• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Taj Mahal Name Change: కొత్త పేరు ఇదే: మా సీఎం మామూలోడు కాదు: బీజేపీ ఎమ్మెల్యే

|

లక్నో: చారిత్రాత్మక కట్టడం తాజ్ మహల్ పేరు మారబోతోందా? ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన ఈ మొఘల్ సామ్రాజ్య వారసత్వ కట్టడానికి యోగి సర్కార్ కొత్త పేరును పెట్టబోతోందా? ఇదివరకు అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్‌గా మార్చినట్టే.. హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చాలని నిర్ణయించినట్టే తాజ్ మహల్‌కు కొత్త పేరును పెట్టాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ అనుమానాలకు.. ఉత్తర ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు మరింత బలాన్నివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

కొత్త పేరేంటీ?

కొత్త పేరేంటీ?

తాజ్ మహల్‌ను రామ్ మహల్ లేదా శివ్ మహల్‌గా పెట్టాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భావిస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ స్పష్టం చేశారు. తాజ్ మహల్‌ను నిర్మించిన స్థలంలో మహాశివుడి ఆలయం ఉందనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. శివాలయాన్ని కూల్చి.. దానిపై తాజ్ మహల్‌ను నిర్మించారని అన్నారు. ఇప్పుడు దాన్ని ధ్వంసం చేయడం కుదిరే పని కానందున.. తాజ్ మహల్‌కు శివ్ మహల్ లేదా రామ్ మహల్‌గా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెప్పారు.

 ఆయన శివాజీ వంశీయుడు..

ఆయన శివాజీ వంశీయుడు..

యోగి ఆదిత్యనాథ్‌ను సురేంద్ర సింగ్ ఆకాశానికెత్తేశారు. ఆయన సాధారణ వ్యక్తి కాదని, మరాఠా సామ్రాజ్య చక్రవర్తి ఛత్రపతి శివాజీ వంశీయుడని పేర్కొన్నారు. ముస్లిం రాజుల పరిపాలన హిందుత్వంపై దాడులు చోటు చేసుకున్నాయని, హైందవ సంస్కృతి ధ్వంసమైందని అన్నారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లో స్వర్ణయుగం నడుస్తోందని, తాజ్ మహల్ పేరును మార్చడానికి ఇంతకంటే మంచి సమయం లభించబోదని సురేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ రూపంలో ఛత్రపతి శివాజీ వారసుడు యూపీని పరిపాలిస్తున్నారని, ముస్లిం రాజుల హయాంలో ధ్వంసమైన సంస్కృతిని ఆయన పునరుద్ధరిస్తున్నారని చెప్పారు.

పేరు మార్పు కొత్తేమీ కాదు..

పేరు మార్పు కొత్తేమీ కాదు..


ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పలు ప్రాంతాలకు పేర్లను మార్చిన విషయం తెలిసిందే. అలహాబాద్‌ను ప్రయాగ్ రాజ్‌గా మార్చారు. ఫైజాబాద్‌ను అయోధ్యగా బదలాయించారు. మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ జంక్షన్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యయ జంక్షన్‌గా మార్పు చేశారు. ఆగ్రా విమానాశ్రయానికి ఇదే పేరు పెట్టారు. లక్నోలోని ఉర్దూ బజార్‌ను హిందీ బజార్‌గా, అలీ నగర్‌ను ఆర్యనగర్‌గా మార్చారు.

హైదరాబాద్ పేరును

హైదరాబాద్ పేరును

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సమయంలోనూ పేరు మార్పు ప్రస్తావన వచ్చిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీలో తాము గెలిస్తే.. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ అప్పట్లో ప్రకటించారు. పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి పేరు మీద భాగ్యనగర్ ఏర్పడిందంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కోల్‌కతలోని ప్రఖ్యాత విక్టోరియా ప్యాలెస్‌ను జానకీ ప్యాలెస్‌గా మార్చుతామంటూ ప్రస్తుతం బీజేపీ నేతలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రచారాన్ని సాగిస్తోన్నారు. పేర్ల మార్పు ప్రతిపాదనల పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ కమలనాథులు వెనక్కి తగ్గట్లేదు.

English summary
Agra’s iconic Taj Mahal will be renamed as Ram Mahal, claimed Uttar Pradesh BJP MLA from Baira constituency, Surendra Singh on Saturday. Stirring up a new controversy, the BJP MLA told reporters that Taj Mahal used to be a Lord Shiva temple before it was deconstructed and rebuilt into the famous tomb.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X