వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6 సవర్ల బంగారం తాకట్టు రుణం మాఫీ, షెడ్యూల్‌కు ముందు పళనిస్వామి ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఐదు రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. పోలింగ్ తేదీలు ప్రకటించే కొద్దీసేపు ముందు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రకటించాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. బంగారం లోన్ బకాయి రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాల్లో ఆరు సవర్ల బంగారాన్ని తాకట్టుపెట్టిన వారికి రుణాన్ని రద్దు చేస్తూ సీఎం పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు.

కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదలు తిరిగి తమ బంగారాన్ని పొందడానికి వీలు కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. కో ఆపరేటివ్ బ్యాంకులలో ఉన్న బంగారంపై గల వడ్డీ తగ్గించడంతో నిరుపేదలతోపాటు రైతులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

Tamil Nadu Announce Welfare Schemes Before EC Declares Poll Dates

మహిళల స్వయం సహాయక సంఘాల్లో ఉన్న రుణాలను తిరిగి చెల్లించే పరిస్థితి లేదన్నారు. అందుకోసమే రుణం మాఫీ చేస్తున్నామని పళనిస్వామి పేర్కొన్నారు. తమిళనాడులో స్వయం సహాయక గ్రూపులు లక్ష వరకు ఉండగా.. 15 లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారేనని గణాంకాలు చెబుతున్నాయి. పేదలపై వరం ప్రకటించి ఓట్లుగా మళ్లించాలని పళని అంచనా వేశారు.. మరీ ఇదీ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలీ.

English summary
Tamilnadu government said gold loans against up to six sovereigns by cooperative banks to farmers and poor will be waived.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X