వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహాకూటమి కోట కూలుతుందా? మమతను దూరం పెట్టిన కాంగ్రెస్: వామపక్షాలతో పొత్తు

|
Google Oneindia TeluguNews

కోల్ కత: కేంద్రంలో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కట్టిన మహా కూటమి కోట.. కూలుతోందా? కూటమి నాయకుల్లో విభేదాలు తలెత్తాయా? అంటే అవుననే సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీతో సీట్ల సర్దుబాటు వ్యవహారం బెడిసి కొట్టింది. బీజేపీతో కాంగ్రెస్ లోపాయకారి ఒప్పందం పెట్టుకుందంటూ అభాండాన్ని కాంగ్రెస్ నెత్తిన వేశారు కేజ్రీవాల్.

<strong>నౌకా దళం చీఫ్ హెచ్చిరికలు నిజమౌతున్నాయా? : నావల్ స్టేషన్ గగనతలంపై డ్రోన్ చక్కర్లు</strong>నౌకా దళం చీఫ్ హెచ్చిరికలు నిజమౌతున్నాయా? : నావల్ స్టేషన్ గగనతలంపై డ్రోన్ చక్కర్లు

మమతతో పొత్తు వద్దే వద్దంటున్న బెంగాల్ కాంగ్రెస్

మమతతో పొత్తు వద్దే వద్దంటున్న బెంగాల్ కాంగ్రెస్

ఈలోగా- పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ సారధ్యం వహిస్తోన్న తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు వద్దే వద్దంటూ ఆ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి విన్నవిస్తున్నారు. బహిరంగంగా లేఖలు రాస్తున్నారు. రాష్ట్రం వరకు మమతా బెనర్జీ తమ ప్రధాన శతృవు అని, లోక్ సభ ఎన్నికల్లో ఆమెతో పొత్తు వద్దని పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సోమెన్ మిత్ర రాహుల్ గాంధీకి లేఖ రాశారు. మహా కూటమిలో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ కంటే వామపక్షాలతో కలిసి పోరాడాలని ఆయన సూచించారు. 2021 నాటి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించడం ఒక్క వామపక్షాల వల్లే సాధ్యపడుతుందని చెప్పారు. బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ లతో తాము సమదూరాన్ని పాటిస్తున్నామని సోమెన్ మిత్ర స్పష్టం చేశారు. తనకు ఉన్న రాజకీయ అనుభవంతో వేసిన అంచనాలను మాత్రమే తాను రాహుల్ గాంధీకి రాసిన లేఖలో పొందుపరిచానని, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధిష్ఠానం మీదే ఉందని అన్నారు.

ఏపీలోనూ కాంగ్రెస్ తో పొత్తు కష్టమే

ఏపీలోనూ కాంగ్రెస్ తో పొత్తు కష్టమే

మన రాష్ట్రంలోనూ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడాని తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మహాకూటమిలో కొనసాగుతుందని, రాష్ట్రంలో పొత్తు ఉండకపోవచ్చనే సందేశాన్ని తెలుగుదేశం సీనియర్ నాయకులు ఇప్పటికే జనంలోకి పంపించారు. ఈ పరిస్థితుల్లో మహకూటమి పూర్తిస్థాయిలో కొనసాగుతుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

ఒక్క సీటు వద్ద పీటముడి

ఒక్క సీటు వద్ద పీటముడి

మహాకూటమిలో భాగస్వామ్యం పక్షమైన ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు బెడిసి కొట్టింది. ఒకే ఒక్క స్థానంపై పీటముడి పడింది. పొత్తు ముడిపడలేదు. ఢిల్లీ పరిధిలో ఉన్న ఏడు లోక్ సభ స్థానాల్లో తమకు మూడింటిని కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబట్టగా.. రెండే ఇస్తామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ భీష్మించింది. ఫలితంగా- ఈ రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం చర్చల దశ దాటి, ముందుకు రాలేకపోయింది. పైగా- కాంగ్రెస్, బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందంటూ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిస్థితుల్లో మహా కూటమి కూలుతుందా? నిలుస్తుందా? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కాంగ్రెస్ గనక వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ లో మమతా బెనర్జీ చేరడం ఖాయం అవుతుంది.

English summary
The Bengal unit of the Congress has asked party president Rahul Gandhi to consider the “need” to share seats with the CPM for general election so that the BJP’s progress can be checked in the state and Trinamul Congress can be ousted from power in the 2021 Assembly polls. Sources at Bengal Congress headquarters Bidhan Bhavan here said state party chief Somen Mitra had written to Rahul to impress upon him the need to enter into an electoral understanding with the Left Front. The letter was sent in the wake of the CPM central committee on Monday approving an understanding with the Congress not to fight each other in the six seats the two parties currently hold in Bengal. “The letter asserts the need for sharing of seats with the CPM in Bengal to stop the march of the BJP and dethrone the Trinamul Congress in the 2021 Assembly polls,” said a source, adding that a meeting was likely to take place between CPM general-secretary Sitaram Yechury and Rahul this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X