వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Gold Smuggling: స్వప్న ఆంటీ చేతివాటం, అపార్ట్ మెంట్స్ ప్లాన్ లీక్, రూ. కోట్లు స్వాహా, ఐఏఎస్ తో !

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం/ న్యూఢిల్లీ/ బెంగళూరు: దేశవ్యాప్తంగా కుదిపేసిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్ అలియాస్ స్వప్న వ్యవహారం ఒక్కొక్కటి బయటకు వస్తోంది. 2018లోనే లైఫ్ మిషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్టు వ్యవహారంలో తలదూర్చిన స్వప్న సురేష్ ప్రాజెక్ట్ మొత్తంలో 20 శాతం కమీషన్ నొక్కేసిందని ఈడీ, సీబీఐ అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ తతంగం మొత్తం నడిపించడానికి స్వప్న సురేష్ కోట్ల రూపాయలు కమీషన్ తీసుకుందని ఈడీ, సీబీఐ విచారణలో వెలుగు చూసింది. అపార్ట్ మెంట్స్ ప్లాన్ లీక్ చేసిన స్వప్న రూ. కోట్లు స్వాహా చేసిన తరువాతే ఐఏఎస్ అధికారి శివశంకర్, బిల్డర్ లతో మీటింగ్ పెట్టించిందని వెలుగు చూసింది.

Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!Waste husband: ఫస్ట్ నైట్ లేదు, భార్య పస్తులు, 400 మంది ఆంటీలతో ఎంజాయ్, క్యాషియర్ లీలలు!

 2018లో ఏం జరిగిందంటే ?

2018లో ఏం జరిగిందంటే ?

కేరళ ప్రభుత్వంలో స్వప్న సురేష్ చక్రం తిప్పిందని వెలుగు చూసింది. బంగారం స్మగ్లింగ్ కేసు వ్యవహారం బయటకు రాకముందే తనకు ఉన్న పరిచయాలతో స్వప్న సురేష్ చేతివాటం చూపించిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. 2018లో కేరళలో భారీ వరదల కారణంగా అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. వరదల దెబ్బతో రోడ్డున పడిన పేద ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం పక్కా ఇండ్లు (అపార్ట్ మెంట్స్) నిర్మించడానికి భారీ ప్రాజెక్టు తెరమీదకు తెచ్చింది. ఆ ప్రాజెక్టు కాంట్రాక్టు స్వప్న సురేష్ కు కాసుల పంట కురిపించిందని ఈడీ, సీబీఐ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 20 శాతం కమీషన్ ఫిక్స్

20 శాతం కమీషన్ ఫిక్స్

వరద బాధితుల కోసం నిర్మించే ఇళ్ల నిర్మాణం ప్లాన్ ను స్వప్న సురేష్, సందీప్, సరిత్ తదితరుల చేతికి చిక్కింది. తరువాత ఆ ప్లాన్ ను స్వప్న సురేష్ గ్యాంగ్ యూఏఇకి చెందిన హబీటట్ బిల్డర్స్ కు లీక్ చేసింది. ఈ ప్రాజెక్టు మీకు దక్కాలన్నా, మీకు మేము సహకరించాలాన్నా తమకు 40 శాతం కమీషన్ ఇవ్వాలని మొదట డిమాండ్ చేశారు. తరువాత 30 శాతం కమీషన్ ఇవ్వాలని స్వప్న సురేష్ గ్యాంగ్ డిమాండ్ చేసింది. చివరికి ఆ బిల్డర్స్ యాజమాన్యంతో 20 శాతం కమీషన్ తీసుకోవడానికి స్వప్న సురేష్ అండ్ గ్యాంగ్ అంగీకరించిందని అధికారుల విచారణలో స్వప్న సురేష్ స్వయంగా అంగీకరించిందని మళయాలం ప్రముఖ దినపత్రిక మాతృభూమి సంచలన కథనం ప్రచురించింది.

 150 అపార్ట్ మెంట్స్ డీల్ !

150 అపార్ట్ మెంట్స్ డీల్ !

వరద బాధితుల కోసం నిర్మిస్తున్న సుమారు 140 నుంచి 150 అపార్ట్ మెంట్స్ నిర్మాణం ప్రాజెక్టు విషయంలో కమీషన్ డీల్ అయిన తరువాత సంతోష్ ఎపెన్ అనే వ్యక్తి దగ్గర స్వప్న సురేష్ రూ. 3.8 కోట్లు తీసుకుంది. రూ. 3. 8 కోట్లను ఓ బ్యాగ్ లో తీసుకుని బ్లూ నెంబర్ కారులో ఖలీద్ అనే వ్యక్తి తీసుకెళ్లి స్వప్న సురేష్ కు ఇచ్చాడు. డబ్బులు పూర్తిగా లెక్కపెట్టుకున్న తరువాత ఆ బ్యాగ్ ను స్వప్న సురేష్ వేరే కారులో అక్కడి నుంచి తరలించిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

 UAE Red Crescent ఎంట్రీ

UAE Red Crescent ఎంట్రీ

వరద బాధితుల కోసం నిర్మించే అపార్టె మెంట్ ప్రాజెక్టును యూఏఇకి చెందిన రెడ్ క్రిసెంట్ సంస్థకు అప్పగించడానికి స్వప్న సురేష్ కీరోల్ పోషించింది. తరువాత ఆ ప్రాజెక్టు వ్యవహారం గురించి మాట్లాడటానికి అప్పటి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శి హోదాలో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్, తనకు భారీ మొత్తంలో కమీషన్ ఇచ్చిన ఆ బిల్డర్స్ సంస్థ యాజమాన్యం కలిసి మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా ప్రైవేట్ మీటింగ్ ఏర్పాటు చేసిందని అధికారుల విచారణలో వెలుగు చూసిందని మళయాలం దినపత్రిక మాతృభూమి సంచలన కథనం ప్రచురించింది.

Recommended Video

Yes Bank Crisis: Founder Rana Kapoor Arrested in DHFL Money Laundering Case
 స్వప్న విషయం శివశంకర్ కు ముందే తెలుసు ?

స్వప్న విషయం శివశంకర్ కు ముందే తెలుసు ?

వరద బాధితుల కోసం నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణం ప్రాజెక్టు ప్లాన్ లీక్ చేసిన స్వప్న అండ్ గ్యాంగ్ తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారి శివశంకర్ తో మీటింగ్ ఏర్పాటు చేసిందని, ఆమెకు కమీషన్ ఇచ్చిన కంపెనీకి ఈ కాంట్రాక్టు వెళ్లేలా చేసిందని విచారణలో వెలుగు చూసింది. ఈ తతంగం మొత్తం నడిపించడానికి స్వప్న సురేష్ కోట్ల రూపాయలు కమీషన్ తీసుకుందని సీబీఐ విచారణలో వెలుగు చూసింది. యూఏఇ సంస్థ, ఐఏఎస్ అధికారి శివశంకర్ మీటింగ్ వ్యవహారం మొత్తం స్వప్న సురేష్ అండ్ గ్యాంగ్ చూసుకుందని, ఈ వ్యవహారం మొత్తం ఐఏఎస్ అధికారి శివశంకర్ కు ముందే తెలుసని సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విచారణలో వెలుగు చూసింది. ఈ స్టోరీ మొత్తం స్వప్న సురేష్ అధికారులకు చెప్పిందని మాతృభూమి సంచలన కథనం ప్రచురించింది.

English summary
Gold Smuggling: Swapna Suresh told Enforcement Directorate, commission was bought even during the floods of 2018 in Kerala.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X