చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీరెల పంపిణీలో భారీగా తొక్కిసలాట- నలుగురు దుర్మరణం: పలువురికి గాయాలు..!!

తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. థైపుసం 2023 సందర్భంగా పేదలకు పంచెలు, చీరెలను పంపిణీ చేసే కార్యక్రమంలో సంభవించిన తొక్కిసలాటలో నలుగురు మహిళలు మరణించారు. పలువురు గాయపడ్డారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. చీరెలు, పంచెల పంపిణీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందనే అంచనాలు ఉన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక కార్యక్రమాలను చేపట్టారు.

ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందజేయాలని సూచించారు. గాయపడిన వారికి నాణ్యమైన వైద్య సహాయాన్ని అందించాలని అన్నారు.

Tamil Nadu: 4 women died in stampede at Tiruppatturs Vaniyambadi on the occasion of Thaipusam

తిరుపత్తూర్ జిల్లాలోని వనియంబాడిలో ఈ తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. తమిళ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే థైపూసం వేడుకలను దృష్టిలో ఉంచుకుని స్థానికులు కొందరు పేద మహిళలకు చీరెలు, పంచెలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. వాటిని పంపిణీ చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి ముందుగా టోకెన్లను జారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

టోకెన్లను తీసుకోవడానికి పెద్ద ఎత్తున స్థానికులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా బ్యారికేడ్లను అమర్చారు. అయినప్పటికీ- అంచనాలకు మించిన స్థాయిలో స్థానికులు పెద్ద ఎత్తున టోకెన్లను తీసుకోవడానికి వచ్చారు. దీనితో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు సంఘటన స్థలంలోనే మరణించారు. పలువురు గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

తమిళ ప్రజలు పుష్యమాసాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. సుబ్రహ్మణ్యేశ్వరుడిని కొలుస్తారు. ఈ మాసంలో పౌర్ణమి నాడు థైపుసం పేరుతో వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పళనిలో కొలువుదీరిన సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు. అలాంటి పవిత్ర దినం నాడు పేదలకు వస్త్రాలను పంచిపెట్టడం వల్ల శుభం కలుగుతుందని విశ్వసిస్తారు.

వైసీపీ నెల్లూరు కోటకు బీటలు: మరో బిగ్ వికెట్ అవుట్: కోటంరెడ్డికి ఫుల్ సపోర్ట్..!!వైసీపీ నెల్లూరు కోటకు బీటలు: మరో బిగ్ వికెట్ అవుట్: కోటంరెడ్డికి ఫుల్ సపోర్ట్..!!

English summary
Four women died in stampede where several people gathered to collect tokens of 'Veshtis' and sarees being distributed on the occasion of Thaipusam in Tiruppattur's Vaniyambadi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X