వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఠాకూరు బీజేపీలో చేరొద్దు : తిరిగి పార్టీలోకి తీసుకొస్తానన్న హర్ధిక్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : గుజరాత్ కాంగ్రెస్ పార్టీకి ఠాకూర్ నేత అల్పేశ్ చేసిన రాజీనామా ఆ పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. దీంతో అల్పేశ్ స్నేహితులను కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపింది. అల్పేశ్ రాజీనామాకు కారణలేంటో తెలియదని, కానీ అతనిని తిరిగి పార్టీలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పాటిదార్ ఉద్యమనేత హర్ధిక్ పటేల్, దళిత సమస్యలపై పోరాడుతోన్న జిగ్నేశ్ మేవాని.

పార్టీలోకి తీసుకొస్తా ..?

పార్టీలోకి తీసుకొస్తా ..?

అల్పేశ్‌ను తిరిగి పార్టీలోకి తీసుకొస్తానని స్పష్టంచేశారు హర్ధిక్ పటేల్. రాజీనామాపై ఠాకూర్‌తో మాట్లాడి .. అసంతృప్తికి గల కారణాలను తెలుసుకుంటానని చెప్పారు. అతనిని ఒప్పించి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తాననే ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీలో మాత్రం చేరొద్దు ?

బీజేపీలో మాత్రం చేరొద్దు ?

పార్టీకి రాజీనామా చేసిన అల్పేశ్ ..బీజేపీలో మాత్రం చేరొద్దంటున్నారు దళిత నేత జిగ్నేశ్ మేవాని. ఠాకూర్ వర్గానికి, పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీలో చేరొద్దని సూచిస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను వీడటానికి కారణాలను తెలుసుకొని, తగిన సూచన ఇస్తానని స్పష్టంచేశారు.

వీరు ముగ్గురు మంచి స్నేహితులు

వీరు ముగ్గురు మంచి స్నేహితులు

గుజరాత్‌లో దళిత సమస్యలపై పోరాడుతున్న జిగ్నేశ్ మేవాని, పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్, ఓబీసీ నేత అల్వేశ్ ఠాకూరు తమ వర్గం ప్రయోజనాల కోసం పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు ముగ్గురు మంచి స్నేహితులు కూడా. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకొని .. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ నిన్న అల్వేశ్ రాజీనామా చేయడంతో వీరిద్దరూ స్పందించారు.

English summary
The resignation of Thakur leader Alpesh to the Gujarat Congress party is stirring. Alpesh is not aware of his resignation, but he has expressed his willingness to return to the party Patil's movement, Hardik Patel and Jignes Mevani, who is fighting against Dalit issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X