చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళ హస్యనటుడు వివేక్ కన్నుమూత: షాక్‌లో కోలీవుడ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రఖ్యాత తమిళ హాస్య నటుడు వివేక్ కన్నుమూశారు. ఈ తెల్లవారు జామున చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 59 సంవత్సరాలు. గుండెనొప్పి రావడంతో శుక్రవారం ఆయన చెన్నై వడపళనిలోని సిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఆయన పరిస్థితి విషమించడంతో ఎక్మో సపోర్ట్ అందించారు. అత్యాధునిక చికిత్సను అందించినప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది ఈ తెల్లవారు జామున 4:35 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన వివేక్‌కు డాక్టర్లు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళం పూర్తిగా మూసుకుపోవడంతో స్టెంట్ వేశారు. స్టెంట్ వేసిన తరువాత కూడా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఎక్మో సపోర్ట్ అందించారు. స్పృహ తప్పిన స్థితిలో ఉన్న వివేక్‌ను ఆయన భార్య, కుమార్తె సిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సిమ్స్ ఆసుపత్రి వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజు శివస్వామి సారథ్యంలోని వైద్యుల బృందం ఆయనకు అత్యవసర చికిత్సను అందించింది.

Tamil film actor Vivek passed away in a Chennai hospital in the early hours of Saturday

కొరొనరీ సిండ్రోమ్‌తో కూడిన కార్డియోజెనిక్ షాక్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఆసుపత్రిలో చేరడానికి ఒక్కరోజు ముందే వివేక్.. కరోనా వైరస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. గురువారం ఆయన కోవిడ్ టీకా వేసుకున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి వివేక్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆయనకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ మరుసటి రోజే ఆయన ఆరోగ్యం క్షీణించడం పట్ల అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

వాటన్నింటినీ డాక్టర్ రాజు శివస్వామి తోసిపుచ్చారు. కార్డియోజెనిక్ షాక్‌ వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని స్పష్టం చేశారు. దీనికి కరోనా వ్యాక్సిన్ కాదని స్పష్టం చేశారు. ట్యుటికోరిన్ జిల్లా కోవిల్‌పట్టిలో జన్మించిన వివేక్.. తొలుత కే బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్, స్క్రిప్ రైటర్‌గా చేరారు. ఆ తరువాత నటుడిగా స్థిరపడ్డారు. 1987లో మనథిల్ ఉరుధి వేండమ్ ఆయన నటించిన తొలి సినిమా. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి వివేక్ సుపరిచితుడు.

English summary
Tamil film actor Vivek died in a Chennai hospital in the early hours of Saturday. He was 59.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X