చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇప్పుడు ఐపీఎల్ అవసరమా?:ధోనీ టీంకు రజనీకాంత్ సూచన, మోడీకి వార్నింగ్, కావేరీపై హీరోల దీక్ష

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఓ వైపు రాష్ట్రంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతుంటే, రైతుల కోసం పోరాడే సమయంలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) జరగడం ఇబ్బందికరమని నటుడు రజనీకాంత్ అన్నారు. కావేరీ నదీ జలాల కోసం నిరసన తెలియజేస్తున్న సమయంలో ఐపీఎల్ పోటీలు ఏమిటన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ పోటీలు తనకు ఇబ్బందిని, చిరాకును తెప్పిస్తున్నాయన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు, అభిమానులు కావేరీ నీటి కోసం, ప్రజల ఆందోళనకు మద్దతుగా నల్ల బ్యాడ్జిలు ధరించి మ్యాచులు ఆడాలని విజ్ఞప్తి చేశారు.

Tamil Film Stars Join Cauvery Protests, Rajinikanth Asks CSK to Sport Black Bands

కావేరీ బోర్డు ఏర్పాటు చేయకుంటే తమిళ ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని రజనీకాంత్ అన్నారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు.

మరోవైపు, ఏప్రిల్ 11న కావేరీ జలాల కోసం పీఎంకే బందుకు పిలుపునిచ్చింది. దీనికి డీఎంకే మద్దతు తెలిపింది.

కావేరీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడులో ఆయా పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. వారికి మద్దతుగా సినిమా పరిశ్రమ కూడా ముందుకు వచ్చింది. నటులు విజయ్, సూర్య, విశాల్, నాజర్, సత్యరాజ్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్‌లు ఈ దీక్షకు మద్దతు పలికారు.

English summary
Top names from Tamil Nadu’s film fraternity joined the ongoing Cauvery protests on Sunday and urged the BJP-led Centre to set up the Cauvery Management Board (CMB).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X