార్థి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వివేకానంద విగ్రహం జేఎన్‌యూ పరిపాలన బ్లాక్‌కి ఎదురుగా ఉంది.

విద్యార్థుల పనికాదంటూ..

వివేకానంద స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్‌యూఐ) నాయకులు ఖండించారు. అక్కడ రాసిన రాతలను శుభ్రం చేసినట్లు తెలిపారు. అయితే, వివేకానంద స్వామి విగ్రహం ధ్వంసం కాలేదని వారు చెప్పుకొచ్చారు. జేఎన్‌యూకు విద్యార్థులెవరూ ఇలా చేసివుండరని ఎన్ఎస్‌యూఐ నేత సన్నీ ధిమన్ అన్నారు.

ఇంతకుముందు కూడా..

ఇంతకుముందు పరిపాలన బ్లాక్ గోడలపై జేఎన్‌యూ వైఎస్ ఛాన్సలర్ మామిడాల జగదీష్ కుమార్‌పై అసభ్యకరమైన సందేశాలను రాశారు. హాస్టల్ ఫీజులు పెంచుతూ జేఎన్‌యూ పరిపాలనా విభాగం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు గత కొద్ది రోజులుగా భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే.

భారీ ఎత్తున ఆందోళనలతో పీజులపై వెనక్కి...


ఈ ఆందోళనల్లో బీజేపీ అనుబంధ ఏబీవీపీ, కాంగ్రెస్ అనుబంధ ఎన్ఎస్‌యూఐ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో బుధవారం కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ హాస్టల్ ఫీజులను పెంచడం లేదని స్పస్టం చేసింది. అంతేగాక, పేద విద్యార్థులకు ఆర్థికసాయాన్ని అందించే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపింది. అయినప్పటికీ ఫీజుల పెంపు నిర్ణయాన్ని పూర్తిగా రద్దు చేయాలంటూ కొందరు విద్యార్థులు ఆందోళనలను కొనసాగిస్తున్నారు. హాస్టల్ గది ఫీజు గతంలో రూ. 20 ఉండగా రూ. 600 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, విద్యార్థుల ఆందోళనలతో ఆ ఫీజును రూ. 200లకు తగ్గించింది జేఎన్‌యూ పరిపాలనా విభాగం. రిఫండబుల్ మెస్ సెక్యూరిటీ డిపాజిట్‌ను రూ. 12వేలకు పెంచేందుకు నిర్ణయించినప్పటికీ.. ఆ తర్వాత పాత డిపాజిట్ రూ. 5,500లనే కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

English summary
A statue of Swami Vivekananda inside the Jawaharlal Nehru University (JNU) was found vandalised on Thursday. This came amid the students' protests against the fee hike and hostel manual by the university administration.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X