వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 70 కోసం 35 నిమిషాలు రాద్దాంతం, ఏమనుకుంటున్నావ్? నేను ఎవరో తెలుసా? మాజీ ఎమ్మెల్యే!

|
Google Oneindia TeluguNews

చెన్నై: టోల్ గేట్ లో రూ. 70 చార్జీ చెల్లించే విషయంలో ఓ మాజీ ఎమ్మెల్యే తగాదాకు దిగడంతో సుమారు రూ. 35 నిమిషాల పాటు వాహనచోదకులు నానా అవస్థలు పడ్డారు. ఎమనుకుంటున్నావ్ ?, నేను ఎవరో తెలుసా ?, మాజీ ఎమ్మెల్యే అంటూ ఆమె వాదనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు, టోల్ గేట్ అధికారులు వచ్చి మాజీ ఎమ్మెల్యేతో చర్చలు జరిపి వారి వాహనం ఉచితంగా పంపించివేయడం గొడవ సద్దుమనిగింది. ఎందుకు ఇంత రామాయణం జరిగింది ? అంటూ అక్కడి వాహనచోదకులు ఆరా తీశారు. రూ. 70 కోసం ఇంత రాద్దాంతం జరిగిందని తెలుసుకున్న తరువాత మాజీ లేడీ ఎమ్మెల్యే మీద మండిపడ్డారు.

పేరుకు పార్క్, బెడ్ రూంలు ఎంతో నయం, కామంతో రెచ్చిపోయి పాడుపనులు, మహిళలు పరుగో పరుగు !'

 టోల్ గేట్ లో బాల భారతి

టోల్ గేట్ లో బాల భారతి

తమిళనాడులోని దిండుగల్ మాజీ ఎమ్మెల్యే (సీపీఎం) బాల భారతి. కరూరు- తిరుచ్చి జాతీయ రహదారిలో మనవాసి టోల్ గేల్ లోకి మారుతి ఆల్టో కారులో దిండుగల్ మాజీ ఎమ్మెల్యే బాల భారతి వెళ్లారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల భారతి టోల్ గేట్ మీదుగా ఉచితంగా వెళ్లేందుకు ప్రయత్నించారు.

మేడమ్ ఫ్లీజ్ రూ. 70

మేడమ్ ఫ్లీజ్ రూ. 70

టోల్ గేట్ మీదుగా వెళ్లేందుకు మేడమ్ మీరు రూ. 70 చెల్లించాలి అని అక్కడ ఉన్న సిబ్బంది (టోల్ గేట్ ఉద్యోగులు) మాజీ ఎమ్మెల్యే బాల భారతికి చెప్పారు. తాను మాజీ ఎమ్మెల్యే అని, తాను ఎందుకు ఎంట్రీ ఫీజ్ చెల్లించాలని బాల భారతి టోల్ గేట్ ఉద్యోగులను ప్రశ్నించారు.

మాజీ ఎమ్మెల్యేలకు నో చాన్స్

మాజీ ఎమ్మెల్యేలకు నో చాన్స్

టోల్ గేట్ నుంచి ఉచితంగా మాజీ ఎమ్మెల్యేలు ప్రయాణించడానికి అవకాశం లేదని, మీరు రూ. 70 చెల్లించి వెళ్లాలని అక్కడి ఉద్యోగులు మాజీ ఎమ్మెల్యే బాల భారతికి తేల్చి చెప్పారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల భారతి వెంట వెళ్లిన సీపీఎం పార్టీ కార్యకర్తలు వెళ్లి టోల్ గేట్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు.

నానా రచ్చ చేసిన మాజీ ఎమ్మెల్యే

నానా రచ్చ చేసిన మాజీ ఎమ్మెల్యే

ఏయ్ ఏమనుకుంటున్నావ్ ?, నేను ఎవరో తెలుసా ?, అంటూ బాల భారతి గొడవకు దిగారు. ఎటువంటి పరిస్థితుల్లో రూ. 70 చెల్లించనని, కావాలంటే ఇక్కడే ఉంటానని మాజీ ఎమ్మెల్యే బాల భారతి తేల్చి చెప్పారు. ఆ సమయంలో సుమారు 35 నిమిషాల పాటు వాహనాలు ఆ దారిలో నిలిచిపోయాయి. వాహనాలు నిలిచిపోవడంతో వాహన చోదకులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే బాల భారతి అక్కడ నానా రచ్చ చేశారు.

అమ్మా మీరు వెళ్లండి

అమ్మా మీరు వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే బాల భారతి రాద్దాంతం గురించి తెలుసుకున్న మాయనూరు పోలీసులు, టోల్ గేట్ అధికారులు అక్కడికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే బాల భారతితో మాట్లాడారు. తాను ఎటువంటి పరిస్థితుల్లో టోల్ చార్జీ రూ. 70 చెల్లించనని మాజీ ఎమ్మెల్యే బాల భారతి తేల్చి చెప్పారు. గొడవ పెద్దదికావడంతో బాల భారతి ఎమ్మెల్యే అని అక్కడి రిజిస్టర్ లో నమోదు చేసుకున్న టోల్ గేట్ అధికారులు అమ్మా మీరు మొదట ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ బాల భారతికి మనవి చేశారు.

అధ్యక్షా........ రూ. 70 కోసం ఇంత రామాయణమా ?

అధ్యక్షా........ రూ. 70 కోసం ఇంత రామాయణమా ?

బాల భారతి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు, టోల్ గేట్ అధికారులు, సిబ్బంది అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేశారు. రూ. 70 కోసం సుమారు 35 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోవడంతో వాహన చోదకులు మాజీ ఎమ్మెల్యే బాల భారతి తీరుపై మండిపడ్డారు.

English summary
Tamil Nadu Ex CPM MLA Bala Bharathi argued with manavasi tollgate employees near Trichy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X