వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీ టీవీ ప్రసారాలు బ్యాన్: పఠాన్ కోట్ దెబ్బ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ జాతీయ టీవీ చానెల్ ఎన్టీటీవీ ప్రసారాలు దేశ వ్యాప్తంగా 24 గంటలు నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీవీ ప్రసారాల ఉల్లంఘనే అందుకు కారణం అని కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు అంటున్నాయి.

2016 జనవరి 4వ తేదిన పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద ఉగ్రవాదులు దాడులు చేసిన సమయంలో మన సైన్యం వారిని తిప్పికొట్టంది. ఆ సమయంలో ఎన్టీటీవీ తన హద్దులు మీరి పఠాన్ కోట్ లోని సున్నితమైన ప్రాంతాలను చానెల్ లో ప్రత్యక్ష ప్రసారం చేసిందని గుర్తించారు.

Take ND tv India off air on November 9 for Pathankot

ఎన్టీ టీవీ ప్రత్యక్ష ప్రసారం చెయ్యడం వలన ఉగ్రవాదులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ఆ వివరాలను ప్రసారం చేసి ప్రోగ్రాం కోడ్ ను ఉల్లంఘించారని ప్రభుత్వం గుర్తించింది.

ఈ విషయంపై మంత్రులతో నిజనిర్దారణ కమిటీని ఏర్పాటు చేసి పరిశీలించారు. ఎన్టీ టీవీ తన ప్రోగ్రామ్ కోడ్ ను ఉల్లంఘించిందని వెలుగు చూసిందని కమిటి నిర్దారించింది. అందు వలన ఈనెల 9వ తేది మద్యాహ్నం 1 గంట నుంచి 10వ తేది మద్యాహ్నం 1 గంట వరకు ఎన్టీ టీవీ ప్రసారాలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోని యుద్ద విమానాలు, విమాన స్థావరాలు, మోటార్లు, హెలికాప్టర్లు, రాకెట్ లాంచర్లు, పెట్రోల్ బంకులు తదితరాలను ఎన్డీ టీవీ ప్రత్యక్ష ప్రసారంలో చూపించారని ఆ టీవీ చానెల్ కు ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చారని అధికారులు అంటున్నారు.

English summary
NDTV India channel for one day on any platform throughout India with effect from 00:01 hrs on 9th November to 00:01 hrs of 10th November.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X