వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్: మలద్వారంలో మందు బాటిల్.. నెవర్ బిఫోర్ అంటున్న డాక్టర్లు.. తమిళనాడులో సీన్ ఇది..

|
Google Oneindia TeluguNews

ఇప్పటిదాకా మందుబాబులకు సంబంధించిన విచిత్ర కథనాలెన్నో చదివాం. ఇది మాత్రం నెవర్ బిఫోర్ అని డాక్టర్లే అంటున్నారు. ''నా సుదీర్ఘ కెరీర్ లో ఇలాంటి వింత కేసును ఎప్పుడూ చూచలేదు''అని వాపోయారు నాగపట్నం ప్రభుత్వాసుపత్రి జనరల్ సర్జన్ డాక్టర్ పాండియరాజ్. రెండ్రోజుల కిందట ఆయన డీల్ చేసిన కేసు తాలూకు ఫొటోలు, వార్తలు వైరల్ అయ్యాయి. ఓ వ్యక్తి మలద్వారంలో చిక్కుకుపోయిన మద్యం బాటిట్ ను సర్జరీ ద్వారా తొలగించారాయన. గోప్యత దృష్ట్యా బాధితుడి పేరు వెల్లడించకుండా అసలేం జరిగిందో డాక్టర్ పాండియరాజ్ చెప్పారిలా..

Recommended Video

A Drunk Man Inserts Glass Bottle Into Body Through Anus
నాగూరు యువకుడు..

నాగూరు యువకుడు..

నాగపట్నం జిల్లాలోని నాగూరు చెందిన 29 ఏళ్ల యువకుడు.. రెండ్రోజుల కిందట జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. మలద్వారంలో భరించలేని నొప్పి ఉన్నట్లు చెప్పడంతో ముందుగా ఎక్స్ రే తీయించారు. ఆ రిపోర్టుల్లో.. ‘మ్యాన్షన్‌ హౌస్‌' బ్రాండ్‌ను పోలిన క్వార్టర్ బాటిల్ అతని లోపల చిక్కుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అయితే, అతనికి ఆపరేషన్ చేయాలంటే.. ముందుగా కరోనా టెస్టులు చేయాలనే నిబంధన ఉంది. కరోనా రిజల్ట్ వచ్చేలోపు.. లోపలున్న గాజు సీసా పగిలిపోతే అతని ప్రాణాలకు ప్రమాదం ఏర్పడొచ్చని భావించిన డాక్టర్లు.. హుటాహుటిన సర్జరీ చేశారు..

అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

సుమారు రెండున్నర గంటలపాటు శ్రమించిన డాక్టర్లు.. చివరికి ఆ వ్యక్తి మలద్వారంలో చిక్కుకున్న మద్యం బాటిల్ ను బయటికి తీశారు. సున్నితమైన భాగాలు కొద్దిగా దెబ్బతినడంతో మరో నాలుగైదురోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సిందిగా సూచించారు. అసలీ ఘటనకు కారణం మద్యమేనని డాక్టర్ పాండియరాజ్ చెప్పారు. ‘‘మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో తాను తాగిన బాటిల్ ను మలద్వారంలోకి గుచ్చుకున్నాడు. సగం దూరిన తర్వాత వెనక్కి లాగడానికి ప్రయత్నించగా అది రాలేదు. దీంతో మొత్తం బాటిల్ ను బలవంతంగా లోపలికి నెట్టుకున్నాడు. మత్తు దిగిన తర్వాత నొప్పి ఉన్నప్పటికీ, ఈ సంగతి ఎవరికనా చెబితే పరువు పోతుందని భావించి, రెండు రోజులు అలాగే ఉండిపోయాడు. చివరికి నొప్పి తాళలేని స్థితిలో ఆస్పత్రికి వచ్చాడు''అని వివరించారు.

మందుబాబుల చిత్రాలు..

మందుబాబుల చిత్రాలు..

తమిళనాడులో కరోనా కేసులు పెరుగుతుండటంతో మద్యం అమ్మకాలపై హైకోర్టు నిషేధం విధించింది, కానీ ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడంతో అమ్మకాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. నాగపట్నం జిల్లాలో మద్యం మత్తులో మందు బాటిల్ ను మలద్వారంలో గుచ్చుకున్న ఘటన మరువక ముందే మందుబాబుల విచిత్రాలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి. కంటైన్మెంట్ జోన్లలోని మందు బాబులు ఏకంగా సముద్ర మార్గం గుండా ప్రయాణించి మద్యం కొనుక్కెళుతున్నట్లు వెల్లడైంది. చేపల వేటగాళ్లకు అదనంగా డబ్బులిచ్చి.. వాళ్ల బోట్లలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి లిక్కర్ కొనుగోలు చేస్తున్నారు. వైన్ షాపులు రీ ఓపెన్ అయిన తర్వాత రాష్ట్రంలో క్రైమ్ రేటుతోపాటు కరోనా వ్యాప్తి రేటు కూడా గణనీయంగా పెరిగింది.

భారీగా కేసులు.. అయినా సడలింపులు..

భారీగా కేసులు.. అయినా సడలింపులు..

దేశవ్యాప్త లాక్ డౌన్ జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించకముందే, తమిళనాడు ప్రభుత్వం ఆమేరకు నిర్ణయం తీసుకుంది. ొకవైపు కేసుల సంఖ్య పెరుగుతున్నా, లాక్ డౌన్ 5.0లో రం నుంచి ప్రజారవాణా పున: ప్రారంభంకానుంది. అయితే, చైన్నై సిటీలో మాత్రం ఇప్పుడప్పుడే ఆర్టీసీ బస్సులు తిరగబోవని, ప్రైవేటు వాహనాలను మాత్రం అనుమతిస్తామని సీఎం పళనిస్వామి చెప్పారు. గరిష్టంగా 60 మందితో టీవీ సీరియళ్ల షూటింగ్స్ కు కూడా అనుమతించారు. పని ప్రదేశంలో రూల్స్ తప్పనిసరిగా పాటించాల్సిఉంటుందని షరతులు విధించారు.

తమిళనాడులో మిడతల విధ్వంసం..

తమిళనాడులో మిడతల విధ్వంసం..

రాజస్థాన్ గుండా భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తానీ మిడతల దండు.. ఒక్కో రాష్ట్రాన్ని దాటుకుంటూ తమిళనాడుకు చేరాయి. ఇక్కడి నీలగిరి తదితర జిల్లాలో అరటి, రబ్బరు తోటల్ని మిడతలు ధ్వంసం చేశాయని అధికారులు చెప్పారు. మిడతలదాడి విషయంలో ప్రభుత్వం సీరియస్ గా వ్యవహారించాలని ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ డిమాండ్ చేశారు. మంత్రి ఆర్బీ ఉదయ్ కుమార్ శనివారం బాధిత జిల్లాల అధికారులతో మాట్లాడుతూ.. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కేరళలోనూ మిడతల దాడి కొనసాగినట్లు వార్తలు వచ్చాయి.

English summary
A tamil nadu Drunk man inserts glass bottle into body through anus, surgically removed. Tamil Nadu extends coronavirus lockdown till June 30 but with more relaxations. Swarm Of Locust Species Attack Crops In Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X