వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజ్ మహల్ క్లోజ్: గోల్కొండ, హంపి సహా అన్ని చారిత్రక కట్టడాల్లో అనుమతి ఉన్నా.. అక్కడ మాత్రం

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన చారిత్రక కట్టడం..తాజ్ మహల్‌ మూసివేత మరి కొద్దిరోజుల పాటు కొనసాగబోతోంది. ఆగ్రా సహా ఉత్తర ప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ఆర్కియాలాజికల్ సర్వే అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజ్‌మహల్ సహా ఆగ్రా పరిధిలోని ఏ ఒక్క చారిత్రక కట్టడాన్ని కూడా ఇప్పట్లో సందర్శకుల కోసం తెరవబోమని వెల్లడించారు.

శరీరంపై పుండ్లు: చైనాలో పుట్టుకొచ్చిన కొత్త వైరస్: సరిహద్దులూ దాటేసింది: పొరుగుదేశంపై పంజాశరీరంపై పుండ్లు: చైనాలో పుట్టుకొచ్చిన కొత్త వైరస్: సరిహద్దులూ దాటేసింది: పొరుగుదేశంపై పంజా

ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్‌‌డౌన్ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి దేశంలోని అన్ని చారిత్రక కట్టడాల్లో సందర్శకులకు అనుమతి ఇవ్వాలని ఇదివరకే ఆర్కియాలాజికల్ సర్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కర్ణాటకలోని ప్రఖ్యాత హంపి, హైదరాబాద్‌లోని చారిత్రాత్మక గోల్కొండ సహా అన్ని చారిత్రక కట్టడాల్లో సందర్శకుల రాకను పునరుద్ధరించారు.

 Taj Mahal to remain closed due to raising Covid positive cases in Agra

తొలుత తాజ్ మహల్‌లో కూడా సందర్శకులను అనుమతించాలని నిర్ణయించారు. తాజ్‌మహల్ సహా అక్బర్ టూంబ్, ఫతేపూర్ సిక్రీ ఫోర్ట్, ఇత్మాద్ ఉద్ దౌలా, ఆగ్రా ఫోర్ట్ వంటి పర్యాటక కేంద్రాలను సందర్శకుల కోసం పునరుద్ధరిచాలని భావించారు. అదే సమయంలో ఆగ్రాలో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా నమోదు అయ్యాయి. ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా ఉధృతిలో ఎలాంటి మార్పూ రాలేదు. ఫలితంగా- తాజ్ మహల్ సహా ఇతర చారిత్రక కట్టడాలల్లో అమలు చేస్తోన్న లాక్‌డౌన్‌ను కొనసాగించాలని చివరి నిమిషంలో నిర్ణయించారు.

Recommended Video

Namaste Trump: Trump Once Had A 'Taj Mahal' Of His Own, Now Got Emotional

ఆగ్రా జిల్లాలో కొద్దిరోజులుగా కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి చారిత్ర క కట్టడాల్లో సందర్శకలకు అనుమతించట్లేదని వెల్లడించారు. ఈ ఒక్క జిల్లాలోనే నాలుగు రోజుల వ్యవధిలో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆగ్రాలో 71 కంటైన్మెంట్ జోన్లను ప్రకటించారు. చారిత్రాత్మక కట్టడాలు ఉన్న ప్రాంతాలను బఫర్‌జోన్‌గా ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారించడానికి ఈ ఏడాది మార్చి 17వ తేదీన తాజ్‌మహల్‌ను మూసివేశారు. దాన్ని మరికొన్నాళ్ల పాటు కొనసాగించనున్నారు.

English summary
Taj Mahal, one of the seven wonders of the world, is not likely to be re-opened soon as the authorities have decided to keep it closed for the public due to the prevailing COVID-19 condition in Agra. Other monuments like Fatehpur Sikri Fort, Itmad-ud-Daula, and Agra Fort will also remain closed in Agra district. The official statement said, "Taj Mahal monument falls under the jurisdiction of Tajganj police station, which is currently a containment zone. Fatehpur Sikri Fort, Itmad-ud-Daula, and Agra Fort, etc are also in the Buffer Zones. Opening of these monuments may increase the spread of COVID-19."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X