CM: ఆర్ టీసీ బస్సులో సీఎం, సామాన్య ప్రజలకు వరాల జల్లు, సీఎం అయినా సామాన్యుడే !
చెన్నై/టీ నగర్: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తండ్రి ఎం. కరుణానిధి లాగా చాలా సింపుల్ గా ఉండే ఎంకే. స్టాలిన్ ఏం చేసినా ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. నేను సీఎం అంటూ ఏ రోజు స్టాలిన్ హంగామా చెయ్యలేదు. ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ అయితే సామాన్య మహిళగా ఉండాలని ఆశపడతారు. ఇటీవల తిరుమల వెళ్లిన దుర్గా స్టాలిన్ చాలా సింపుల్ గా సామాన్య మహిళలాగా ఏడుకొండలస్వామిని దర్శించుకుని ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తిరుమలగిరుల్లో సామాన్య భక్తురాలిగా సంచరించారు. ఇప్పుడు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో ఏకంగా ఆర్టీసీ బస్సులో సంచరించి ప్రయాణికుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సీఎం స్టాలిన్ తమిళనాడు ప్రజలకు వరాల జల్లు కురిపించారు.
Aunty: భర్తకు విడాకులు, ఇంట్లోనే ప్రియుడిని సెట్ చేసుకున్న కూతురు, ఆంటీని చంపిన కూతురి లవర్ !

సీఎంగా ఏడాది పూర్తి చేసుకున్న స్టాలిన్
తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి ఏడాది పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ శనివారం చెన్నైలోని తమిళనాడు ఆర్ టీసీ విభాగానికి చెందిన ఎంటీసీ రాధాకృష్ణన్ పలై రూట్ నెంబర్ 29c బస్సులో సామాన్య ప్రయాణికుడిలా సంచరించారు.

ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ?
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెన్నైలో ఆర్టీసీ బస్సులో సంచరించి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్ టీసీ బస్సుల్లో సంచరించే సమయంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురౌతున్నాయా. కండెక్టర్ మీరు సహకరిస్తున్నారా ? అంటూ సీఎం ఎంకే స్టాలిన్ ప్రయాణికులను ప్రశ్నించి వారి నుంచి వివరాలు సేకరించారు. మహిళా ప్రయాణికులను పలకరించిన స్టాలిన్ వారికి బస్సులో ఏమైనా ఇబ్బందులు ఎదురౌతున్నాయా ? అని ఆరా తీశారు.

తండ్రికి నివాళులు అర్పించిన సీఎం
ఆర్ టీసీ బస్సులో మెరినా బీచ్ వరకు ప్రయాణించిన ఎంకే. స్టాలిన్ అక్కడ ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి ఎం. కరుణానిధి, డీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు సీఎన్. అణ్ణాదురై సమాధుల దగ్గర ఎంకే. స్టాలిన్ నివాళులు అర్పించారు. తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయిన సందర్బంగా ఎంకే. స్టాలిన్ విద్యార్థులకు, సామాన్య ప్రజలకు కోసం ఐదు వరాలు కురిపించారు.