వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీకి సింగ్, మహారాష్ట్రకు పాటిల్.. బీజేపీ కొత్త బాస్‌ల నియామకం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ .. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేసింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న మహారాష్ట్రలో పార్టీ పరిస్థితిపై దృష్టిసారించింది. అందుకోసం పార్టీ చీఫ్‌న్‌ను కూడా నియమించింది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్‌కు కూడా కమల దళపతి పగ్గాలు అప్పగించింది. కొద్దిరోజుల్లోనే బీహర్ .. మిగతా రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తామని స్పష్టంచేసింది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లోనూ కమలం వికసించేందుకు బీజేపీ .. ముందస్తుగా చర్యలు తీసుకుంటుంది.

ప్రతిభకు పట్టం
యూపీ బీజేపీ చీఫ్‌గా స్వతంత్ర దేవ్ సింగ్‌ను నియమిస్తున్నట్టు బీజేపీ హైకమాండ్ మంగళవారం తెలిపారు. మిర్జాపూర్‌కు చెందిన సింగ్ ఓబీసీ నేత. మిర్జాపూర్, బుందేల్‌ఖండ్‌లో సింగ్‌కు మంచి పట్టుంది. ప్రస్తుతం ఆయన యూపీ రవాణాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. మహేంద్రనాథ్ పాండే .. మోడీ క్యాబినెట్‌లో చోటు దక్కడంతో యోగి మంత్రివర్గంలో చేరారు. ఈ క్రమంలో నిన్న బీజేపీ చీఫ్ అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేడీ నడ్డాతో యోగి ఆదిత్యనాథ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింగ్‌కు బీజేపీ చీఫ్ పదవీ గురించి చర్చ జరిగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

Swatantra Dev Singh is BJP chief in UP, Chandrakant Patil in Maharashtra

మరో 3 నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ చీఫ్ పదవీని చంద్రకాంత్ పాటిల్‌కు అప్పగించారు. పాటిల్ ఫడ్నవీస్ క్యాబినెట్‌లో పబ్లిక్ వర్సక్ మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌లో జరిగే ఎన్నికల కోసం బీజేపీ ఇప్పటినుంచే కసరత్తు చేస్తోంది. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలపరిచి .. తిరిగి విజయం సాధించేందుకు వ్యుహరచన చేస్తున్నది. యూపీ, మహారాష్ట్ర తర్వాత బీహర్ బీజేపీ చీఫ్ మార్చనున్నారు. ప్రస్తుతం బీజేపీ చీఫ్‌గా నిత్యానంద్ రాయ్ కొనసాగుతున్నారు. రాయ్ కూడా ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. ఈయనకు అమిత్ షా బాధ్యతలు అప్పగించారు. తర్వాత కేంద్ర క్యాబినెట్‌లో రాయ్ .. కూడా చేరారు. హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో బీహర్ చీఫ్‌ను కూడా నియమించాల్సి ఉంది. దీనిపై కూడా బీజేపీ హైకమాండ్ ఫోకస్ చేస్తోంది.

English summary
The Bharatiya Janata Party on Tuesday named Swatantra Dev Singh as its party chief in Uttar Pradesh and Maharashtra public works minister Chandrakant Patil as the state’s party unit chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X