హీరోయిన్ చాలా హాట్, టెక్కీలకు వల, రూ. 1.50 కోట్లు లూటీ, తల్లి, తమ్ముడు, చివరికి !

Posted By:
Subscribe to Oneindia Telugu
అవకాశాల కోసం అంతకు దిగజారింది..ఐదుగురిని ఒప్పుకున్న హీరోయిన్..!

చెన్నై: తమిళ చిత్రరంగంలో రాణించలేక మోసాలకు పాల్పడ్డానని, తల్లి చిత్ర సహాయంతో ఫేస్‌బుక్‌ తో పలువురు టెక్కీలను పరిచయం చేసుకుని మోసగించానని తమిళ నటి శృతి పోలీసుల విచారణలో అంగీకరించింది, ఫేస్‌ బుక్‌లో శృతి తన అందమైన ఫొటోలు పెట్టి పలువురి యువకుల వద్ద ఆమె రూ. కోట్లు లూటీ చేసిందని కోయంబత్తూరు సైబర్ క్రైం పోలీసులు చెప్పారు.

 శృతి తల్లి చిత్ర

శృతి తల్లి చిత్ర

నటి శృతి ఆమె తల్లి చిత్ర (47) సోదరుడు సుభాష్ (18), స్నేహితుడు శబరినాథ్ (23), నటికి తండ్రిగా నటించిన బంధువు వెంకటేష్ (38) సహాయంతో ఇప్పటి వరకూ ఎనిమిది మంది శ్రీమంతులైన యువకుల దగ్గర తన అంధంతో వల వేసి రూ. 1. 50 కోట్లు లూటీ చేసి జల్సా చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

జర్మనీ ఎన్ఆర్ఐ

జర్మనీ ఎన్ఆర్ఐ

సేలం జిల్లా ఎడప్పాడికి చెందిన బాలక్రిష్ణన్ అనే యువకుడు జర్మనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆన్ లైన్ సంబంధాలు వెతుకుతుంటే కోయంబత్తూరుకు చెందిన నటి శృతి ఎన్ఆర్ఐ బాలక్రిష్ణన్ కు పరిచయం అయ్యింది

అమ్మకు అనారోగ్యం

అమ్మకు అనారోగ్యం

ఫేస్ బుక్ లో అందమైన ఫోటోలు పెట్టిన నటి శృతి ఇంగ్లీష్ లో మాట్లాడుతూ బాలక్రిష్ణన్ ను వలలో వేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించింది. తన తల్లి చిత్రకు అనారోగ్యంగా ఉందని వెంటనే చికిత్స చేయించాలని నమ్మించి శృతి తన బ్యాంకు అకౌంట్ లో రూ. 5 లక్షలు జమ చేయించుకుంది.

 సెకండ్ టార్గెట్ ఇల్లు

సెకండ్ టార్గెట్ ఇల్లు

తన ఇంటి మీద బ్యాంకులో రుణం ఉందని, ఆ రుణం మొత్తం తీర్చిన తరువాత పెళ్లి చేసుకుందామని శృతి బాలక్రిష్ణన్ ను నమ్మించింది. తరువాత శృతి తన బ్యాంకు అకౌంట్ లో ఏకంగా రూ. 36 లక్షలు డిపాజిట్ చేయించుకుంది.

 స్నేహితుడికి ఫోటో

స్నేహితుడికి ఫోటో

చెన్నైలోని ఓ స్నేహితుడికి శృతి ఫోటోలు పంపించిన బాలక్రిష్ణన్ ఈమెను త్వరలో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. శృతి ఫోటో చూసిన అతను ఈమె పెద్ద మోసగత్తె, అనేక మంది యువకులను మోసం చేసిందని సమాచారం ఇచ్చాడు.

విదేశాల నుంచి వచ్చి

విదేశాల నుంచి వచ్చి

విషయం తెలుసుకున్న బాలక్రిష్ణన్ ఫోన్ చేసి శృతిని నిలదీశాడు. ఆ సందర్బంలో నీకు దిక్కున్నచోట చెప్పుకో అంటూ శృతి ఫోన్ స్విచ్ఆఫ్ చేసింది. జర్మనీ నుంచి కోయంబత్తూరు చేరుకున్న బాలక్రిష్ణన్ మోసం జరిగిందని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో అందర్నీ అరెస్టు చేసి జైలుకు పంపించారు.

సినీమా హీరోయిన్

సినీమా హీరోయిన్

శృతి ఆడి పోనాల్‌ ఆవణి అనే తమిళ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.అయితే ఆడి పోనాల్ ఆవణి చిత్రం ఇంకా విడుదల కాలేదు. చిత్ర పరిశ్రమలో రాణించలేకపోవడంతో నిరాశ చెందిన శృతి తన తల్లి చిత్ర సహకారంతో ధనవంతులైన యువకులను లోంగదీసుకుని కోట్లాది రూపాయలు మోసగించి విలాసవంతమైన జీవితం గడిపిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

జల్సాలు

జల్సాలు

తమిళ నటి శృతి, ఆమె తల్లి చిత్ర సహకారంతో ఎనిమిది మంది యువకులను ప్రేమ వలతో మోసగించిందని, వారిద్దరూ ఈ విధంగానే చాలా మంది యువకులను మోసగించి ఉంటారనిని తమిళనాడు పోలీసులు భావిస్తున్నారు. శృతిని కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యాలని నిర్ణయించిన పోలీసులు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

శృతి టార్టెట్ టెక్కీలు

శృతి టార్టెట్ టెక్కీలు

శృతి తమిళనాడులోని నామక్కల్ కు చెందిన టెక్కీ సంతోష్ కుమార్ దగ్గర రూ. 43 లక్షలు, చిదంబరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు అరుళ్ కుమార్ దగ్గర రూ. 50 లక్షలు లూటీ చేసిందని కోయంబత్తూరు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a shocking incident, the 'Aadi Pona Aavani' star Shruthi P along with her family members duped a German-based man for Rs 41 lakh. G Balamurugan, a software engineer was conned by Shruthi, along with her mother, brother and a man posing as her father.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి