వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ మంత్రి తొలగింపు..!! సంచలన నిర్ణయం తీసుకున్న గవర్నర్..!!

|
Google Oneindia TeluguNews

చెన్నై : తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ మంత్రిని క్యాబినెట్ నుంచి తొలగించారు. అయితే సీఎం పళనిస్వామి మంత్రివర్గం సూచనల మేరకు ఐటీ మంత్రిని క్యాబినెట్ నుంచి తప్పించామని రాజ్ భవన్ వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. అయితే మంత్రిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయడం మాత్రం చర్చానీయాంశమైంది.

తమిళనాడు ఐటీ శాఖ మంత్రి ఎం మణికందన్‌ను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్టు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ పేర్కొన్నారు. ఐటీశాఖ బాధ్యతలను రెవెన్యూశాఖ మంత్రి ఆర్ బీ ఉదయ్ కుమార్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం పళనిస్వామి సూచనమేరకు ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేసినట్టు పేర్కొన్నారు. కానీ దీనిపై తమిళనాడు సీఎంవో ధ్రువీకరిస్తూ ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఐటీశాఖ మంత్రి మణికందన్‌ను పదవీ నుంచి తప్పించడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.

T N Governor made a sensational decision.. it minister remove cabinet

సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. వేలూరులో కోట్ల కట్టలు బయటపడటంతో ఎన్నికల సంఘం ఎన్నికలను నిలిపివేసింది. దీంతో మణికందన్ ఆదేశాల మేరకే దాడులు జరిగాయా ? లేదంటే కేంద్రం సూచనలతో దాడులు చేశారా అనే అంశంపై స్పష్టత లేదు. మణికందన్ తొలగింపును ఇదీ కారణమా అనే చర్చ జరుగుతుంది. కానీ ఎందుకు బర్తరఫ్ చేశారనే అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

English summary
Tamil Nadu Governor Banwarilal Purohit has made a sensational decision. One minister was removed from the cabinet. However, Raj Bhavan sources said in a statement that the it minister has been evicted from the cabinet on the instructions of CM Palaniswami's cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X