వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద స్వామి ఎక్కడికి పోయారంటే ? హై కోర్టులో పోలీసులు, శిష్యురాలికి బలవంతంగా, కోర్టు సీరియస్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: వివాదాస్పద స్వామి నిత్యానంద అలియాస్ నిత్యానంద ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్నారని, ఆయనకు స్వయంగా తాము నోటీసులు ఇవ్వలేకోయామని పోలీసులు కర్ణాటక హై కోర్టుకు చెప్పారు. అయితే నిత్యానంద స్వామి మహిళా శిష్యురాలికి తాము నోటీసులు ఇచ్చామని పోలీసులు కర్ణాటక హై కోర్టుకు చెప్పారు. తనకు బలవంతంగా నోటీసులు ఇచ్చారని నిత్యానంద శిష్యురాలు కోర్టులో ఆరోపించారు. పోలీసుల తీరుపై కర్ణాటక హైకోర్టు మండిపడింది.

ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !ఆంటీతో బెడ్ రూంలో జ్యోతిష్కుడి రాసలీలలు, భర్త, కొడుకు, పోలీసులు వార్నింగ్, డోంట్ కేర్ !

హై కోర్టు ఆదేశాలు

హై కోర్టు ఆదేశాలు

అత్యాచారం కేసులో నిత్యానందకు మంజూరు చేసిన జామీను రద్దు చెయ్యాలని ఆయన మాజీ కారు డ్రైవర్ కర్ణాటక హై కోర్టులో అర్జీ సమర్పించారు. అర్జీ విచారణ చేసిన కర్ణాటక హై కోర్టు ఇటీవల నిత్యానంద, సీఐడీ అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 3వ తేదీ లోపు నిత్యానందకు నోటీసులు అందించాలని, కోర్టుకు నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కోర్టులో పోలీసులు ఏం చెప్పారంటే ?

కోర్టులో పోలీసులు ఏం చెప్పారంటే ?

ఫిబ్రవరి 3వ తేదీ శుక్రవారం కర్ణాటక హై కోర్టులో విచారణ జరిగింది. కోర్టు జారీ చేసిన నోటీసులు నిత్యానందకు అందించడానికి తాము బిడిది ఆశ్రమానికి వెళ్లామని, అయితే అక్కడ ఆయన లేరని, ఆధ్యాత్మిక పర్యటకు వెళ్లారని మా విచారణలో వెలుగు చూసిందని విచారణ చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి బాలరాజ్ కర్ణాటక హై కోర్టుకు నివేదిక సమర్పించారు.

బలవంతం చేశారు: నిత్యానంద శిష్యురాలు

బలవంతం చేశారు: నిత్యానంద శిష్యురాలు

నిత్యానంద అందుబాటులో లేకపోవడంతో ఆయనకు తాము నోటీసులు ఇవ్వలేకపోయామని పోలీసులు హై కోర్టులో చెప్పారు. అయితే నిత్యానంద మహిళా శిష్యురాలు కుమారి అర్చనానంద నోటీసులు స్వీకరించడానికి నిరాకరించారని, అయినా తాము ఆమెకు నోటీసులు అందించామని పోలీసులు హైకోర్టులో చెప్పారు. అయితే తనకు బలవంతంగా నోటీసులు అందించారని నిత్యానంద శిష్యురాలు అర్చనానంద హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు.

తమాషాలు చేస్తున్నారా ?: హై కోర్టు సీరియస్

తమాషాలు చేస్తున్నారా ?: హై కోర్టు సీరియస్

పిటిషన్ విచారణ జరుగుతున్న సమయంలో హై కోర్టు న్యాయమూర్తి జాన్ మైకెల్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కోర్టు నోటీసులు ఇవ్వడానికి మీరు మొదటి సారి ప్రయత్నించారా ?, మీ తీరు మీ ఉద్యోగాల మీద ఆదారపడి ఉంటుందని గుర్తు పెట్టుకోండి అని న్యాయమూర్తి జాన్ మైకెల్ మండిపడ్డారు. కోర్టుకు హాజరుకావాలని నిత్యానంద శిష్యురాలిని మీరు ఎందుకు బలవంతం చేశారు ? అంటూ న్యాయమూర్తి జాన్ మైకెల్ పోలీసులను ప్రశ్నించారు. న్యాయమూర్తి సీరియస్ కావడంతో విచారణ చేస్తున్న పోలీసు అధికారులు క్షమాపణ చెప్పారు.

నిత్యానంద గైహాజరు

నిత్యానంద గైహాజరు

అత్యాచారం కేసులో 2010లో నిత్యానందకు మంజూరు చేసిన జామీను రద్దు చెయ్యాలని ఆయన మాజీ కారు డ్రైవర్ లెనిన్ కరుప్పన్ సమర్పించిన పిటిషన్ ను న్యాయమూర్తి జాన్ మైకెల్ విచారణ చేశారు. గత ఏడాదిన్నర కాలంగా కోర్టు విచారణకు హాజరుకాని నిత్యానందపై విచారణ జరిపాలని రామనగర కోర్టుకు హైకోర్టు న్యాయమూర్తి జాన్ మైకెల్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వం వాదనలు

ప్రభుత్వం వాదనలు

హైకోర్టు నిత్యానందకు మంజూరు చేసిన బెయిల్ రద్దు చెయ్యాలని కారు డ్రైవర్ లెనిన్ సమర్పించిన పిటిషన్ పై కర్ణాటక ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసులో మొదటి ముద్దాయి (నిత్యానందస్వామి ) విచారణకు వెంటనే హాజరు కావలసిన అవసరం లేదని, ఎందుకంటే ఫిర్యాదు చేసిన వ్యక్తి కోర్టు విచారణకు సహకరించకుండా ఆలస్యం చేస్తున్నారని, అందుకే ఆలస్యం అవుతోందని కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

బెయిల్ రద్దు చెయ్యాలని చెప్పకూడదు

బెయిల్ రద్దు చెయ్యాలని చెప్పకూడదు

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద బెయిల్ షరతులను ఉల్లంఘించలేదని, అర్జీదారుడు బెయిల్ రద్దు చెయ్యాలని డిమాండ్ చెయ్యకూడదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వులో పెట్టారు. అత్యాచారం ఆరోపణలతో పాటు మైనర్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి నిర్బంధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద నకిలీ పాస్ పోర్టు ఉపయోగించి దేశం విడిచి విదేశాలకు (ఈక్విడార్ ) పారిపోయారని ఆరోపణలు ఉన్నాయి.

English summary
Karnataka police has informed High Court that, Swamy Nityananda who has absconded from India was on a spiritual tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X