• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సందర్శకుల కోసం తెరుచుకోనున్న తాజ్ మహల్ .. ఎప్పుడంటే

|

కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో కరోనా వైరస్ ను నియంత్రించే క్రమంలో భాగంగా తాజ్ మహల్ సందర్శన మార్చి నెలలో నిలిపివేశారు . ఒక్క తాజ్ మహల్ మాత్రమే కాదు ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ, మహాతాబ్ బాగ్ సహా స్మారక చిహ్నాలన్ని , ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని మూసివేశారు . హుమాయున్ సమాధి, కుతుబ్ మినార్, అజంతా ఎల్లోరా గుహలతో సహా 200 కి పైగా చారిత్రక భవనాలను, ప్రధాన స్మారక కట్టడాలను మూసివేశారు . కరోనా ప్రభావంతో పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇప్పుడు పర్యాటక ప్రాంతాలను తిరిగి తెరవాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది .

కరోనాను జయించటంలో మహిళలే శక్తివంతులట...ఆసక్తికర అధ్యయనం

సెప్టెంబర్ 21 నుండి తాజ్ మహల్

సెప్టెంబర్ 21 నుండి తాజ్ మహల్

దాదాపు ఆరు నెలలుగా మూసివేయబడిన తాజ్ మహల్ ను తిరిగి పర్యాటకుల సందర్శన కోసం తెరవాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం . సెప్టెంబర్ 21 నుండి తిరిగి ప్రజల కోసం తాజ్ మహల్ తెరవాలని నిర్ణయం తీసుకుంది . అంతేకాకుండా, మరో రెండు ప్రపంచ ప్రఖ్యాత వారసత్వ ప్రదేశాలు - ఎర్ర కోట మరియు ఆగ్రా కోట కూడా సెప్టెంబర్ 21 న సందర్శకుల కోసం తిరిగి తెరవబడతాయని పేర్కొంది . అంతేకాదు కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో,కరోనా కట్టడి కోసం తాజ్ మహల్ తో పాటు ఆగ్రా ఫోర్ట్ ప్రవేశం ఒక రోజులో 5,000 కి పరిమితం చేయబడింది. తాజ్ మహల్ లో 2,500 మంది ,ఆగ్రా కోటలో 2,500 మంది సందర్శకులను మాత్రమే అనుమతించనున్నట్లు ఆగ్రా జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్ సింగ్ తెలిపారు.

కరోనా నిబంధనలను పాటిస్తూ తాజ్ సందర్శన .. ఆన్ లైన్ లో టికెట్ విక్రయాలు

కరోనా నిబంధనలను పాటిస్తూ తాజ్ సందర్శన .. ఆన్ లైన్ లో టికెట్ విక్రయాలు

ఆగ్రాలో సెప్టెంబర్ 7 వరకు 3,459 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని తెలుస్తుంది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, పర్యాటకులు అందరూ తాజ్ మహల్ మరియు కోటను సందర్శించడానికి సామాజిక దూరాన్ని కొనసాగించడం మరియు మాస్కులను ధరించడం వంటి ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు . పర్యాటకులను పరిమిత సంఖ్యలో అనుమతించనున్న నేపధ్యంలో అదనంగా టికెట్స్ ఇవ్వమని పేర్కొన్నారు. సందర్శకులు ఆన్‌లైన్ పోర్టల్ నుండి ఎంట్రీ టిక్కెట్లను కొనుగోలు చేసుకోవచ్చని ఆయన తెలిపారు .

తాజ్ మహల్ మూసివేతతో పర్యాటక రంగానికి తీవ్ర నష్టం

తాజ్ మహల్ మూసివేతతో పర్యాటక రంగానికి తీవ్ర నష్టం

తాజ్ మహల్ మరియు ఇతర ప్రపంచ ప్రఖ్యాత స్మారక చిహ్నాలను తిరిగి ప్రారంభించే ముందు, దేశంలో అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను కేంద్రం తిరిగి ప్రారంభించాలని ఆగ్రా టూరిస్ట్ వెల్ఫేర్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రహలాద్ అగర్వాల్ సూచించారు.తాజ్ మహల్ మూసివేయడం ఆగ్రా పర్యాటక పరిశ్రమకు లెక్కలేనంత నష్టాన్ని కలిగించిందని ఆగ్రా టూరిజం గిల్డ్ మాజీ చైర్మన్ అరుణ్ డాంగ్ తెలియజేశారు.ఎంపి ఎస్పీ సింగ్ బాగెల్ కూడా మాట్లాడారు.

  Nirav Modi Assets Seized : నీరవ్‌ మోదీ ఆస్తులు జప్తు చేసిన ED || Oneindia Telugu
  అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సందర్శకుల కోసం తాజ్ మహల్ పునః ప్రారంభం

  అన్ లాక్ ప్రక్రియలో భాగంగా సందర్శకుల కోసం తాజ్ మహల్ పునః ప్రారంభం

  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ స్మారక చిహ్నం మూసివేయడం ఆగ్రా పర్యాటక పరిశ్రమను దాదాపు నాశనం చేసిందని చెప్పారు. దానిని తిరిగి తెరిచే వరకు, నగర ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి అభివృద్ధికి అవకాశం లేదని పేర్కొన్నారు . ఇప్పటివరకు, తాజ్ మహల్ మరియు ఆగ్రా కోట మినహా ఆగ్రాలో అన్ని స్మారక చిహ్నాలు తిరిగి తెరవబడ్డాయి. కరోనా వ్యాప్తి కారణంగా మార్చిలో మూసివేయబడిన దేశంలోని మొట్టమొదటి సందర్శనా స్థలాలలో తాజ్ మహల్ ఒకటి, దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించబడటానికి ముందే తాజ్ మహల్ మూసివేశారు . ఇక తాజా అన్ లాక్ ఉత్తర్వుల్లో భాగంగా తాజ్ మహల్ సందర్శకుల కోసం తెరుచుకోనుంది .

  English summary
  Taj Mahal that has remained closed for almost six months, will reopen for public from September 21. Moreover, two other world-famous heritage sites -- Red Fort and Agra Fort -- will also reopen for visitors on September 21.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X