వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నువ్వా నేనా: తమిళనాడు సీఎం రేసుగుర్రాలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో జరుగుతున్న శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పలు పార్టీల చీఫ్ లు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వివిధ పార్టీల ముఖ్యమంత్రుల అభ్యర్థులు నానా తంటాలు పడి పోటీ చెయ్యడానికి నియోజక వర్గాలు సిద్దం చేసుకున్నారు.

తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత (అమ్మ)చెన్నై నగరంలోని ఆర్కే నగర్ లో, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తిరువూరూర్ లో, మాజీ ప్రతిపక్ష నాయకుడు కెప్టెన్ విజయ్ కాంత్ ఉలందూర్ పేటలో, అన్బుమణి రామ్ దాస్ పెన్నా నగరంలో పోటీ చెయ్యడానికి సర్వం సిద్దం చేసుకున్నారు.

ఇప్పటికే వారు ఆ నియోజక వర్గాల్లో ప్రచారం ముమ్మరం చేశారు. సీపీఎం, సీపీఐ జాబితాలు, వీసీకే 11 మందితో తొలి జాబితా విడుదల చేశారు. ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారు. అయితే ఓటర్లు ఎవరిని సింహాసనం ఎక్కి స్తారు అని మే 19వ తేది వరకు వేచి చూడాలి.

అమ్మ రెండో సారి

అమ్మ రెండో సారి

అక్రమాస్తుల కేసులో కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన తరువాత జయలలిత తన ముఖ్యమంత్రి పదవితో పాటు శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు.

క్లీన్ చిట్

క్లీన్ చిట్

కర్ణాటక హై కోర్టు జయలలితకు క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత ఆమె చెన్నై నగరంలోని ఆర్కే నగరలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు.

నాలుగు కూటములు

నాలుగు కూటములు

ముఖ్యమంత్రి కుర్చి కైవసం చేసుకోవడానికి తమిళనాడులో నాలుగు కూటముల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో తమిళనాడులో ఎన్నికల వాతవరణం వేడెక్కింది.

ఓటమి ఎరుగని యోధుడు

ఓటమి ఎరుగని యోధుడు

అలుపెరగని బాటసారి, ఓటమి ఎరుగని యోధుడు కరుణా నిధి మళ్లీ పోటీ చేస్తున్నారు. ఆయన చివరిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పి రంగంలోకి దిగారు. కరుణ భారీ మెజారిటీతో గెలుస్తారని డీఎంకే వర్గాలు అంటున్నాయి

డీఎంకే, అన్నా ఢీఎంకే ఢీఅంటే ఢీ

డీఎంకే, అన్నా ఢీఎంకే ఢీఅంటే ఢీ

తమిళనాడులో ప్రధానంగా అన్నా డీఎంకే, డీఎంకే కూటముల మధ్య పోటీ జరుగుతున్నది. అయితే ఈ ఎన్నికల్లో తామే ప్రత్యామ్నాయమే అంటున్నాయి డీఎండీకే, ప్రజా సక్షేమ కూటమి, పీఎంకే కూటమి, బీజేపీ కూటములు.

ఆరో సారి సీఎంగా

ఆరో సారి సీఎంగా

ఆరో సారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టడానికి కరుణా నిధి సిద్దం అవుతున్నారు. విజయం మాదే అని డీఎంకే వర్గాలు ఇప్పటి నుంచే పండుగ చేసుకుంటున్నారు

క్లీన్ స్విప్ నినాదం

క్లీన్ స్విప్ నినాదం

శాసన సభ ఎన్నికల్లో క్లీన్ స్విప్ నినాదంతో ముందుకు వెలుతున్న కుమారి జయలలిత ఆర్కే నగర్ లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

పాపం కెప్టెన్

పాపం కెప్టెన్

కెప్టెన్ విజయ్ కాంత్ మళ్లీ సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తారని చాల మంది భావించారు. అయితే ఆయన అనూహ్యంగా నియోజక వర్గాన్ని మార్చి ఎన్నికల బరిలో దిగారు.

మొదటి సారి బరిలోకి

మొదటి సారి బరిలోకి

2014లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించిన అన్భుమణి రామదాస్ మొదటి సారిగా శాసన సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ కట్టబెట్టిన ధర్మపురి జిల్లా లోని పెన్నానగరం శాసన సభ నియోజక వర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.

ఆ నియోజక వర్గాలపై చర్చ

ఆ నియోజక వర్గాలపై చర్చ

తమిళనాడులో నాలుగు శాసన సభ నియోజక వర్గాల గురించి ప్రజలు చర్చించుకుంటున్నారు. జయలలిత, కరుణానిధి, కెప్టెన్ విజయ్ కాంత్, అన్భుమణి రామదాస్ పోటీ చేస్తున్న నియోజక వర్గాలలో బెట్టింగులు జోరుగా ఉన్నాయి

English summary
Communist Party of India leader A. Mohan, who is contesting the polls from Veerapandi in Salem district, hails from a traditional Communist family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X