వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీశాంత్, రూపా సహా పలువురి ఓటమి: విజయకాంత్‌కు 'డబుల్' షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం/చెన్నై: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. తమిళనాడు, అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలలో మూడు రోజుల క్రితం ఎన్నికలు జరిగాయి. ఈ రోజు ఓట్ల లెక్కింపు జరుగుతోంది.

కేరళలో బీజేపీ అభ్యర్థి, క్రికెటర్ శ్రీశాంత్ వెనుకంజలో ఉన్నాడు. తమిళనాడులో శరత్ కుమార్ వెనుకంజలో ఉన్నాడు. డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ ప్రభావం తమిళనాట ఏమాత్రం కనిపించడం లేదు. ఆయన స్వయంగా ఓడిపోవడంతో పాటు డీఎండీకే కూటమి కూడా సున్నాకే పరిమితం అయింది.

ఈ ఎన్నికల బరిలో నిలిచిన ప్రముఖులంతా దాదాపుగా విజయం దిశగా సాగుతుండగా, కొందరు మాత్రం ఓడిపోయారు. తమిళనాడులోని తిరుచెందూరు నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు శరత్ కుమార్ ఓడిపోయారు.

Tamil Nadu election results: Captain Vijayakanth trailing, AIADMK has comfortable lead

కేరళ రాజధాని తిరువనంతపురంలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా ఓడిపోయారు. మరోవైపు, డీఎండీకే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ కూటమి ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. ఓ వైపు అన్నాడీఎంకే, డీఎంకే కూటమి మధ్య హోరాహోరీగా ఉండగా, మరోవైపు డీఎండీకే కూటమి సున్నాకే పరిమితం అవుతోంది.

ఓడిపోయిన ప్రముఖులు

కేరళలో బీజేపీ తరఫున పోటీ చేసిన క్రికెటర్ శ్రీశాంత్ ఓటమి
కేరళలో ప్రముఖ బీజేపీ నేత రాజశేఖరన్ ఎటమి
కేరళలో యూడీఎఫ్ పార్టీ అభ్యర్థి మణి ఓటమి
తమిళనాడులో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన విజయకాంత్ ఓటమి
పీఎంకే అభ్యర్థి అన్‌బమణి రాందాస్ ఓటమి
తమిళనాడులో శరత్ కుమార్ ఓటమి
బెంగాల్లో బీజేపీ హౌరా నార్త్ నుంచి పోటీ చేసిన నటి రూపా గంగూలీ ఓటమి
బెంగాల్లో ప్రముఖ నేతలు సూర్యకాంత్ మిశ్రా, దీపా మున్షీలు ఓటమి.

English summary
Tamil Nadu election results: Captain Vijayakanth trailing, AIADMK has comfortable lead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X