వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చక్రం తిప్పింది అతనే.. సింధియా నిర్ణయం వెనక చాలా జరిగింది.. ఆర్నెళ్లుగా ఆ ముగ్గురూ కలిసి..

|
Google Oneindia TeluguNews

గ్వాలియర్ రాజవంశీయుడు,కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాధిత్య సింధియా పార్టీని వీడటం ఆ పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది. గత రెండేళ్లలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుంటోందని భావిస్తున్న తరుణంలో సింధియా లాంటి నేత చేజారడం ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు పంపిస్తుందని ఆందోళన చెందుతోంది. అసలు సింధియా బీజేపీ వైపు చూస్తున్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు పసిగట్టలేకపోయారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. సింధియా నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నదేనా.. లేక చాలాకాలంగా బీజేపీతో టచ్‌లో ఉండి ఇప్పుడీ నిర్ణయం తీసుకున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానంగా ఓ ఆసక్తికర కథనం తెరపైకి వచ్చింది.

చక్రం తిప్పింది అతనే..

చక్రం తిప్పింది అతనే..

ఆ కథనం ప్రకారం.. జ్యోతిరాధిత్య సింధియా బీజేపీ గూటికి చేరడం వెనుక బీజేపీ జాతీయ ప్రతినిధి,మాజీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సయ్యద్ జాఫర్ ఇస్లాం కీలక పాత్ర పోషించారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయమేంటంటే.. జ్యోతిరాధిత్య సింధియా కూడా గతంలో ప్రముఖ మోర్గాన్ స్టాన్లీ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులో పనిచేశారు. కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలం పనిచేసిన సింధియా ఇప్పుడు బీజేపీలో చేరడానికి ఈ బ్యాంకింగ్‌ లింక్ ఉపయోగపడింది. జాఫర్ ఇస్లాం,సింధియా,వీరిద్దరి కామన్ ఫ్రెండ్.. ఈ ముగ్గురు కలిసి గత ఆర్నెళ్లుగా సింధియా రాజకీయ భవితవ్యంపై చర్చోపచర్చలు జరిపారు. ఆ చర్చల ఫలితంగానే చివరకు సింధియా బీజేపీ గూటికి చేరారు.

ఆర్నెళ్లుగా ముగ్గురు కలిసి చర్చోపచర్చలు..

ఆర్నెళ్లుగా ముగ్గురు కలిసి చర్చోపచర్చలు..


ఢిల్లీలోని లుత్యెన్స్ ప్రాంతంలో ఉన్న పలు హోటళ్లలో గత ఆర్నెళ్లలో ఈ ముగ్గురు పలుమార్లు సమావేశమయ్యారు. కలిసి భోజనం చేస్తూ ఎక్కువగా రాజకీయాల గురించే మాట్లాడేవారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా,ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జేపీ నడ్డా చుట్టూ వీరి చర్చలు జరిగేవి. ఇదే క్రమంలో సింధియా పార్టీ మార్పుకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చేది. ఆ చర్చల ఫలితంగా రెండు నెలల క్రితమే సింధియా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

డజనుసార్లకు పైగా బీజేపీ అగ్ర నేతలతో సింధియా భేటీ

డజనుసార్లకు పైగా బీజేపీ అగ్ర నేతలతో సింధియా భేటీ


దాదాపు రెండు నెలల క్రితం సింధియా మొదటిసారి అమిత్ షాతో భేటీ అయ్యారు. అప్పటికీ అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత కూడా సింధియా బీజేపీ అగ్ర నాయకులతో,మరీ ముఖ్యంగా అమిత్ షాతో ఆరుసార్లకు పైగా భేటీ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన జాఫర్ ఇరువర్గాలను ఒప్పించడంలో సఫలమయ్యారు. జాఫర్‌పై ఉన్న నమ్మకంతో సింధియా పార్టీలో చేరేందుకు బీజేపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే క్రమంలో హోలీ పండగ రోజు సింధియా ఢిల్లీలోని తన ఇంటి నుంచి బయలుదేరగా.. చాలామంది గ్వాలియర్ వెళ్తున్నారని భావించారు. తన తండ్రి మాధవ్ రావ్ సింధియా 75వ జయంతి సందర్భంగా గ్వాలియర్ వెళ్లి నివాళులు అర్పిస్తారని అనుకున్నారు.కానీ సింధియా మాత్రం ఢిల్లీలోని లోధి హోటల్‌కు వెళ్లి తన స్నేహితుడైన జాఫర్‌తో సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి అక్కడ టీ తాగి.. అనంతరం కౌటిల్య మార్గ్‌లోని గుజరాత్ భవన్‌కు వెళ్లారు. అక్కడ అమిత్ షా వీరిద్దరిని తన కారులో ఎక్కించుకుని 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ భేటీ ముగిశాక.. మళ్లీ వారిద్దరిని గుజరాత్ భవన్ దిగబెట్టారు. అప్పటికే కాంగ్రెస్ వర్గాలు సింధియా జంపింగ్‌పై దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చేశాయి.

కమల్‌నాథ్ సర్కార్ కూలిపోవడం ఖాయమే..

కమల్‌నాథ్ సర్కార్ కూలిపోవడం ఖాయమే..

మొత్తం మీద కాంగ్రెస్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుని సింధియా బీజేపీలోకి వెళ్లారు. కేంద్రమంత్రి పదవితో పాటు రాజ్యసభ సీటు ఒప్పందం మేరకే సింధియా కాషాయ పార్టీలోకి వెళ్లినట్టు సమాచారం. ఇప్పటికే సింధియా వర్గానికి చెందిన 20కి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. దీంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సర్కార్ కూలిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. స్పీకర్ వారి రాజీనామాలను ఆమోదిస్తే.. ఇప్పుడున్న బలం ప్రకారం బీజేపీ ప్రభుత్వంలోకి రావడం లాంఛనమే. కాంగ్రెస్‌కు అత్యంత విధేయుడైన సింధియా బీజేపీలోకి వెళ్లడం వెనుక పార్టీ పెద్దల ఫెయిల్యూర్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సింధియా బీజేపీలో టచ్‌లో ఉన్నాడన్న విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

English summary
That Jyotiradtiya Scindia worked for investment bank Morgan Stanley is a well-known fact, but that, years later, it became a link instrumental in sealing his decision to join the Bharatiya Janata Party (BJP) may come as a bit of a surpris
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X