వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తలైవా' రజనీకాంత్ పార్టీ రిజిస్ట్రేషన్ కు సన్నాహాలు .. తమిళనాట రాజకీయ పార్టీలలో ప్రకంపనలు

|
Google Oneindia TeluguNews

సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం దేశవ్యాప్తంగా రాజకీయాలలో చర్చనీయాంశం కాగా, తమిళనాట రాజకీయ పార్టీలలో ప్రకంపనలకు కారణమైంది. రజినీకాంత్ పార్టీ పెట్టడం వల్ల తమ పార్టీ కి లాభమా నష్టమా? రజినీకాంత్ పార్టీ పెడితే తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతుంది? వంటి అంచనాలను వేయడంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తలమునకలయ్యాయి . అసలు రజినీకాంత్ పార్టీ పెట్టి సింగిల్ గా ముందుకు వెళతాడా? లేక ఏదైనా కూటమితో కలిసి ముందుకు సాగుతాడా అన్నది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ.

 ఎస్పీ బాలు గాత్రం అజరామరం అన్న చంద్రబాబు .. మిస్ అవుతున్నానంటూ రజనీకాంత్ .. మమతా బెనర్జీ కూడా .. ఎస్పీ బాలు గాత్రం అజరామరం అన్న చంద్రబాబు .. మిస్ అవుతున్నానంటూ రజనీకాంత్ .. మమతా బెనర్జీ కూడా ..

 రజినీకాంత్ నుండి రాజకీయ సవాళ్లు ఎదురవుతాయా ? అన్నాడీఎంకే లో చర్చ

రజినీకాంత్ నుండి రాజకీయ సవాళ్లు ఎదురవుతాయా ? అన్నాడీఎంకే లో చర్చ

తమిళనాట సూపర్ స్టార్, లక్షలాదిమంది అభిమాన హీరో ఆయన రజినీకాంత్ పార్టీ పెట్టడం, ఆయన అభిమానులకు సంతోషం కలిగించే వార్త అయినప్పటికీ, తమిళనాడులోని రాజకీయ పార్టీలకు మాత్రం ఇది బాగా ఆలోచించాల్సిన అంశం గా కనిపిస్తుంది. ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడిఎంకె, ఇప్పటికే బీజేపీ తో దోస్తీ చేస్తూ ముందుకు సాగుతుంది. ఇక ఇప్పుడు రజినీకాంత్ పార్టీ పెడితే రాబోయే ఎన్నికల్లో రజనీకాంత్ నుంచి సవాళ్లు ఎదురవుతాయా , లేక రజినీ కూడా తమ కూటమి తో దోస్తీ కడతాడా అన్నది అన్నాడీఎంకే వర్గాలు ఆలోచిస్తున్నాయి.

రజనీకాంత్ ను ముందు పార్టీ పేరు నమోదు చేసుకోనివ్వండి, ఆలోచిద్దాం అన్న తమిళనాడు సీఎం

రజనీకాంత్ ను ముందు పార్టీ పేరు నమోదు చేసుకోనివ్వండి, ఆలోచిద్దాం అన్న తమిళనాడు సీఎం

రజినీకాంత్ పార్టీ పెట్టడంపై తమిళనాడు సీఎం పళని స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ ను మొదట తన పార్టీ పేరును నమోదు చేసుకోనివ్వండి ... ఆ తర్వాత దాని గురించి మాట్లాడదాం అంటూ పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మరియు అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ.పన్నీర్‌సెల్వం రజినీకాంత్ ప్రకటనను స్వాగతించారు . అంతేకాదు అవకాశం ఉంటే కూటమిలో భాగస్వామ్యం సాధ్యమవుతుందని కూడా చెప్పారు. ఇక సీఎం పళనిస్వామి పన్నీర్‌సెల్వం అభిప్రాయంలో తప్పేమీ లేదని చెప్పారు. దీన్నిబట్టి రజనీకాంత్ , కూటమితో జతకట్టే లా అన్నాడీఎంకే ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నట్లు గా తెలుస్తుంది.

 వచ్చే ఎన్నికల్లో రజినీకాంత్ బరిలోకి దిగితే నష్టం జరిగేది అన్నాడీఎంకే కా? లేక డీఎంకే కా

వచ్చే ఎన్నికల్లో రజినీకాంత్ బరిలోకి దిగితే నష్టం జరిగేది అన్నాడీఎంకే కా? లేక డీఎంకే కా

