వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వైన్‌ ప్లూ: పరీక్షలు వాయిదా, యూనివర్సిటీకి సెలవులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో స్వైన్‌ ప్లూ బాగా విస్తరిస్తోంది. ప్రఖ్యాత అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీలో చదువుతున్న ఏడుగురు విద్యార్థుల్లో స్వైన్‌ప్లూ లక్షణాలు బయటపడటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 25 వరకు విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించారు.

స్వైన్‌ ప్లూ వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఫిబ్రవరి 13న యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న విద్యార్ధిని మృతి చెందడంతో, మహిళా కాలేజీకి ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.

Swine Flu scare: Aligarh Muslim University suspends classes till Feb 25

అంతక ముందు ఆమెతో పాటు విహార యాత్రకు వెళ్లిన 187 మంది విద్యార్ధుల్లో ఏడుగురిలో స్వైన్‌ ప్లూ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో ఈ సంఖ్య మరింతగా పెరగడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు యూనివర్సిటీలో జరిగే అన్ని సమావేశాలు, మీటింగ్స్‌ను వాయిదా వేశారు.

లక్నోలో ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో 69 స్వైన్‌ ప్లూ కేసులను గుర్తించినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ యాదవ్ తెలిపారు. ఆలీఘర్‌లో గత పదిరోజుల్లో స్వైన్‌ప్లూ బారినపడి ముగ్గురు మరణించినట్లు పేర్కొన్నారు.


రాజస్ధాన్‌లో 165 కు చేరిన స్వైన్‌ ప్లూ మృతుల సంఖ్య

రాజస్ధాన్‌లో స్వైన్‌ ప్లూతో మరణించిన వారి సంఖ్య తాజాగా 16కు చేరింది. నాగౌర్‌‌లో నలుగురు, జైపూర్, జోథ్ పూర్‌లో ఇద్దరు చొప్పున, సికర్, బికనీర్‌లో ఒక్కొక్కరు మృతి చెందారు. రాజస్ధాన్ రాష్ట్ర వ్యాప్తంగా 2569 మందికి H1N1 వైరస్ సోకినట్లుగా నిర్ధారించగా ఇప్పటి వరకు 165 మంది మరణించారు.

English summary
Aligarh Muslim University has suspended its classes till February 25 after a suspected Swine Flu death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X