బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేకేదాటు తాగునీటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్: మళ్లీ కన్నడ-తమిళ తంబీల లొల్లి, తెరపైకి కావేరి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బెంగళూరు నగర శివార్లలో నిర్మించే మేకేదాటు తాగునీటి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వరాదని, అనుమతి ఇస్తే తమకు తీరని అన్యాయం జరుగుతోందని తమిళనాడు ప్రభుత్వం అంటోంది. బెంగళూరు నగర శివార్లలోని కనకపుర తాలుకాలో మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి పరిస్థితిలో అనుమతి ఇవ్వకూడదని ప్రధాని నరేంద్ర మోడీకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి లేఖ రాశారు. మేకేదాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం మరోసారి తెరమీదకు వచ్చింది.

మేకేదాటుకు గ్రీన్ సిగ్నల్

మేకేదాటుకు గ్రీన్ సిగ్నల్

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఎంతో కాలంగా వివాదంగా మారిన మేకేదాటు తాగునాటి ప్రాజెక్టు నిర్మాణానికి మంగళవారం కేంద్ర నీటిపారుదాల శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ప్రజలకు తాగునీటి కష్టాలు తీరుతాయని చాల సంవత్సరాల నుంచి కర్ణాటక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తూవస్తోంది. కర్ణాటక మనవిని పరిశీలించిన కేంద్ర నీటి పారుదల శాఖ అధికారులు మంగళవారం మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. సంపూర్ణ ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్దం చేసుకుని రావాలని కర్ణాటక ప్రభుత్వానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

తమిళనాడుకు లేఖ

తమిళనాడుకు లేఖ

బెంగళూరు నగర శివార్లలోని కనకపుర తాలుకాలో మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి తాము అనుమతి ఇస్తున్నామని కేంద్ర నీటిపారుదల శాఖ అధికారులు కర్ణాటక ప్రభుత్వానికి అధికారికంగా లేఖ ఇచ్చారు. కర్ణాటకతో పాటు తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర నీటిపారుదల శాఖ అధికారులు ఇదే సందర్బంలో సమాచారం ఇచ్చారు.

కావేరీ అంతిమతీర్పు

కావేరీ అంతిమతీర్పు

కావేరీ నీటి పంపిణి విషయంలో అంతిమతీర్పు రాకుండానే మేకేదాటు తాగునీటి ప్రాజెక్టుకు ఎలా అనుమతి ఇస్తారని తమిళనాడు ప్రభుత్వ ప్రశ్నించింది. మేకేదాటు తాగునీటి ప్రాజెక్టుకు అనుమతి ఇస్తే కావేరీ నీటి పంపిణి విషయంలో అనేక కొత్త సమస్యలు ఎదురౌతాయని తమిళనాడు ప్రభుత్వం ఆరోపిస్తోంది.

 జయలలిత వ్యతిరేకం

జయలలిత వ్యతిరేకం


మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి నుంచి తమిళనాడు అభ్యంతంరం వ్యక్తం చేస్తున్నది. మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తే తమిళనాడుకు రావలసిన కావేరీ నీరు సక్రమంగా రాదని వారు ఆరోపిస్తున్నారు. జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి అనేకసార్టు లేఖలు రాశారని ఆ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అంటున్నారు.

మేకేదాటు ప్రాజెక్టు ఎందుకు ?

మేకేదాటు ప్రాజెక్టు ఎందుకు ?

కావేరీ నీటి పంపిణి వివాదం అంతిమతీర్పు ప్రకారం ప్రతి సంవత్సరం కర్ణాటక నుంచి తమిళనాడుకు 177 టీఎంసీ నీటిని విడుదల చెయ్యాలి. కర్ణాటకలో భారీ వర్షాలు పడితే ప్రతి సంవత్సరం తమిళనాడుకు 80 నుంచి 90 టీఎంసీల నీరు అధినంగా విడుదల అవుతోంది. మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మించి తమిళనాడుకు అధికంగా వెలుతున్న నీటిని సంగ్రహించి శుద్దిచేసి తాగునీటిని సరఫరా చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని కేంద్రం దగ్గర వాదిస్తోంది.

కన్నడ సంఘాలు

కన్నడ సంఘాలు

ఇంతకాలం వివాదంలో ఉన్న మేకేదాటు తాగునీటి ప్రాజెక్టుకు ఇప్పటికి కేంద్రం అనుమతి ఇచ్చినా తమిళనాడు ప్రభుత్వం మళ్లీ అడ్డుకుంటే తమ సత్తాచూపిస్తామని కొన్ని కన్నడ సంఘాలు అంటున్నాయి. బెంగళూరు నగర శివార్లలో మేకేదాటు తాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని అనేక సంవత్సరాలుగా కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మేకేదాటు తాటు నీటి ప్రాజెక్టు నిర్మాణానికి కన్నడ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాయి.

English summary
In a letter to Prime Minister Narendra Modi Tamil Nadu CM Edappadi Palaniswamy opposed for the Mekedatu drinking water project. Central Water Commission approved for project and directed Karnataka Government to submit Detailed Project Reports (DPR).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X