వచ్చే ఎన్నికల్లో రజినీకాంత్ కూడా పార్టీ పెట్టి బరిలోకి దిగితే నష్టం జరిగేది అన్నాడీఎంకే కా? లేక డీఎంకే కా ? అన్న చర్చ తమిళనాడు రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. గతంలో 2006 సంవత్సరంలో విజయ్ కాంత్ పార్టీ పెట్టి ఒంటరిగా బరిలోకి దిగినప్పుడు కేవలం ఒక్క సీటు, అది కూడా విజయ్ కాంత్ పోటీచేసిన స్థానాన్ని గెలుచుకోగా, 8.5 శాతం ఓట్లను చీల్చడం ద్వారా 100 నియోజకవర్గాలపై నాడు విజయ్ కాంత్ పార్టీ ప్రభావం చూపించింది. ఆ ప్రభావం అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థుల గెలుపోటములపై పడింది . అయితే వచ్చే ఎన్నికల్లో రజినీకాంత్ వల్ల కూడా అదే పరిస్థితి ఎదురైతే ఎవరికి ఎక్కువగా నష్టం జరుగుతుందనేది అంతుచిక్కని పరిస్థితి గా ఉంది.

రజనీ ప్రకటన మింగుడు పడక సైలెంట్ అయిన రాజకీయ పార్టీలు

రజనీ ప్రకటన మింగుడు పడక సైలెంట్ అయిన రాజకీయ పార్టీలు

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా వెళుతున్న రాజకీయ పార్టీలకు రజనీకాంత్ ప్రకటన మింగుడుపడలేదు. నిన్న మొన్నటి వరకు అధికారం మాదే అని ధీమా వ్యక్తం చేసిన డీఎంకే శ్రేణులు, రజిని ప్రకటనతో కొత్త వ్యూహాలను రచించే పనిలో పడ్డారు . మరోపక్క తమ పార్టీ గెలుపుకు రజనీకాంత్ మద్దతు కోరుతామని పేర్కొన్న కమల్ హాసన్ రజనీకాంత్ రాజకీయ పార్టీ పెడుతున్నారన్న ప్రకటనతో సైలెంట్ అయ్యారు.

ఇదే సమయంలో కొత్త పార్టీ స్థాపనకు అవసరమైన అన్ని సన్నాహాలు ప్రారంభించారు రజనీకాంత్.

రజనీకాంత్ పార్టీకి ప్రధాన సమన్వయ కర్తగా అర్జున్ మూర్తి నియామకం

రజనీకాంత్ పార్టీకి ప్రధాన సమన్వయ కర్తగా అర్జున్ మూర్తి నియామకం

రజినీకాంత్ స్థాపించబోయే పార్టీకి ప్రధాన సమన్వయ కర్తగా అర్జున్ మూర్తిని నియమించారు. అయినా పార్టీ రిజిస్ట్రేషన్ పనులన్నీ 28 రోజుల్లో పూర్తి చేస్తామని, రజనీ చిత్రం పూర్తయిన తర్వాతనే పార్టీని రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపారు. మొన్నటి వరకు బిజెపిలో పని చేస్తున్న ఆయన బిజెపికి రాజీనామా చేసి, రజినీకాంత్ ప్రారంభించనున్న పార్టీకి పని చేయడం కోసం రంగంలోకి దిగారు. ఆధ్యాత్మిక భావాలతో కూడిన నిజాయితీ రాజకీయాలను రజనీకాంత్ కొనసాగిస్తారని పేర్కొన్నఅర్జున్ మూర్తి రజినీకాంత్ పార్టీ పెడతానని సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకున్నారంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తున్న రజనీకాంత్ పార్టీ .. ఎంతైనా తలైవా అంటున్న ఫ్యాన్స్

తమిళనాట ప్రకంపనలు సృష్టిస్తున్న రజనీకాంత్ పార్టీ .. ఎంతైనా తలైవా అంటున్న ఫ్యాన్స్

ఏదిఏమైనా రజినీకాంత్ పెడుతున్న పార్టీ ప్రభావం ఏ పార్టీని బాధిస్తుంది , ఏ పార్టీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అన్నదానిపై తమిళనాడులో అన్ని రాజకీయ పార్టీలలో మల్లగుల్లాలు మొదలైనా పార్టీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అన్నది మరో రెండు ,మూడు నెలల్లో తేలనుంది.


మొత్తానికి రజినీ కాంత్ రంగంలోకి దిగకముందే ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తున్నారు . ఎంతైనా తలైవా కదా మరి అని తెగ సంబరపడుతున్నారు రజినీకాంత్ ఫ్యాన్స్ .

English summary
While the announcement of superstar Rajinikanth's party affiliation has been the talk of politics across the country, it has caused a stir in Tamil Nadu political parties. Is Rajinikanth's party affects gaining or losing for thier party? What will happen in Tamil Nadu politics if Rajinikanth enters with the party? All the major political parties are immersed in making such predictions. Will the Rajinikanth party go ahead as a single? Or whether it will move forward with any alliance is also the main debate going on right now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X