చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నికలు, ఫ్యాన్స్‌కు స్వేచ్ఛ: రజనీకాంత్ దారి ఎటు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: మరో వారం రోజుల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తమిళనాట అన్ని పార్టీలు సూపర్ స్టార్ రజనీకాంత్ మద్దతు కోసం పడిగాపులు కాస్తుంటాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ ఆయన కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే.

తమిళనాట ఆయనకు అశేష అభిమానులు ఉన్నారు. ఆయన మద్దతు కోసం పార్టీలు కూడా అర్రులు చాస్తుంటాయి. కానీ ఆయన ఎప్పుడు కూడా రాజకీయాలకు దూరం పాటిస్తుంటారు. అయితే, అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంటాయి.

ఆయన చేసిన వ్యాఖ్యలు.. పార్టీలను ఓడించిన, గెలిపించిన సందర్భాలు ఉన్నాయి! సాధారణంగా తమిళనాడులో సినీ తారల కోసం పార్టీలు వెంటపడుతుంటాయి. వారితో ప్రచారం చేయిస్తుంటాయి. తారల ప్రచారం పక్కన పెడితే.. రజనీకాంత్ మాట మద్దతు కోసమే పార్టీలు ఎగపడతాయి. కానీ ఆయన ఎప్పుడు రాజకీయాలకు దూరమే.

Tamil Nadu Assembly Elections: Did DMK use Rajinikanth's Kabali teaser to target AIADMK

1996 ఎన్నికల సమయంలో.. తమిళనాడును ఆ దేవుడు కూడా కాపాడలేడని డీఎంకే, తమిళమానిల కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రజనీకాంత్ వ్యాఖ్యలు చేశారు. అవి ప్రజలను ప్రభావితం చేశాయి. ఆయన వ్యాఖ్యలతో అన్నాడీఎంకే ఘోర పరాజయం పాలైంది.

ఆ తర్వాత ఎన్నికల సమయంలో ఆయన అలాంటి పదునైన వ్యాఖ్యలు చేయలేదు. 2001, 2006, 2011లలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రజనీకాంత్‌ను ప్రసన్నం చేసుకునేందుకు అనేక పార్టీలు ప్రయత్నాలు చేశాయి. రజనీకాంత్‌ది మాత్రం మౌనమే సమాధానం.

ఆ తర్వాత ఆయన అన్ని పార్టీలకు సమదూరం పాటించారు. అభిమానులు, ప్రజలు రాజకీయాల్లోకి రావాలని ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తుంటారు. రాజకీయాల్లోకి రావాలనే విజ్ఞప్తిని ఆయన ఎప్పుడూ పట్టించుకోరు. రాజకీయాలకు దూరంగానే ఉంటారు.

2014 లోకసభ ఎన్నికల సమయంలో స్వయంగా నేటి ప్రధాని, నాటి ప్రధాని అభ్యర్థి మోడీ.. రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. కానీ రజనీకాంత్ నోటీ నుంచి మాత్రం రాజకీయపరంగా ఒక్క మాట రాలేదు.

Tamil Nadu Assembly Elections: Did DMK use Rajinikanth's Kabali teaser to target AIADMK

మరో వారం రోజుల్లో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లోను ఎప్పటిలాగే రజనీకాంత్ కోసం అర్రులు చాచే పార్టీలు ఉన్నాయి. కానీ ఆయన మాత్రం పూర్తిగా దూరంగా ఉన్నారు. రజనీకాంత్ రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. అలాగే అభిమానులు కూడా దూరం పాటిస్తున్నారట.

అంతెందుకు, ఆయన ఏ పార్టీకి ఓటు వేస్తారనేది కూడా చర్చనీయాంశమైన అంశమే. ఆయన ఓ పార్టీకి ఓటు వేశారని ప్రచారం జరిగితే.. అది ఆ పార్టీకి ప్లస్ అవుతుందని కూడా ఆంటారు.

ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో రజనీకాంత్ దారి ఎటు అని ఓ అభిమాన సంఘం నేత ఒకరిని ప్రశ్నించగా... తమ ఓటు వినియోగంపై ఆయన ఎలాంటి నిబంధన విధించలేదని, ఇష్టపడిన పార్టీకి ఓటు వేసే స్వేచ్ఛ ఇచ్చారని, తమ అభిమాన నేత రజనీకాంత్ మాత్రమే కాదని, చాలామంది నటీనటులు మౌనం పాటిస్తున్నారన్నాడు.

కాగా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా సినిమా 'కబాలి' టీజర్ రాజకీయ దూమారానికి కారణమైన విషయం తెలిసిందే. మే 16న తమిళనాడులో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో 'కబాలి' టీజర్ పెను రాజకీయ దుమారాన్ని రేపింది.

'నేను రా కబాలి' అంటూ రజనీ విశ్వరూపం చూపిన ఈ సినిమా టీజర్‌కు స్పూఫ్‌గా వెలువడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రజనీ 'కబాలి' సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌ను మార్చి అన్నాడీఎంకేను, ఆ పార్టీ అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలితను టార్గెట్‌ చేస్తూ రూపొందించిన వీడియో ఇంటర్నెట్‌లో దుమారాన్ని రేపుతోంది.

ఈ వీడియోలో రజనీ వాయిస్‌ను మార్చి నేరుగా జయలలితను టార్గెట్ చేశారు. ఇటీవలే చెన్నైలో సంభవించిన వరద విపత్తును ఎదుర్కోవడంలో జయలలిత ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందంటూ సాగే ఈ టీజర్‌ ఇప్పుడు తమిళనాడులో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

ఈ టీజర్‌లో విలన్ అన్నాడీఎంకేగా, రజనీని డీఎంకే మద్దతుదారుడిగా చూపిస్తూ విలన్‌ 'డీఎంకే ఎవరు' అని అడిగినట్టు ఉంది. ఈ టీజర్‌‌కు రాజకీయ రంగు పులుముకోవడంతో దీనిని ఇంటర్నెట్‌ నుంచి దీనిని తొలగించారు.

English summary
After creating a huge buzz on internet and movie circles, Rajinikanth's 'Kabali' teaser is making news in political corridors too!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X