వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు భారీ బడ్జెట్, రాష్ట్ర చరిత్రలోనే లేదు, పన్నీర్ సెల్వం, జీఎస్టీ, డీఎంకే వాకౌట్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, ఆర్థి శాఖ మంత్రి పన్నీర్ సెల్వం గురువారం చెన్నైలోని ఆ రాష్ట్ర సచివాలయంలో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎవ్వరూ ఊహించని విధంగా, గతంలో తమిళనాడు చరిత్రలో ఎవ్వరూ ప్రవేశపెట్టని భారీ బడ్జెట్ ప్రవేశపెట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశారు. అమ్మ జయలలిత పాలన తమిళ ప్రజలకు అందిచడం తమ లక్షమని పన్నీర్ సెల్వం ప్రకటించారు.

భారీ బడ్జెట్

భారీ బడ్జెట్

2018-19 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు ప్రభుత్వం రూ. 3,55, 845 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పన్నీర్ సెల్వం గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా అన్నాడీఎంకే శాసన సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

జీఎస్టీ ఆదాయం

జీఎస్టీ ఆదాయం

జీఎస్టీ కారణంగా తమిళనాడు ప్రభుత్వానికి 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 632 కోట్ల ఆదాయం వచ్చిందని పన్నీర్ సెల్వం వివరించారు. జీఎస్టీ కారణంగా ప్రభుత్వానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయం వస్తుందని పన్నీర్ సెల్వం ఆశాభావం వ్యక్తం చేశారు.

 ఉత్తర, దక్షిణ చెన్నై

ఉత్తర, దక్షిణ చెన్నై

ఉత్తర చెన్నై, దక్షిణ చెన్నైలో వరదలు నివారించడానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేశామని పన్నీర్ సెల్వం అన్నారు. చెన్నైలో వరదలు నివారించడానికి, అభివృద్ది పనుల కోసం రూ. 2,055 కోట్లు కేటాయించామని పన్నీర్ సెల్వం వివరించారు.

బహిష్కరించిన డీఎంకే

బహిష్కరించిన డీఎంకే

గురువారం ఉదయం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సిద్దం అయిన వెంటనే డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్, తమిళనాడు శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయిన ఎంకే. స్టాలిన్ తో పాటు ఆ పార్టీ శాసన సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు.

కేంద్ర ప్రభుత్వంపై ఫైర్

కేంద్ర ప్రభుత్వంపై ఫైర్

శాసన సభ సమావేశాలను బహిష్కరించి బయటకు వచ్చిన ఎంకే. స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం చేస్తోందని, తమిళనాడు రైతులకు అన్యాయం జరుగుతుందని చెబుతున్న మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే శాసన సభ సమావేశాలు బహిష్కరిస్తున్నామని ఎంకే. స్టాలిన్ అన్నారు. డీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నల్ల షర్టులు వేసుకుని శాసన సభ సమావేశాలకు హాజరై కేంద్ర, తమిళనాడు ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

English summary
Tamil Nadu Government produces Budget for the current finance year. It says that, debt will be Rs. 3,55,845 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X